నవదీప్, సదా జంటగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మైత్రి’. పి. సూర్యరాజు దర్శకుడు. హను క్రియేషన్స్ పతాకంపై రాజేష్‌కుమార్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ సాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాన్ని పూర్తి కమర్షియల్ విలువలతో తెరకెక్కిస్తున్నాం. ఇందులో బ్రహ్మానందం ఓ టీవీ ఛానెల్ క్రియేటీవ్ హెడ్‌గా కనిపిస్తారు. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. త్వరగా చిత్రీకరణ పూరిచేసి చిత్రాన్ని ఆగస్టులో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. ‘ఇంత వరకు నేను నటించిన చిత్రాల్లో పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది’ అని నవదీప్ అన్నారు. కథానాయిక మాట్లాడుతూ ‘మంచి కథాబలమున్న చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్నాను’ అన్నారు. సినిమావాళ్ల నేపథ్యంలో సాగే కథ ఇదని ఉత్తేజ్ అన్నారు.
| |
|
![]() |
|