
‘లవ్ ఆజ్ కల్’ చిత్రంతో హిట్ పెయిర్ అని పించుకున్న సైఫ అలీఖాన్, దీపికా పదుకునే నటించిన తాజా సినిమా ‘కాక్ సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా పై తెలుగు నిర్మాతల కన్నుపడింది. ఎలాగైనా ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకుని తెలుగులో రీమేక్ చెయ్యాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఎంత పోటీ ఎదురైనా దక్కించుకుని తెలుగులో రీమేక్ చెయ్యాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని సిద్దార్ద్, ఇలియానా,నిత్యామీనన్‌ల కాంబినేషన్‌లో నిర్మించాలని బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేస్తున్నాడని ఫిలింనగర్ సమాచారం.
| |
|