సినీవార పత్రిక ‘సంతోషం’ పదవ వార్షికోత్సవం ఈ నెల 12న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో దక్షిణభారత సినీ అవార్డ్స్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మాడ్డి భరద్వాజ దశాబ్ది వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. యువహీరో ఆది థీమ్‌సాంగ్‌ను ఆవిష్కరించారు. ‘సంతోషం’ సినీవార పత్రిక అధినేత సురేష్‌కొండేటి మాట్లాడుతూ ‘అందరి ఆదరాభిమానాలతో ‘సంతోషం’ సినీవార పత్రిక విజయవంతంగా పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. అక్కినేని నాగార్జునగారి సలహాతో ఆనాడు సంతోషం అవార్డ్స్‌కు అంకురార్పణ జరిగింది. పదేళ్ల ప్రయాణంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంక అగ్రతారలతో పాటు పరిక్షిశమ అంతా నాకు అండగా నిలిచింది. పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల సినిమాలకు కూడా అవార్డులు ప్రదానం చేయబోతున్నాం’ అన్నారు. తమ్మాడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి సురేష్ అంచెలంచెలుగా గొప్ప స్థాయికి ఎదిగాడు. చిత్ర పరిక్షిశమనంతటినీ ఒక్కవేదికపైకి తీసుకొచ్చే ‘సంతోషం’ దక్షిణాది సినిమా అవార్డ్స్ వేడుక విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ కార్యక్షికమంలో అర్చన, మాధవీలత, శివబాలాజీ, స్వప్నమాధురి, నందిత పాల్గొన్నారు.
| |
|
![]() |
|