సొరియాసిస్‌ను జయించవచ్చు
సొరియాసిస్ సోకితే ఇక జీవితం ముగిసిన చాలా మంది భావిస్తుంటారు. అంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడలేమని అనుకుంటారు. కానీ హోమియో చికిత్సతో సొరియాసిస్ నుంచి సులువుగా బయటపడవచ్చు.సొరియాసిస్ తీవ్రమైన చర్మ సంబంధ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తరువాత తెల్లటి పొలుసుల మాదిరిగా రాలిపోతుంది. విపరీతమైన దురద ఉంటుంది. ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సాధరణంగా చర్మంలో కణజాల ఉత్పత్తి, కణజాల మార్పు నెలకొకసారి జరుగుతుంది. సొరియాసిస్ వ్యాధి సోకితే కొన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది.సొరియాసిస్‌లో.. గట్టేడ్, క్రానిక్ ప్లేక్, పస్టులర్, ఎరివూతోడెర్రా, నెయిల్ సోరియాసిస్, ఫ్లెక్సరల్, ఆర్థ్రోపతి సొరియాసిస్ వంటి రకాలున్నాయి. గట్టెట్ సొరియాసిస్ పిల్లలు, యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. క్రానిక్ ప్లేక్ సొరియాసిస్ సాధారణంగా కనిపించే రకం. 90 శాతం కేసుల్లో ఈ రకం సొరియాసిస్ కనిపిస్తుంది. చర్మం ఎర్రగా, చుట్టూ వెండి పొరలాగా మెరుస్తూ ఉంటుంది. మోకాలు, మోచేతులు, తల భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. పస్టులర్ సొరియాసిస్ బారిన పడిన వారిలో జ్వరం ఉంటుంది. ఎరివూథోబెర్మిక్ సొరియాసిస్ మూలంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది శరీరమంతా విస్తరిస్తుంది. హైపోథెర్మియా, హైపోఅల్బుమినేమియా, అనీమియా, కార్డియాక్ ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. 50 శాతం మంది సొరియాసిస్ రోగుల్లో సోరియాటిక్ నెయిల్ డిసీజ్ ఉంటుంది.
కారణాలు
సొరియాసిస్ ఎవరికైనా రావచ్చు. అయితే ఈ అంశాలు సొరియాసిస్ రావడానికి ఎక్కువగా దోహదపడతాయి. కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే వంశపారంపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. దీనికి ఒత్తిడి కూడా కారణమే. ఒత్తిడి ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది. అధిక బరువు మూలంగా ఇన్‌వర్స్ సొరియాసిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం కూడా వ్యాధి వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తాయి. హెచ్‌ఐవీ వంటి వ్యాధులతో బాధపడే వారిలో సొరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడకపోవడం, చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఇష్టానుసారంగా మందలు వాడటం వల్ల జీవరసాయనాల అసమతుల్యత వల్ల సొరియాసిస్ ప్రారంభమవుతుంది.
నిర్ధారణ
చర్మం, తల, కాలిగోళ్లు, చేతి గోళ్లు పరిశీలించడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. స్కిన్ బయాప్సీ పరీక్ష సొరియాసిస్ నిర్ధారణకు ఉపకరిస్తుంది.
హోమియోచికిత్స
సొరియాసిస్‌కు హోమియో వైద్య విధానంలో చక్కని చికిత్స అందుబాటులోఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్స కణజాల స్థాయికి తీసుకువస్తుంది. గ్రాఫైటిస్, సెపియా, లైకోపోడియం, కాలికార్బ్, కాలిఫాస్, బ్రయోనియా, మొర్క్ వంటి మందులు సొరియాసిస్ చికిత్సలో బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా కాలం ఉంటుంది. సొరియాసిస్ ఎంత కాలంగా ఉంది? ఏయే ప్రదేశాల్లో విస్తరించి ఉంది? కీళ్లలోకి విస్తరించిందా? గతంలో తీసుకున్న చికిత్స ఏమిటి? ఇతర వ్యాధులేమైనా ఉన్నాయా? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సొరియాసిస్ ఉందని తెలిసిన వెంటనే డిప్రెషన్‌లో కూరుకుపోకుండా నిపుణులైన హోమియో వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
Other News