Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >>
మన నీళ్లు మనకు దక్కుతాయా?

జలవనరుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి?మన నీళ్లు మనకు దక్కకపోవడానికి కారణం?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనకు జలవనరుల విషయంలో ఎంత వరకు న్యాయం జరుగుతుంది?

-పాల్వాయి ధర్మాడ్డి (ధర్మేష్), కేసముద్రం



వివరంగా చెప్పాలంటే ఓ గ్రంథమే అవుతుంది. వీలు వెంట వివిధ వ్యాసాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సంక్షిప్తంగా చెప్పాలంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణకు కృష్ణానదీ జలాల్లో కనీసం 555 టీఎంసీల వాటా దక్కాలి. మొత్తానికి రాష్ట్రానికి కేటాయింపు 811 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ పరీవాహక క్షేత్రం 68.5 శాతం. ఇంకా వెనుకబాటుతనం లాంటి ఇతర పరిమితుల (Parameters)ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువే దక్కాలి. కాని బచావత్ ట్రిబ్యున ల్ అనేక కారణాలను చెబుతూ తెలంగాణ ప్రాజెక్టులకు సుమారు 277 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే న్యాయంగా రావలసిన దాంట్లో సగ భాగం. కాని వాస్తవానికి ఉపయోగంలో ఉన్నది అందులో సగం మాత్రమే. అంటే 120-130 టీఎంసీలు మాత్రమే. కర్ణుని చావుకు కారణాపూన్ని ఉన్నా యో తెలంగాణలో నీటి వినియోగానికి గండిపడటంలో అన్ని కారణాలున్నాయి. ఇక ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. బేసిన్ల వారీగా స్థితి ఇలా ఉంది.

కృష్ణా బేసిన్
ఒకటి: హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన 1) తుంగభద్ర ఎడమ కాలువ పొడిగింపు 2) అప్పర్ కృష్ణా కుడి కాలువ పొడిగింపు 3) భీమా
ఈ మూడు ప్రాజెక్టులను కోల్పోవడం తెలంగాణకు మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు జరిగిన ఘోర అన్యాయం (వివరాలకు చూడండి సెప్టెంబర్ 26 ‘సమస్తే తెలంగాణ)జరిగింది.
రెండు: రాజోలిబండ మళ్లింపు పథకం (చూడండి సెప్టెంబర్ 26 ‘సమస్తే తెలంగాణ) దారుణ వివక్షకు గురైంది.

మూడు: జూరాల
17.84 టీఎంసీల వినియోగం కోసం ఆమోదించబడిన ఈ ప్రాజెక్టును నిన్నటి దాకా ఎన్నడూ పూర్తిగా నింపిన పాపాన పోలేదు. నింపితే పైనున్న కర్ణాటకలో కొంత భూమి ముంపుకు గురవుతుంది. 44 కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా సకాలంలో చెల్లించేందుకు మనసొప్పక ప్రభుత్వం చేసిన జాప్యం మూలంగా ఈ జలాశయాన్ని పూర్తిగా నింపక నీటిని దిగువకు వదలడం జూరాల ఆయకట్టును అభివృద్ధి పరచకపోవడం ఇవన్నీ తెలంగాణ పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన వివక్షకు తార్కాణాలు.

నాలుగు: నాగార్జునసాగర్
హైదరాబాద్ ప్రభుత్వం161 టీఎంసీల వినియోగంతో తెలంగాణ ప్రాంతంలోని ఏడు లక్షల 95 వేల ఎకరాలను సాగు చేయాలని తలపెట్టింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక అది 111 టీఎంసీలను తగ్గించి ఆంధ్ర ఏరియాకు బదిలీ చేసి అందులోనూ 90 టీఎంసీలు గ్రావిటీ (5,32,000 ఎకరాలు), 10 టీఎంసీలు ఎత్తిపోతల (70 వేల ఎకరాలు)గా మార్చారు. నిజానికి రైతులకు అందుతున్నదెంతో దేవునికే తెలుసు. సాగు చేయడానికి భూమి లేదన్న సాకుతో నీటిని తగ్గించి ఆయకట్టును తగ్గించారు.

సగానికి కాస్త తక్కువగా సాగర్ నీటిని పంచుకోవాల్సిన తెలంగాణ ఈరోజు పావువంతు నీటికి మాత్రమే పరిమితమైంది. ఎడమకాలువ (నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరందించే కాలువ) అనేక ఒడిదొడుకులకు లోనైం ది. కుడి కాలువ వెడల్పు 241 అడుగులు, ఎడమ కాలువ వెడల్పు 95 అడుగులు. అంటే సాగర్‌లో కొంచెం నీరున్నా కుడి కాలువలో ఎక్కువ నీరు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎడమ కాలువపైన ఎత్తిపోతల పథకా లు రైతులు తన ఖర్చుతో నిర్వహించుకోవాలి . కాని కుడికాలువ ఎత్తిపోతల బాధ్యత ప్రభుత్వానిది. ఇలా ఎడమ, కుడి కాలువల మధ్య తేడా చూపి తమ పక్షపాత బుద్ధిని ప్రకటించుకుంది ప్రభుత్వం.

ఐదు: జంట నగరాలకు తాగునీటి సరఫరా
జంట నగరాలకు మొదట్నుంచీ తాగునీరు అందిస్తున్న మూసీ, మంజీరా నదులకు తోడుగా కృష్ణా నీటి సరఫరా పథకాన్ని మూడు దశలలో చేపట్టడం జరిగింది. మొదటి దశ పూర్తయింది. రెండో దశ పూర్తి కావొచ్చింది. ప్రభుత్వం మూడో దశ పక్కనపెట్టి గోదావరి నీటిని సిటీకి తెచ్చే పథకం ప్రారంభించింది. 850 కోట్ల రూపాయలతో ఖర్చయ్యే కృష్ణా పేజ్-3 స్కీం బదులుగా 3375 కోట్ల గోదావరి పథకం ప్రవేశపెట్టడం వెనుక మతల బు ఉంది. కృష్ణా జలాలను సిటీకి అందచేయకుండా, పోతిడ్డిపాడు ద్వారా రాయలసీమకు అందజేయడం దీని లక్ష్యం. ఈ విధంగా హక్కులేని రాయలసీమకు నీళ్లందిస్తూ తెలంగాణను వంచించడం ప్రభుత్వ ఎజెండాగా కనిపిస్తోంది.

ఆరు: శ్రీశైలం, పోతిడ్డిపాడు
శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసం ఉద్దేశించబడింది. దాన్ని క్రమేణ సాగునీటి ప్రాజెక్టుగా మార్చడం జరిగింది. ‘కృష్ణా జలాలను’ మిగులు జలాల ముసుగులో సీమాంవూధకు తరలించే ఉద్దేశ్యంతో ‘పోతిడ్డి పాడు’ హెడ్ రెగ్యులేటర్ సైజును నాలుగింతలు పెంచేశారు.

పులిచింతల
కృష్ణా డెల్టా రెండో పంట కోసం కృష్ణా జలాలను కేటాయించే విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ససేమిరా అంగీకరించలేదు. అందుకే పులిచింతలను ఒప్పుకోలేదు. ప్రభుత్వం కృష్ణా డెల్టా ప్రయోజనాల కోసం ‘పులిచింతల నిర్మాణం’ చేపట్టింది. ఈ ప్రాజెక్టు మూలంగా 30వేల ఎకరాల భూమి, 472 ఎకరాలలో పరుచుకున్న వేలాది టన్నుల సున్నపురాయి నిక్షేపాలు నల్లగొండ జిల్లా కోల్పోవలసి వచ్చింది.

గోదావరి బేసిన్
ఈ బేసిన్‌లో నికరంగా రాష్ట్రానికి 1480 టీఎంసీల నీరు వస్తుంది. తెలంగాణ 79శాతం పరీవాహక ప్రాంతం కలిగి ఉంది. ఈ ప్రాతిపదికన 1169 టీఎంసీల నీరు తెలంగాణకు చెందాలి. అయితే గోదావరి బేసిన్‌లో ఇంకా సగం నీరు వాడుకోవలసి ఉంది. ఇందుకోసం అనేక ప్రాజెక్టులకు రూపకల్ప న జరిగినా అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది. తెలంగాణ భూములు బాగా ఎత్తున ఉన్న కారణంగా ఎత్తిపోతల మార్గం ద్వారా తప్ప సాగయ్యే అవకాశాలు లేవు. ఇందుకు చాలా విద్యుత్తు అవసరం. తెలంగాణకు ఉపయుక్తంగా ఉండే ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపల్లి, ప్రాణహిత-చే రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ రుద్రమకోట లాంటి అనేక ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులను ప్రభుత్వం రూపొందించింది. ఇవి వివిధ దశలలో ఉన్నాయి. వీటికి సరిపడా విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వ విద్యుత్ పథకాలు అమలులో కాని నిర్మాణంలో కాని లేవు. అందుకని ఈ భారీ ఎత్తిపోతల పథకాలు నిజంగా నిర్మాణమవుతాయా అయినా అమలు అవుతాయా అన్నది ప్రశ్నార్థకం.

ఇక ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాల మాటకొస్తే గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు, దేవనూరు ప్రాజెక్టులు ఏ విధంగా వలసవాదుల కుట్రలకు బలయ్యాయో సెప్టెంబర్ 29 నాటి ‘నమస్తే తెలంగాణ’లో వివరించాను. బతికిబట్టకట్టిన ప్రాజెక్టుల దుస్థితి ఇది.

శ్రీరాంసాగర్ మొదటి దశ: 1963లో మొదలైన ప్రాజెక్టు కుంటుతూ, పడుతూ 45 ఏళ్లకు పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 9,68,000 ఎకరాలు సాగు కావలసి ఉండగా అతి కష్టం మీద ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందిస్తోంది.ఈ ప్రాజెక్టు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు దుస్థితికి పాలకుల వివక్ష, అలక్ష్యమే ప్రధాన కారణం.

శ్రీరాంసాగర్ వరద కాలువ, రెండోదశ
ఎప్పుడో ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపినా ఆరేళ్ల కింద మొదలై, ప్రాజెక్టులు ఆపసోపాలు పడుతున్నాయి . ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలీదు.

సింగూరు
మెదక్ జిల్లా రైతాంగం నోళ్లుకొట్టి ఈ ప్రాజెక్టును పూర్తిగా హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు తాకట్టు పెట్టారు. సింగూరు జలాలను హైదరాబాద్‌కు తరలించడం వెనకాల వలసవాదుల కుట్ర దాగుంది. మరోసారి దాన్ని ప్రస్తావిస్తాను.

ఘనపురం ‘ఆనికటు’ (Anicut)
ఎగువన సింగూరు కట్టడంతో ఘనపురానికి శని పట్టుకుంది. 4.06 టీఎంసీల మంజీరా జలాల హక్కున్నా, ఎప్పటికప్పుడు సింగూరు నుంచి కొద్దిగానైనా వదలమని దేబిరించవలసి వస్తోంది.

నిజాం సాగర్
‘సింగూరు’ కట్టడం వల్ల నీరు రాక అవస్థపడుతున్న మరో ప్రాజెక్టు నిజాంసాగర్. 2,75,000 ఎకరాలకు నీరందించవలసిన ప్రాజెక్టు సకాలానికి నీరురాక, ఇసుక మేటలు వేసి, లక్షల ఎకరాల కన్నా ఎక్కువ నీరందించే పరిస్థితి లో లేదిప్పుడు.

మన నీరు మనకు దక్కక పోవడానికి రాష్ట్ర జనాభాలో మనం సంఖ్యాపరంగా తక్కువగా ఉండడమే కాకుండా, మనలో అవగాహనా రాహిత్యం, మన నరాల్లో బానిసత్వ లక్షణాలు జీర్ణించుకుపోవడం, పేదరికం, అమాయకత్వం, అతి మంచితనం, ఇతరులను నమ్మడం, కేంద్రంలో పలుకుబడి లేకపోవడం ఇంకా అనేక లోపాలు కారణాలుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంవూతులు చాలా కొద్దికాలమే ఉండడం. భారీ నీటిపారుదల శాఖా మంత్రులుగా తెలంగాణ వాళ్లే ఉన్నా, నిజమైన అధికారం ఆంధ్ర మంత్రులు, అధికారుల చేతిలో ఉండడం కూడా మరో బలమైన కారణం.

తెలంగాణ ఏర్పడితే మనకు హక్కు భుక్తంగా కేటాయింపబడ్డ కృష్ణా జలాలను, గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోగలం. అందు కు అవసరమైన ప్రణాళికలను మన ఇంజనీర్లు ఇది వరకే రచించి ఉన్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్తును సరసమైన ధరలో ఉత్పాదన చేసి, దాన్ని అతి తక్కువ రేట్లతో అందించిన నాడే మన రైతులు బాగుపడతారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకంలోకి తీసుకరావలసి ఉంది. అదృష్టవశాత్తు విదేశాల్లో ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఈ విషయంలో విశేషమైన కృషి చేస్తున్నారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించవచ్చు.
మన తెలంగాణ రైతులకు న్యాయం జరగాలంటే ‘తెలంగాణ’ రావడం తప్ప మరో దారి లేదు.

ఇదీ సంగతి (నీటి లభ్యత)
భూమిపైన ఉన్న నీరు 140 కోట్ల ఘనపు కిలో మీటర్లు. ఆ నీటిని మన భూమిపైన విస్తరింపజేస్తే మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. ఆ నీటిలో 97 శాతం ఉప్పునీరు సమువూదాలలో దాగుంది. మిగిలిన స్వచ్ఛమైన నీటిలో 77.6 శాతం ధృవాలలో మంచురూపంలో, 21.8 శాతం భూగర్భపు లోతుల్లో నిక్షిప్తమై ఉంది. అంటే మనకు నదులలో, చెరువులలో దొరికే స్వచ్ఛమైన మంచినీరు 0.6 శాతమే.
అంతర్జాతీయ నిపుణుల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా సగటున ప్రతి వ్యక్తికి 1700 ఘనపు మీటర్లకు పైగా నీరు లభిస్తే నీటి కొరత లేనట్టే.

1000 ఘనపు మీటర్ల కన్న తక్కువ నీరు లభించిన చోట నీటి ఒత్తిడి పరిస్థితులు (water stressed conditions) ఏర్పడతాయి. 500 ఘనపు మీటర్ల స్థాయికి దిగజారితే ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటారు. 1955లో నీటి ఒత్తిడి పరిస్థితులు ఏర్పడ్డ దేశాలు ఏడు ఉంటే, 1990 నాటికి 20కి పెరిగాయి. 2050 నాటికి ప్రపంచంలో 2/3 అంటే మూడింట రెండొంతుల జనాభా నీటి ఒత్తిడి పరిస్థితులు ఎదుర్కొంటుందని అంచనా. నీటి సంక్షోభం అంతర్యుద్ధాలకు దారి తీస్తుంది. భవిష్యత్తులో యుద్ధాలంటూ జరిగితే అవి నీటి కోసమే అని నిపుణులు చెప్తున్నారు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్


Other Articles
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine