రవితేజ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై ఛత్రపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలియానా కథానాయిక. జూలై నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
పూరి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవితమంతా దేవుడి లీలా వినోదమని నమ్మి జీవితాన్ని గడిపే యువకుడి కథ ఇది అన్నారు. ఆడియో పెద్ద విజయం సాధించిందని, ఈ సినిమా తన కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిపోతుందని సంగీత దర్శకుడు రఘుకుంచె ఆనందం వ్యక్తం చేశాడు. ప్రకాష్‌రాజు, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్.నారాయణ, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్: విజయ్, సహనిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
| |
|