‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి ప్రేక్షకులు చక్కటి ఆదరణ కనబరుస్తున్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం 30 రోజులు పూర్తిచేసుకుంది. అంతటా కలెక్షన్లు బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా టీమ్ సమిష్టి కృషి ఫలితమిది. ఇదే స్థాయి ప్రేక్షకాదరణతో అర్థశతదినోత్సవం పూర్తిచేసుకుంటుందన్న నమ్మకముంది’ అన్నారు బెక్కం వేణుగోపాల్. ఆయన నిర్మించిన చిత్రం ‘మేం వయసుకు వచ్చాం’. తనీష్, నీతి మదాల్సాశర్మ నాయకానాయికలుగా నటించారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం 30 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చివూతంలోని సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటున్నాయి. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చక్కటి ఆదరణ కనబరుస్తున్నారు’ అన్నారు. చిన్న చిత్రానికి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని మరో నిర్మాత లక్ష్మణ్‌కేదారి అన్నారు. ఈ కార్యక్షికమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
| |
|