
‘సినిమా పరిక్షిశమలో సక్సెస్ చాలా కీలకం. సక్సెస్ రావాలంటే డబ్బు కోసం ఆశపడకుండా మంచి కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేయాలి. ఒక్కసారి సక్సెస్ అయ్యామంటే డబ్బు దానంతటదే వచ్చి పడుతుంది. అందుకే నేనెప్పుడు పారితోషికాల గురించి ఆలోచించలేదు’ అని చెబుతోంది మళయాలీ ముద్దుగుమ్మ అమలాపాల్. ఈ మధ్యనే ‘లవ్‌ఫెయిల్యూర్’లాంటి అభినయ ప్రధాన చిత్రంలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తోన్న ఓ చిత్రంలో నటిస్తోంది.
కథానాయికలు ఒక్క సినిమా సక్సెస్‌తోనే రెమ్యూనరేషన్‌ను బాగా పెంచేస్తున్నారన్న ప్రశ్నకు ఈ సుందరి పై విధంగా స్పందించింది. ‘ఏ సినిమా ఒప్పుకునే ముందైనా నేను స్క్రిప్ట్ మీదనే దృష్టిపెడతాను. నేను చేసిన సినిమాల్ని గమనిస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. గ్లామర్ రోల్స్ చేసినా సబ్జెక్ట్‌లో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ వుంటేనే నేను సినిమాల్ని చేస్తాను’ అని అంటోంది అమలాపాల్. అంతేకాదు తను బాలీవుడ్‌లోకి వెళ్లాలనుకుంటే అవకాశాల్ని సంపాదించుకోవడం పెద్ద కష్టమేమి కాదని, తనలో బాలీవుడ్ తారలు దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రాల పోలికలు వుంటాయని చాలా మంది అంటున్నారని సెలవిస్తోంది అమలాపాల్.
| |
|
![]() |
|