Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Features >> Jeevana Rekha


లివర్ క్యాన్సర్

CDRLivarహెపటో లేదా హెపాటిక్ అని అంటారు. దీనికి అర్థం కాలేయం అని జీవవూపక్షికియలలో కీలక పాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తించి పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్ద అవయవమైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా కూడా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజించబడి ఉండే కాలేయం దాదపు ఒకటిన్నర కిలోల వరకు బరువు ఉంటుంది.

విషతుల్యమైన పదార్థాల వల్ల కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, స్మోకింగ్ వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపుకు గురవుతుంది. దానిని హెపటైలీస్ అంటారు. హెపటైటీస్‌కు గురిచేకసే వైరస్ ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి, వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్‌లు సోకకుండా మూడు డోసులవ్యాక్సిన్ ఉండి కాని హెపటైటిస్‌బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ వేయిస్తే చాలా మంచిది. ఆకలి తగ్గటం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నపుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం వంటి సోంత వైద్యాలు చేసుకోకుండా కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్‌ఫెక్షన్స్ ఫ్యాటి లివర్, లిర్ వెబ్‌సెస్, విల్సన్ డిసీజ్, గిల్‌బర్డ్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి, సి, వైరస్ కలుగజేసే ఇన్‌ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తర్వాత కాలేయనాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం(సిపూరోసిస్) తర్వాత క్యాన్సర్‌కు దారితీయటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్-బి, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లిర్ క్యాన్సర్స్ ఎక్కువే. లివర్ క్యాన్సర్‌లో హెపటుసెట్యూలార్‌కార్సినోమా, మెటాస్టామిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలుంటాయి.

జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్లు, ఇలా ఏ క్యాన్సర్స్ అయినా కాలేయానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. లేటుగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పెర్కొనవచ్చు.
పొట్ట సంబంధిత క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు తర్వాత లివర్ క్యాన్సర్లు ఎక్కువ. ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్ -బి, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో ఈ క్యాన్సర్ తక్కువే అయినా హెపటైటిస్ - సి, వైరస్‌వల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల ఈ క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య ఈ దేశాలలో కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా వంటి దేశాలలో స్థిరపడిన ఆసియా దేశస్థులలో హెపటైటిస్-బి ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. పుట్టినపుడే ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నా 30, 40 ఏళ్లలో లక్షణాలు బయటపడం, క్యాన్సర్‌కు గురవటం జరుగుతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, హెపటైటిస్ బి పాజిటివ్‌కు ఆల్కహాల్ తోడయితే త్వరగా ముదిరిపోవడం, చికిత్సకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది.

కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించక పోవడం వల్ల ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఎక్కువ. కడుపులో నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, పొట్టలో నీరు చేరటం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షనాలు కనిపించినా హైపటైటీస్ బి, సి వైరస్ పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా, రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, కాల్షియం లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను, ఆల్ఫాఫిటా ప్రొటిన్ ను తెలిపే రక్త పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు సీటీ, ఎంఆర్‌ఐ, పెప్ స్కాన్‌లు లివర్ బయాప్సి చేయిస్తే లివర్ క్యాన్సర్, స్టేజ్ వంటి వాటిని ముందుగానే తలుసుకోవచ్చు.

mohanట్యూమర్ సైజు, కాలేయంలో వచ్చిన ప్రదేశాన్ని బట్టి చికిత్స, జీవితకాలం ఆధారపడి ఉంటాయి. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే కణితి రెట్టింపు అయితే మరికొందరిలో సంవత్సరం పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులోనే గుర్తించినా లివర్ సిర్రోసిస్‌కు గురవటం వల్ల చాలా మందిలో సర్జరి కుదరక పోవచ్చు. మందులతో కీమోథెరపి, ట్రాన్స్ ఆర్టిరియల్ కీమోఎంబో లైజేషన్, రేడియో అబ్లేషన్, ప్రోటాన్ బీమ్‌థెరఫీ, బయోథెరఫీ, క్రిమోఅబ్లేషన్, స్టీరియో టాక్టర్ రేడియో సర్జరి వంటి అనేక పద్ధతులలో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. కణితి చిన్నగా ఉండి మిత కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురి కాకుండా ఉంటే సర్జరినే సరియైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణితులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉండే లివర్ ట్రాన్స్‌ప్లాం వల్ల ఫలితాలు ఉంటాయి. వీరికి కాలేయం దానం చేకసే వారు, బ్రెయిన్ డెడ్ అయిన వారు దొరికే వరకు మిగతా అనేక చికిత్సా పద్ధతులను ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ కు ప్రధాన కారణం హెపటైటీస్ బి వైరస్ కాబట్టి పుట్టిన పిల్లలందరికి ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా చాలా వరకు నివారించగలిగిన వారమవుతాము. ఆరోగ్యకరమైన జీవన శైలీ, ముందు ఎపుడైనా ఇతర క్యాన్సర్లకు గురయి ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రినింగ్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది.

చాలా మందిలో హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నా సంవత్సరాల తరబడి ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు కాని వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సి ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవటం, ఒకవేళ ప్రెగ్నెన్సిలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఇప్పించటం మంచిది. ఒకవేళ ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం శరీరంలో ప్రవేశించినట్లు భయం ఉన్నా ముందు జాగ్రత్త చర్యగా ఆ సంఘలన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బిఐజీ ఇన్‌జంక్షన్ తీసుకుంటే హెపటైటిస్ బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine