తెలుగు చిత్ర పరివూశమలో పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. తెలుగు కమర్షియల్ సినిమాకు తనదైన కొత్త గ్రామర్‌ను పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దర్శకుడిగా ఆయన ఈ ఏడాది సరికొత్త ఫీట్ చేయబోతున్నారు. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి ఆపసోపాలు పడే దర్శకులున్న ప్రస్తుత తరుణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తోన్న నాలుగు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ఈ నాలుగు చిత్రాలు అగ్రహీరోలవి కావడం మరో విశేషం. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘బిజినెస్‌మేన్’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు’ జూలై 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ‘బద్రి’ తర్వాత పవన్‌కల్యాణ్‌తో పూరి చేస్తోన్న ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా పూరి దర్శకత్వం వహించే సినిమా అక్టోబర్‌లో ప్రారంభమై డిసెంబర్ నెలాఖరులో విడుదల కానుంది. దీంతో దాదాపు గత దశాబ్దాన్నరకాలంలో ఒక్క క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సినిమాల్ని అందించిన దర్శకుడిగా పూరి జగన్నాథ్ సంచలనం సృష్టించనున్నారు. కథ, కథనాలపై స్పష్టత...సినిమాను అమితంగా ప్రేమించడం... చక్కటి ప్రణాళికతో చిత్రాల్ని రూపొందించడమే పూరి జగన్నాథ్ ఫిల్మ్ మేకింగ్ సీక్రెట్‌గా ఆయన సన్నిహితులు చెబుతారు.
| |
|
![]() |
|