ప్రముఖ యువ కథానాయకుడు రామ్‌చరణ్ బాలీవుడ్‌లో నటిస్తున్న ‘జంజీర్’ రీమేక్ చిత్రానికి తెలుగులో పాపులర్ సంగీత దర్శకుడిగా భాసిల్లుతున్న దేవిశ్రీవూపసాద్ స్వరాలు అందించబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ వార్త వినిపిస్తున్నప్పటికీ ఇటీవలే అధికారిక దేవీకి పిలుపు అందినట్లుగా తెలిసింది. దేవీని రామ్‌చరణ్ రికమండ్ చేయగా, ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం ‘జంజీర్’ దర్శకుడు అపూర్వ లాఖియాను, నిర్మాత అమిత్ మెహ్రాను బాగా ఇంప్రెస్ చేశాయి. ‘దబాంగ్’కు రీమేక్‌గా ‘గబ్బర్‌సింగ్’ను తెరకెక్కించినప్పటికీ మాతృకను మించి భిన్నమైన బాణీలను ‘గబ్బర్‌సింగ్’కు దేవి సమాకూర్చిన విధానం ‘జంజీర్’ దర్శకనిర్మాతల్ని మెప్పించింది. అందుకే ఈ చిత్రానికి స్వరకర్తగా దేవీని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం ఆడియోతో దేవీ మెస్మరైజ్ చేస్తే దేశావ్యాప్తంగా పాపులర్ అయ్యే అవకాశం ఆయన్ని వరించినట్లే.
| |
|
![]() |
|