Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Features >> Jeevana Rekha


అతి ప్రమాదకరం నీటికాసులు

Glaucoma
కంటి చూపును దెబ్బతీసి అంధత్వాన్ని తెచ్చే జబ్బుల్లో నీటి కాసుల వ్యాధి చాలా ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6.6 లక్షల మంది ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఒక అంచన. పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకుండా హఠాత్తుగా అంధత్వానికి గురిచేసే భయంకరమైన జబ్బు ఇది. సాధారణంగా మధుమేహ వ్యాధిక్షిగస్తులలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి గురించిన అవగాహన కూడా సామాన్య ప్రజనికానికి చాలా తక్కువ. డాక్టర్ మానాన్న గారికి హఠాత్తుగా కళ్లు కనిపించడం లేదు కాస్త చూడండి. ఆందోళనగా అన్నాడు శరత్. మధుమేహ రోగి అయిన శరత్ నాన్నగారి దృష్టి ఎలా దెబ్బతిన్నదో వెంటనే అర్థమైంది డాక్టర్‌కి. చాలా మంది తమ దృష్టి బాగానే ఉంది కదా అని దృష్టి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంలో అలసత్వం చూపుతారు. ఫలితంగా అంతర్గతంగా ఉండి చూపు మీద దారుణంగా దాడి చేసే నీటి కాసుల బారిన పడి చూపు కోల్పోతారు. శరత్ నాన్నగారి పరిస్థితి అదే. ఎటువంటి లక్షణాలు కనిపించకుండా కంటిని నిశ్శబ్దంగా కబళించే ప్రమాదకరమైన జబ్బు నీటికాసులు. దీన్నే గ్లకోమా అంటారు. మధుమేహ వ్యాధిక్షిగస్తుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి చికత్స కూడాచాలా కష్టతరమైంది. కాబట్టి దీన్ని నివారంచే దశలో అవగాహన పెంపోందించుకోవడం అవసరం.

దృష్టినాడి దెబ్బతింటే
మన శరీరంలోని కణాలు బతికి ఉండాలంటే వాటికి తగినన్ని పోషకాలు అందుతూ ఉండాలి. అదేవిధంగా కంటికి కావలిస్సన పోషకపదార్థాలను సరఫరా చేయడానికి ఆక్వియస్ హ్యూమర్ అనే ద్రవం కంటిలో రయారవుతూ ఉంటుంది. కార్నియాకు దగ్గరలో ఉండే సీలియర్ బాడీ అనే భాగం దీన్ని తయారు చేస్తుంది. ఇది నిరంతరం కంటిలో ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం సరఫరా అయ్యేటప్పుడు దానిక కొంత పీడనం (ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్-ఐఓపీ) ఉంటుంది. ఈ పీడనం 20 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా ఉంటే అది కంటికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. కంటి నుంచి మెదడుకు సమాచారాన్ని పంపించే ఆప్టిక్‌నర్వ్ (దృష్టినాడీ) నాడి దెబ్బతింటుంది. ఫలితంగా దృష్టికి సంబంధించిన సమాచారాన్ని మెదడు గ్రహించలేదు. తద్వారా వారి పాక్షిక దృష్టి సామర్థ్యం తగ్గిపోతూ క్రమంగా అంధులవుతారు. ఈ స్థితినే నీటికాసులు లేదా గ్లకోమా అంటారు.

కారణాలేమిటి?
కంటి నుంచి సమాచారాన్ని తీసుకెళ్లే ప్రధానమైన నాడి పైన ఒత్తిడి అధికమవడమే కాక గ్లకోమా ఆక్వియస్ హ్యూమర్ పరిమాణం పెరిగిపోయినప్పుడు దాని పీడనం పెరుగుతుంది. తద్వారా కంటిపైన, దృష్టి నాడి పైన ఒత్తిడి ఎక్కువవుతుంది. అందుకు ప్రధాన కారణం ఈ ద్రవం ఎక్కువగా ఉత్పత్తి అవడం లేదా కంటి లోపలికి ప్రవేశించే ద్రవానికన్నా బయటకు వెళ్లే ద్రవపరిమానం తక్కువగా ఉండడం. బయటకు వెళ్లే దారి చిన్నగా, సన్నగా ఉన్నా అవసరానికి మించి ఆక్వియస్ హ్యూమర్ తయారైనా ఈ పరిస్థితి తలెత్తుతుంది. కొన్ని కారణాల వల్ల ఇలా జరిగే అవకాశాలు పెరుగుతాయి.
- వయసు పెరిగిన కొద్ది దృష్టి లోపాలు తలెత్తడం సహజం. అదే విధంగా అరవయ్యేళ్లు దాటిన వారు నీటి కాసుల వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువ.
- మధుమేహం, మయోపియా ఉన్నవారు చాలా సులభంగా ఈ వ్యాధికి గురవుతారు. సాధారణంగా మధుమేహ వ్యాధిక్షిగస్తులు మందులు వాడుతున్నాం కదా అని వ్యాయామం చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. వాటిలో గ్లకోమా ఒకటి.
- కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో గ్లకోమా కలిగే అవకాశం పెరుగుతుంది.
- స్టెరాయిడ్స్ మందులు వాడేవారు నీటికాసుల వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ వ్యాధికి జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వంశంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే వారు గ్లకోమాకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి.

చికిత్స

ఆక్వియస్ హ్యూమర్ ద్రవం తయారీ తగ్గించడానికి మందులను ఇవ్వడం ద్వారా నీటికాసులకు చికిత్స చేస్తారు. లేదా ఫ్లూయిడ్ డ్రైనేజి దవం బయటికు వెళ్లే దారి) పరిమాణాన్ని పెంచుతారు. దీనివల్ల ఎక్కువ మొత్తంలోవూదవం బయటకు వెళ్లడం వల్ల పీడనం తగ్గుతుంది. కళ్లలో వేసుకునే చుక్కల మందు వల్ల కంటి లోపల పీడనాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. కాని కొన్ని రకాల చుక్కల మందు వల్ల కంటి లోపల పీడనాన్ని కొంత వరకు తగ్గించవచ్చు మరికొన్ని రకాల చుక్కల మందులను గుండె జబ్బులున్న వారికి వాడకూడదు. కానీ చాలా వరకు నీటికాసులకు వాడే మందుల వల్ల అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది శస్త్రచికిత్స చేయించుకోవడమే మేలైనదని భావిస్తున్నారు.
- లేజర్ చికిత్స ద్వారా ద్రవాన్ని బయటకు పంపే కెనాల్ పరిమాణాన్ని పెంచవచ్చు.
- ఫిల్టరేషన్ శస్త్రచికిత్స ద్వారా కూడా మంచి ఫలితాను పొందవచ్చు.

నివారణ

ఏరకమైన వ్యాధి అయినా సరియైన చికిత్స కోసం తాపవూతయపడే బదులుగా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నివారణకు అవకాశమున్న నీటికాసుల వంటి వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం కూడదు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కంటి చూపును, కంటిలో పీడనాన్ని పరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందుగా తెలుసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరితే కోల్పోయిన దృష్టిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిక్షిగస్తులు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉంటే నీటి కాసులను ఆదిలోనే అంతం చేయవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine