అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్షికమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జులాయి’. ఇలియానా కథానాయిక. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్, దేవిశ్రీవూపసాద్‌లపై చిత్రీకరించిన ‘పకడో పకడో..అనే ప్రచార గీతాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ప్రమోషనల్ గీతాలుంటాయి. అక్కడి నుంచి అవి హిందీకి వచ్చాయి. ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ముందుండే త్రివిక్షికమ్ శ్రీనివాస్ అదే తరహా గీతాన్ని తెలుగులో ఇప్పుడు ‘జులాయి’ కోసం చేశాడు. ఈ ప్రమోషనల్ గీతంలో దేవీ, బన్నీ కలిసి వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటాయి’ అన్నారు అల్లు అరవింద్. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రచార గీతాన్ని చేద్దామని దేవితో అన్నప్పుడు ఆయన ‘పట్టుకోవడం’ అనే పదాన్ని సూచించాడు.
సినిమాలో ఈ పాట బన్నీపై వుంటుంది. ఎంతో బిజీగా వున్నా ఈ పాట కోసం దేవి పనిచేశాడు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది’ అన్నారు. దేవీశ్రీవూపసాద్ మాట్లాడుతూ ‘ఈ పాట బాగా రావడానికి బన్నీ కారణం. ప్రతి చిన్న విషయాన్ని అయన దగ్గరుండి చూసుకున్నాడు. జానీ మాస్టర్ ప్రత్యేక శ్రద్దతీసుకుని ఈ పాట చేయించాడు. నిర్మాతలు, త్రివిక్షికమ్ లేకపోతే ఈ పాట ఇంత బాగా వచ్చుండేదికాదు’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ప్రమోషనల్ వీడియో ఐడియా త్రివిక్షికమ్‌దే. సంగీత దర్శకుడు, హీరో కలిసి ప్రమోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. బుల్లితెరలో కుదిరినట్టుగా సినిమాకు ప్రయోగాలు చేయడం కుదరదు’ అన్నారు. ‘దేవీశ్రీ ప్రసాద్ వల్లే దీనికి ఇంత క్రేజ్ వచ్చింది. సినిమాను ఆగస్టు9న విడుదల చేస్తున్నాం’ అని చిత్ర సమర్పకుడు దానయ్య తెలిపారు. ఇంకా ఈ కార్యక్షికమంలో నిర్మాత ఎన్. రాధాకృష్ణ, సిరిమీడియా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
| |
|
![]() |
|