
సుదీప్ (‘ఈగ’ ఫేమ్) నటించిన కన్నడ చిత్రం ‘కిచ్చా’ అదే పేరుతో తెలుగులోకి అనువాదమౌతోంది. ‘పక్కా మాస్’ అని ఉపశీర్షిక. రమ్య కథానాయిక. మాతా మీడియా పతాకంపై అరిగెల కిషోర్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘‘ఈగ’ చిత్రంతో సుదీప్‌కు తెలుగులో మంచి గుర్తింపు లభిస్తోంది. ‘కిచ్చా’ చిత్రం కన్నడంలో మంచి విజయం సాధించింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. బయ్యర్స్ ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపెడుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు వి.హరికృష్ణ చక్కటి బాణీలు అందించాడు. తెలుగు నేటివిటి మిస్‌కాకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ సినిమాను త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, దర్శకత్వం: గురుదత్.
| |
|
![]() |
|