Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Features >> Jeevana Rekha


సదుపాయాలివ్వండి .. మేం రెడీ!

Doctor talangana patrika telangana culture telangana politics telangana cinema
‘కులం.. జాతి.. మతం.. పేద... ధనిక తేడా లేకుండా పేషెంటును మాత్రమే చూడగలిగినవాడే నిజమైన వైద్యుడు.’ ఇదీ ఆయన నమ్మిన సిద్ధాంతం. పేషెంటు ఎవరైనా సరే.. ఆ హృదయాన్ని పదిలంగా పొదివి పట్టుకునే కళ ఆయనకు బాగా తెలుసు. అయిదు దశాబ్దాలకు పైగా కార్డియాలజిస్టుగా లక్షల మంది గుండెచప్పుళ్లను విన్న ఆయనే డాక్టర్ దయాసాగర్ రావు. గ్రామాల్లో వైద్యం అందించడానికి డాక్ట్లప్పుడూ సిద్ధమే. ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోవ ఆయనతో ముఖాముఖి...


1973వ సంవత్సరం..
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫండ్ అని మొదపూట్టింది ప్రభుత్వం. ఆంధ్రవూపదేశ్‌లో మొట్టమొదటి కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ హైదర్ ఖాన్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజగోపాల్ సారథ్యంలో వైద్యకళాశాలల అభివృద్ధికి పోరాటం మొదలైంది. సరైన ఉపకరణాలు లేకుండా వైద్యవిద్యను అభ్యసించడం ఎలా..? తగిన పరికరాలు లేకుండా వైద్యం అందించేదెలా..? డాక్టర్ హైదర్ ఖాన్ దగ్గరే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ దయాసాగర్‌రావు కూడా అందులో ఉన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫండ్ సాయంతో గాంధీ ఆసుపవూతిలో కార్డియాక్ కెథటర్ ల్యాబ్ తీసుకొచ్చారు. అందుకు వారందరూ రెండుసార్లు ఇంక్రిమెంట్లు కూడా అందుకున్నారు. ఆ తరువాత మొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఈ సంఘటన పెద్ద విజయంగా అనిపిస్తుందంటారు డాక్టర్ దయాసాగర్‌రావు. ప్రభుత్వంతో పోట్లాడి మరీ అవసరమైన సదుపాయాన్ని తెచ్చుకున్న మమ్మల్ని అసెంబ్లీ అంతా మెచ్చుకుందంటారు మెరుస్తున్న కళ్లతో. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ తాలూకా కొండూరు గ్రామానికి చెందిన దయాసాగర్‌రావు ఇప్పుడు పేరెన్నికగన్న హృద్రోగ నిపుణులు.

చిన్నప్పటినుంచి జీవశాస్త్రంపై మక్కువతో మెడిసిన్‌లో చేరిన ఆయన కార్డియాలజీ ఎంచుకోవడానికి కారణం మాత్రం కార్డియాలజిస్టులకు ఉన్న ప్రత్యేక గౌరవమే. అప్పట్లో కార్డియాలజీ చదివినవాళ్లంటే డాక్టర్స్ కమ్యూనిటీలో ఒక ఉన్నతమైన స్థానం ఉండేది. దానివల్లే నేను కూడా ఆ గొప్ప స్థానానికి చేరుకోవాలి కార్డియాలజీ తీసుకున్నానంటారాయన. అప్పట్లో ఇన్ని ప్రైవేటు కాలేజీలు లేవు. ఇంజనీరింగ్‌కి మొత్తం తెలంగాణాలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీయే ఏకైక ఇంజనీరింగ్ కళాశాల. గాంధీ వైద్యకళాశాల మొట్టమొదటి ప్రైవేటు మెడికల్ కాలేజీ. ఆ తరువాత వరంగల్ మెడికల్ కాలేజీ. కాబట్టి చదివేవాళ్లూ తక్కువగా ఉండేవారు. అందుకే ఉద్యోగాలు కూడా ఇప్పుడంత కష్టం కాదు. హౌస్‌సర్జన్సీ పూర్తికాకముందే పోస్టింగ్ ఆర్డర్లు చేతిలో పడేవని చెప్పారు డాక్టర్ దయాసాగర్‌రావు.

పరికరాల్లేకుండా వైద్యమా..?
1904లో మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్‌లో సివిల్ అసిస్టెంట్‌గా చేసేటప్పుడే పీజీ కొరకు లండన్ వెళ్లాను. అప్పట్లో పైచదువుల కోసం ఎడ్యుకేషన్ లీవ్ ఉండేది. కాబట్టి నాకు అయిదేళ్ల సెలవు అంటే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల సెలవు మంజూరు అయింది. ఎటువంటి పైరవీలు లేకుండా. ఇప్పుడసలు అలాంటి సదుపాయమే లేదు. పాస్‌పోర్టు కావాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి. యుకేలో వీసా అక్కర్లేదు. వర్క్ పర్మిటెడ్ ఉంటే చాలు. కాబట్టి సులువుగానే వెళ్లగలిగాను. రెండున్నరేళ్లలో ఎంఆర్‌సీపీ అయిపోయింది. ఇంకా టైమ్ ఉంది. అందుకే ఈఎస్‌ఎఫ్‌ఎంజీ కూడా చేశా. ఈలోపు ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది. టైమ్ అయిపోయింది. జాయిన్ అవమని.

కానీ వచ్చిన తరువాత నాకు సీనియారిటీ లేనందువల్ల ఉద్యోగం లేదన్నారు. నా ఉద్యోగం నేను తిరిగి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఉద్యోగం అయితే తిరిగి తెచ్చుకోగలిగాను గానీ పనిలో సంతృప్తి మాత్రం ఉండేది కాదు. గాంధీలో గానీ, ఉస్మానియాలో గానీ అవసరమైన వైద్యపరికరాలు, మందులు ఏవీ అందుబాటులో ఉండేవి కావు. సంవత్సరం తరువాత విసుగొచ్చింది. అందుకే వెల్లూరు సీఎంసీకి అప్లై చేశాను. అక్కడే కార్డియాలజీ స్పెషలైజేషన్ చేశాను. రెండున్నరేళ్లు అక్కడే గడిచాయి. ఆ తరువాత ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నా. 1983లో వలంటరీ రిట్మైంట్ తీసుకున్నా. దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ వాళ్లు కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రారంభించారు. అందులో జాయిన్ అయ్యాను. 2009 వరకూ అక్కడే స్థిరంగా పనిచేశాను. ఇప్పుడు రెండు మూడు చోట్ల కార్డియాలజిస్టులు పనిచేయలేరని అర్థమై కేవలం కిమ్స్ హాస్పిటల్‌లోనే ఉంటున్నానన్నారు డాక్టర్ దయాసాగర్‌రావు.

అలాంటివాళ్లు అతి తక్కువ....
‘ఎందుకో తెలియదు.. అందరూ మా డాక్టర్లనే అంటారు. కానీ మా వెనుక ఉన్న ఆవేదన అర్థం చేసుకోందుకో. ఐఐటి చదివినవాళ్ళు భేషుగ్గా విదేశాలకు వెళ్లొచ్చు. మేము వెళ్లాలంటే మాత్రం పాస్‌పోర్ట్ కోసం కూడా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ సెలవులైతే అసలే లేవం’టూ ఆవేదన చెందారు డాక్టర్ దయాసాగర్‌రావు. డాక్టర్లంటే డబ్బులు దండుకునేవాళ్లనీ, అనవసరంగా టెస్టులు రాస్తారనీ, ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై ఖరీదైన మందులే రాస్తారనీ.. ఇలా రకరకాల అపవాదులు మాపై ఉన్నాయి. అలా చేసేవాళ్లు లేరని అనను కానీ అది కేవలం ఓ 5 నుంచి పది శాతం మంది మాత్రమే. ఎవరో కొందరు ప్రాణాల కన్నా డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని డాక్టర్లందరూ అలాంటివాళ్లే అనడం కరెక్ట్ కాదు కదా. నిజానికి వైద్యవృత్తిలోకి వచ్చినవాళ్లలో 90 శాతం కన్నా ఎక్కువ మంది పేషెంటును ఎంతవరకు ఆరోగ్యం అందివ్వగలం అన్నదాని పైనే దృష్టి పెడతారు. నిజాయతీతో వైద్యాన్ని అందించడానికే కష్టపడతారు. అయినా వైద్యరంగాన్ని ఒక ఇండస్ట్రీగా ఇందిరాగాంధీ ప్రకటించినప్పుడే ఇది వ్యాపారం అయిపోయింది. ఒక ఇండస్ట్రీలో ఉండే వ్యాపారవిలువలన్నీ ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నాయి. లోపం సంస్థాగతంగా ఉన్నప్పుడు తప్పు మాది ఎలా అవుతుందని ప్రశ్నిస్తారాయన.

బాధ్యత ప్రభుత్వానిది...
ఇకపోతే మందులు.. మల్టీనేషనల్ కంపెనీల మందులే రాస్తారు అంటారు. కానీ వాటిలో ఉన్న నాణ్యత దేశవాళీ మందుల్లో ఉంటుందా..? ఏవి సమర్థవంతంగా పనిచేస్తాయో వాటినే మేము రాస్తాం. ఇక ఖరీదు విషయానికి వస్తే మందుల క్వాలిటీ కోసం ఖర్చవుతుంది కాబట్టి మెడిసిన్ ఖరీదు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుందంటాయి కంపెనీలు. కొన్నిసార్లు పేషెంట్లు కూడా ఖరీదైన మందులైతేనే బాగా పనిచేస్తాయన్న అభివూపాయంతో ఉంటారు. తక్కువ ఖరీదువి రాస్తే పనిచేయవని ఫీలవుతుంటారు.

అంతేగాక మల్టీనేషనల్ కంపెనీలవి తప్ప తక్కువ ఖరీదు మందులు అమ్మే మందుల దుకాణాలు కూడా ఇప్పుడు లేవు. దీని కారణాలివైతే మధ్యలో మేము అపవాదులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వమే ఈ మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతులిచ్చింది. ఒకే మందు కంపెనీ మారితే దాని ఖరీదు కూడా మారిపోతుంది. అలా కాకుండా ఫలానా మెడిసిన్ ఖరీదు ఇంత మాత్రమే ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టొచ్చు. ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తున్న ఫార్మాకంపెనీలను కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వం. ఈ విషయం వదిలేసి మాపైన కోపం ఎందుకంటారాయన.

సౌకర్యాలను బట్టే ఫీజులు...
కార్పొరేట్ ఆసుపవూతులు టెస్టుల పేరుతో దోచుకుంటున్నాయి అంటారు. కానీ దాని వెనుక ఆసుపవూతుల కష్టం అర్థం కాదు. ఉదాహరణకు ఒక ఆంజియోక్షిగామ్ పదివేల రూపాయలు. దాని పరికరం ఖరీదే రెండున్నర లక్షలు. ఇక కరెంటు బిల్లు, టెక్నీషియన్ల జీతాలు, డిస్పోజబుల్ పరికరాలు, ఇతర వైద్యపరికరాల ఖర్చు ఉండనే ఉంటాయి. వీటిలో డాక్టర్ తీసుకునే ఫీజు 800 రూపాయలు మాత్రమే. ఆసుపవూతికి వచ్చే లాభం వెయ్యిరూపాయలు. ఆసుత్రి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం ఆసుపత్రి లాభం చూసుకోవడం తప్పదు.

ప్రభుత్వ ఆసుపవూతుల్లో ఎక్కువ మంది పేషెంట్లు తక్కువ మంది డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండవు. ఆరోగ్యానికి అతి ముఖ్యమైనదైన శుభ్రత ఉండదు. పేరుకు ధర్మాసుపత్రే గానీ ప్రతీచోట మామూళ్లు ఇచ్చుకోవాలి. ఈ అసౌకర్యాలేవీ ప్రైవేటు ఆసుపవూతుల్లో ఉండవు. అందుకే పేదవాళ్లు సైతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపవూతులకు రావడానికే మొగ్గు చూపుతున్నారు.

టెస్టులు రాయడం వెనుక...
అవసరం లేకున్నా రకరకాల టెస్టులు రాస్తామంటారు. కానీ వినియోగదారుల కోర్టు రావడమే దీనికి కారణం అంటారాయన. ఇంతకుముందు పేషెంటు ఆరోగ్య బాధ్యతలు పూర్తిగా డాక్టర్ పైనే ఉండేవి. కానీ ఇప్పుడు మేము కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలం. పాటించడం పాటించకపోవడం వాళ్ల ఇష్టం. ఒక జబ్బును ఎదుర్కోవడానికి ఉన్న మార్గాలు.. వాటిలోని లాభనష్టాలు వివరించడం మా వంతు. ఏది కరెక్టన్నది నిర్ణయించుకోవాల్సింది పేషెంట్లే. సొంత నిర్ణయం తీసుకుంటే ఖర్మకాలి ఏమైనా జరిగితే మళ్లీ అదో కేసవుతుంది.

ఎందుకొచ్చిన కష్టం అనుకుంటున్నారు డాక్టర్లు. ఉదాహరణకు ఏ తలనొప్పితోనో వచ్చిన పేషెంటుకు కొద్దిరోజులు మందులు వాడిచూసి తగ్గకపోతే స్కాన్ చేయించవచ్చు. తగ్గిపోతుందిలే అని చెప్పారనుకోండి. తరువాత స్కాన్ చేస్తే మెదడులో ఏ గడ్డో కనిపిస్తే ఇక ఆ డాక్టర్ నిర్లక్ష్యం అంటారు. నిజానికి చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. అందుకే ముందే పరీక్షలు రాసేస్తే ఆ తరువాత తమ తప్పు ఉండదన్న ఆలోచనతో ఉంటున్నారు. అయితే టెస్టులను ఫలానా సెంటర్‌లోనే చేయించుకోమని డాక్టర్లు సలహా ఇవ్వకూడదు. అక్కడైతే కచ్చితమైన రిజల్టు వస్తుందని తెలిసినా సరే. ఎందుకంటే ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌తో డాక్టర్‌కి ఏవో సంబంధాలున్నాయి కాబట్టే దాన్ని సిఫారసు చేశాడంటారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలంటే ఇన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. అందుకే మా వృత్తి కత్తి మీద సామేనంటారు డాక్టర్ దయాసాగర్‌రావు.

మేమూ మనుషులమే!
ప్రభుత్వంతో పాటు మమ్మల్ని అందరూ వెలివేసినట్టు చూస్తున్నారు. గ్రామాల్లో సేవలందించ నిష్టూరాలాడతారు. ఇంజనీర్లు, టీచర్లు కూడా అవసరమే కదా. వాళ్లూ వెళ్లాలని ఎందుకు ఒత్తిడి తీసుకురారు? మేమూ మనుషులమే కదా. మాకూ రిలాక్సేషన్ కావాలనిపిస్తుంది. పగలూ రాత్రీ తేడా లేకుండా పేషెంట్లను చూసినప్పుడు కాస్త మానసికోల్లాసం కావాలనుకోవడం తప్పవుతుందా? గ్రామాలకు వెళ్లడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ మాకు ప్రాథమిక వసతులు కూడా లేవే! ఉండడానికి మంచి ఇల్లు ఉండదు.

పిల్లల్ని చదివించడానికి స్కూల్ ఉండదు. కాస్త రిలాక్స్ కావాలంటే ఓ ప్లేగ్రౌండూ ఉండదు.. మహా అంటే ఓ సినిమా హాలు. మా పిల్లలు కూడా మంచి స్కూల్స్‌లో చదవాలని ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో మేము గ్రామాల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆ సదుపాయాలన్నీ కల్పిస్తే వెళ్లడానికి చాలామంది ముందుకొస్తారంటారాయన.

వైద్యవిద్యను అయిదేళ్ల నుంచి నాలుగేళ్లకు కుదించారు. దీనివల్ల సబ్జెక్టును కూలంకషంగా అభ్యసించడం సాధ్యం కాదు. కనీసం ఈ సంవత్సర కాలాన్ని గ్రామాల్లో పనిచేయడానికి కేటాయిస్తే బావుంటుంది. తప్పనిసరిగా ఓ సంవత్సర కాలం గ్రామంలో వైద్యసేవలందించాలన్నది కూడా కోర్సులో భాగం చేయాలి. దానికి మార్కులు కలపాలి. గ్రామాల్లో ఆయా విద్యార్థుల సేవలను బట్టే ఫైనల్ మార్కులు వేయాలి. కొత్తగా వైద్యవిద్యలోకి అడుగుపెట్టిన విద్యార్థికి జిజాస ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంతోషంగా, శ్రద్ధగా గ్రామీణ పేషెంట్లను చూస్తాడు. కాబట్టి వాళ్లను ఒత్తిడి పెట్టినట్టు కూడా ఉండదు. ఇలా అయితే గ్రామాల్లో కూడా వైద్యం అందుబాటులోకి తేవడం సులువు అవుతుందని సూచిస్తున్నారు డాక్టర్ దయాసాగర్ రావు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine