పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. స్పెషల్ నైట్ ఎఫెక్ట్స్‌తో ఈ పోరాట దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజులు అక్కడే చిత్రీకరణ జరుగనుంది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత డి.వి.వి.దానయ్య సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పవన్‌కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి. జర్నలిస్టులందరూ గర్వపడేలా ఈ సినిమా వుంటుంది’ అన్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రెజిల్ సుందరి గాబ్రియాలా ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది.
| |
|