Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Edit Page >>Articles



నిర్బంధం.. ఉదాసీనత.. ఐక్యత

శత్రువు నిన్నెట్లా చూస్తున్నాడన్నదే నీ నిబద్ధతకు, ఆచరణకు గీటురాయి అనేది పాత సూత్రం. ఎంచుకొని నిర్బంధాన్ని ప్రయోగించడం, ఆ నిర్బంధం కొందరి పట్ల తీవ్రాతి తీవ్రంగా ఉండడం అందువల్లనే. మొత్తంగా తెలంగాణ ఉద్యమం విస్తృతమయింది. అది అన్ని రాజకీయ అభివూపాయాల, సిద్ధాంతాల, భావనల కూడలి. తీవ్ర వామపక్షం నుంచి తిరోగమన రాజకీయాలదాకా ఉద్యమంలో భాగస్వాములు. ఎందుకంటే తెలంగాణ మంది ఉద్యమం. అస్తిత్వ ఉద్యమం. ఉమ్మడి అస్తిత్వం కోసం ప్రాంతీయ స్పృహతో పోరాడే ఉద్య మం. కానీ, రాజకీయ పార్టీలకు ఎజెండాలుంటాయి. జెండాలుంటాయి. కార్యకలాపాలూ ఉంటాయి. వాటికి ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా, నూతన ప్రజాస్వామిక విప్లవ అంతిమ లక్ష్యాలు, రామరాజ్యాలు, సంక్షేమ రాజ్యాలు, సామాజిక న్యాయరాజ్యాల లక్ష్యాలతో అవి పనిచేస్తుంటాయి.

సామాజిక మార్పు కు హింస మంత్ర సానితనం వహిస్తుంది నుంచి గాంధేయ అహింసామార్గాలు, ప్రజాస్వామ్య ఉదారవాద రాజకీయాలు రకరకాల అంతిమ లక్ష్య సాధన మార్గా లూ ఉంటాయి. కానీ వీరందరూ తెలంగాణ ఉద్యమంలో కలిసి వస్తుంటారు. స్వీయ రాజకీయ అస్తిత్వం, ఓట్లు, సీట్ల సాధన, కేంద్రంపై ఒత్తిడి, రాజకీయ పార్టీలకు అనివార్యస్థితి కల్పించి పార్లమెంటులో బిల్లుపెట్టే రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధన అనే అభివూపాయాలుండే రాజకీయ పార్టీ ఉంటుంది. ఉన్న పార్టీ లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి, లేదా జగన్‌ను ముఖ్యమంవూతిని చేసినా మన తెలంగాణ మనకు కావాలి అనే పాక్షిక స్పృహ గల రాజకీయ పార్టీలూ ఉంటాయి. ఇవన్నీ రాజకీయాలు కానీ. ఈ రాజకీయ పార్టీలన్నింటి ఆవిర్భావం లేదా రాజకీయ పార్టీల్లో తెలంగాణవాదానికి మూలం1969 ఉద్యమంలో ఉంది. అది చప్పున చల్లారిన తర్వాత తెలంగాణ కోసం అనేకసార్లు జరిగిన ప్రయత్నాల్లో ఉంది.

జయశంకర్‌సార్ లాంటి వాళ్లు జీవితాంతం ఆ ఒక్క ఆకాంక్షను అంటిపెట్టుకుని తాడుపేనినట్టు తెలంగాణవాదాన్ని నిర్మించడంలో ఉంది. ఆంధ్ర అంతర్గత వలసాధిపత్యం మిక్కుటమయిన తర్వాత 1996 నాటికే మోర్చా చేసిన బుద్ధిజీవులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు ఉద్యోగుల్లో ఉంది. ఇది గో అలాంటి మలి ఉద్యమంలో అందుకోసమే అనేక ప్రజాసంస్థలు, వేదికలు పుట్టి ఉద్యమాన్ని శిఖరాక్షిగానికి చేర్చడంలో పాత్ర వహించినవి. పోరాడేది ఈ సంస్థలే. తెలంగాణవాదాన్ని నిర్మించింది, బలమైన సైద్ధాంతిక, సాంస్కృతిక, చారివూతక పునాదిని నిర్మించింది ఈ సంస్థలే. అలాంటి సంస్థల్లో ఇవ్వాల్టి తెలంగాణ ప్రజావూఫంట్ రూపంలో ఉన్న సంస్థ ముఖ్యమైనదే. వరంగల్‌లో డిక్లరేషన్ పునాదిగా ఆ కాలంలో ఏర్పడిన తెలంగాణ జనసభ మరింత విస్తృతమై తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ. ఆ తర్వాత అనేక సంస్థల ప్రజావూపంట్‌గా ఆవిర్భవించింది.

రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ సిద్ధించినప్పటికీ, పార్లమెంటులో బిల్లుపెట్టడానికి తెలంగాణలో ఉద్యమం నడవాలని, నిరంతర ఉచ్ఛతర ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అట్లాగే తెలంగాణ పోరాటాన్ని స్థానికీయుల నేలపువూతుల వనరుల పరిరక్షణ ఉద్యమంగానూ స్వభావంలో భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంగానూ చూడాలన్నది స్థూలంగా ప్రజావూఫంట్ అవగాహన. నిజానికి మావోయిస్టు పార్టీ కానీ, అంతకు ముందరి పీపుల్స్‌వార్ కానీ, పీపుల్స్‌వార్ కన్నా ముందే కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని సీవోసీ కానీ తెలంగాణ పోరాటానికి బేషరతుగా మద్దతు పలికింది. ఎలాంటి శషభిషలు లేకుండా ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని ఆహ్వానించింది. అవకాశవాద రాజకీయాలు తెలంగాణకు ద్రోహం చేసినప్పుడు అది నిరసించింది.

మిగతా వామపక్షాలు, ముఖ్యంగా 1969 ఉద్యమాన్ని పచ్చి అవకాశవాద రాజకీయ ఉద్యమంగా, విచ్ఛిన్నకారుల ఉద్యమంగా భావించిన సమయంలోనే ఒక్క సీవోసీ, పీపుల్స్‌వార్‌లు భూమిపువూతుల ఈ పోరాటాన్ని భిన్నంగా అర్థంచేసుకుని చర్చకు పెట్టింది. కానీ ఆ పార్టీ నేరుగా తెలంగాణ పోరాటంలో పాల్గొనే అవకాశాలు లేవు. కానీ సరిగ్గా ఆ రాజకీయ అభివూపాయాలతో, భావనలతో, సిద్ధాంతాలతో ఏకీభావం ఉండి. విశాల ప్రజానీకంలో బహిరంగంగా పనిచేసే సంస్థలు పార్టీ అభివూపాయాలకు వేదికలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యమే. ప్రజాస్వామ్యం పరిధిలో దాంట్లో తప్పుకూడా ఏమీలేదు. సరిగ్గా శత్రువుకు ఎవ రు దీటైన శత్రువనిపిస్తాడో? సరిగ్గా పసిగట్టి ఏర్చికూర్చి నిర్బంధాన్ని ప్రయోగించడం, అందువల్లే ఎక్కువయింది. ఇతర పార్టీల సంస్థల పైకన్నా సెలెక్టివ్‌గా ఇలాం టి సంస్థలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. ఇదొక పద్ధతి ప్రకారంగా జరిగిన నిర్బంధం. ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారన్న ప్రచారంతో పాటు వారి అభివూపాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న అనుమానాలతో ఈ వేధింపులు హత్యలదాకా ఎదిగాయి. సరిగ్గా నిర్బంధానికి కూడా పక్షపాతం ఉంటుందని ఈ విషయంలో మనం గమనించవచ్చు.

తెలంగాణ ప్రజావూఫంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ప్రజావూఫంట్ కార్యవర్గసభ్యుడు, ‘నడుస్తున్న తెలంగాణ’ సంపాదకుడు సి. కాశీంను ఎక్కడో వరంగల్‌లో అరెస్టు చేసిన ఆజాద్ సహచరి కె. పద్మ, భారతక్కల కేసులో ఇరికించడాన్ని ఈ విధంగానే చూడాలి. గద్దరన్న తెలంగాణ ప్రత్యామ్నాయ రాజకీయాలకు నాయకుడు. కానీ ఆయన తెలంగాణ కోసం దేవున్ని మొక్కాడు. జీవితంలో ఎన్న డూ కలవడానికి ఇష్టపడనివారితో కలిశాడు. ఎందుకు? తెలంగాణ ఒక విస్తృతిగల ప్రజాఉద్యమం కనుక. ఆ గద్దరన్న నాయకత్వంలో ఏర్పడిన ప్రజావూఫంట్‌కు ఆకుల భూమయ్య ఇప్పుడు అధ్యక్షుడు. అందుకే ఆయన ఇప్పుడు టార్గెట్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్‌ను ముందుకు తీసుకపోవడానికి ఏర్పడిన తెలంగాణ జనసభకు అప్పుడాయన నాయకుడు. జనసభ తీవ్ర నిర్బంధాన్ని చవిచూసింది. కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయ నాయకుడు రఘుశంకర్‌డ్డి, జర్నలిస్టునాయకుడు వెంకటస్వామి నుంచి మొదలుకొని పల్లెల్లో నక్సలైట్ల మీద ప్రయోగించిన నిర్బంధాలన్నింటినీ జనసభ మీద ప్రయోగించారు. వాళ్ళు ముందు గద్దర్‌పై గుండ్ల వర్షం కురిపించారు. తెలంగాణ పతాకగా మొలిచిన గద్దర్ గళంపై తుపాకిమొనపెట్టారు. ఆ పాటను చంపలేకపోయారు. కానీ రెండేళ్లకే వాళ్లు బెల్లిలలితను ముక్కలు ముక్కలుగా నరికారు. ఆమె కోకిల గొంతును నొక్కారు. ఆ తర్వాత ఐలన్నను, నల్ల వసంత్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఏడేండ్ల కిందట ఉపాధ్యాయనేత కనకాచారిని ఏకంగా దారుణంగా చంపారు. ఇదీ నిర్బంధం. ఇదీ రాజ్యం ప్రత్యామ్నాయం ప్రకటించి తెలంగాణ కోసం పోరాడాలన్న సంస్థలపై ప్రయోగించిన నిర్బంధం తీరు. ఈ నిర్బంధం కొనసాగింపునకు ఇతర సందర్భాల్లో ప్రయోగ మాత్రంగా తీవ్రం చేశారు.

ఒక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి, ఉద్యమంలో ఎదిగి కేంద్రం తో సంప్రదింపులు జరపగలిగిన స్థితిలో ఉన్న కేసీఆర్ నిరాహారదీక్ష చేసినప్పుడు వాళ్లు వ్యవహరించిన తీరు ఒక ప్రయోగం. ఆయనని అనాగరికంగా గ్రేహౌండ్స్ పోలీసులతో అరెస్టుచేసి, ఏకంగా ఖమ్మం జైలుకు తీసుకెళ్లి, ఆయనతో పాటు ఉన్నవాళ్లను కొట్టి, గాయపరిచి నిర్బంధం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం చేశారు. కానీ అదే సంఘటన తెలంగాణ ఈ రెండేళ్ల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిన కెరటం చేసింది. ఆ తర్వాత ఉస్మానియా ఉద్యమ కేంద్రం అయింది. అక్కడ విద్యార్థుల పై లాఠీచార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు నిత్యకృత్యమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉస్మానియా క్యాంపస్ ముళ్లకంచెల్లో బందీయై ఉన్నది. చివరికి జర్నలిస్టులనూ చితకబాది, వారి బండ్లను కాలబెట్టి, తీవ్రంగా హింసించిన నిర్బంధాన్ని తెలంగాణ కనులారా చూసింది. విద్యార్థుల మీద వందల వేల కేసు లు పోగుపడ్డాయి. యాకూబ్‌రెడ్డిని చిత్రహింసలు పెట్టి బతుకు బుగ్గి చేశారు. ఇవ న్నీ నిర్బంధ సందర్భాలే అయినప్పటికీ, ప్రత్యామ్నాయ తెలంగాణ కోసం పనిచేస్తున్న వారిపై వచ్చే నిర్బంధ తీవ్రత హత్యల దాకా ఎదగడం ఇక్కడ మనం మాట్లాడుకోవల్సిన అసలైన అంశం. ప్రజాస్వామ్యబద్ధంగా, పూర్తి అహింసా పద్ధతుల్లో, జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఉన్న ప్రత్యామ్నాయ శక్తులపై అమలవుతున్న తీవ్ర నిర్బంధం పట్ల తెలంగాణ ఉద్యమం ఉదాసీనంగా ఉంటే అది విస్తరిస్తుంది. అట్లాగే విస్తరించింది కూడా.

కాశీం విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగివచ్చిన తెలంగాణ వీరుడు. వేలమంది ని నిలేసి ఉంచే మంచి వక్త. అవగాహన, స్పష్టత ఆయన సొంతం. కాశీం కవి. మహబూబ్‌నగర్ జిల్లా బతుకు పోరాటంలో ఎదిగి వచ్చిన తెలంగాణ కార్యకర్త. స్వయంగా అసిస్టెంట్ ప్రొఫెసర్. నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు. కాశీం సహచరి స్నేహ జర్నలిస్టు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన కార్యకర్త. వాళ్లిద్దరూ వారి అభివూపాయాలు, భావనలు, సిద్ధాంతాలు ఏవైనా తెలంగాణ కోసం నిలబడ్డ వాళ్లు పోరాడుతున్నవాళ్లు. ఆకుల భూమయ్య పదిహేను సంవత్సరాలు గా తెలంగాణను కలవరిస్తున్న ఉపాధ్యాయ నాయకుడు. తెలంగాణ కోసం తను ఎన్నడూ ఇష్టపడని రాజకీయాల ప్రతినిధులు ఆలె నరేంద్ర, దత్తావూతేయ లాంటి వాళ్లతో కూడా కలిసి పనిచేసిన మనిషి. వీళ్లిద్దరూ బహిరంగ జీవితంలో తమ విశ్వాసాల మేరకు పూర్తి నిబద్ధత గల కార్యకర్తలు. ఆజాద్ సహచరి కేసులో ఈ ఇద్దరూ పరారీలో ఉన్నారని ఇరికించడం రాబోయే నిర్బంధానికి ఒక సూచిక. ఒక హెచ్చరిక.

ఎన్‌హెచ్9ను రాళ్లతో వెలిగించిన చెరుకు సుధాకర్ పైన పీడీ యాక్ట్ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం సరిగా స్పందించలేదు.స్వామిగౌడ్‌ను హింసిం చి, అరెస్టు చేసినప్పుడు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో అపూర్వ ప్రతిఘటన కనపడింది. కానీ చెరుకు సుధాకర్ విషయంలో ఉదాసీనత కనపడింది. ఆయనకూ కచ్చితమైన అభివూపాయాలున్నాయి. చెరుకు సుధాకర్ కార్యాచరణకు సీమాంధ్ర ప్రభుత్వం వణికిపోయింది. అందుకే ఆయనపైన పీడీయాక్టు.

తెలంగాణ ఉద్యమం విస్తృతమైందే అనుకున్నప్పుడు, ఉద్యమ శక్తులన్నీ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని అనుకున్నప్పుడు, ఎవరి విశ్వాసాలు, భావనలు, సిద్ధాంతాలు ఏవైనప్పటికీ చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్‌కు, ఆకుల భూమయ్య, సి. కాశీంలపై ఈ అపసవ్యపు, అక్రమ కేసుకూ స్పందన తీవ్రంగా కనపడాల్సి ఉన్నది. లేదంటే ఈ ఉద్యమంలో కొన్ని శక్తుల పట్ల రాజ్యం అనుసరించిన ధోరణినే ఉద్యమం కూడా అనుసరిస్తున్నదని అనుకోవాల్సి వస్తున్నది. తెలంగాణ రావడం అంటే నిజంగానే భౌతిక తెలంగాణ కాదు. తెలంగాణ సాధన ఎట్లాగైతే..ముఖ్యమో, అట్లాగే ఇప్పటికన్నా మెరుగైన తెలంగాణ సాధనా ముఖ్యమే. బహుశా అదే పునర్నిర్మాణం. ప్రత్యామ్నాయ శక్తులు, భిన్న సంస్థలు ఉండడం అందువల్ల కూడా తప్పనిసరి. ఇదొక సంఘర్షణల నేల. వేయి పూలు వికసించిన నేల. ఈ నేల మీద జరిగే ఉద్యమాల్లో భాగంగా భూమయ్య, కాశీంలపై అక్రమ కేసులకు రంగం సిద్ధమైంది. దీన్ని నిరసిద్దాం. ఎదిరిద్దాం. అన్ని శక్తులనూ కాపాడుకుదాం. అదొక్కటే తెలంగాణ శక్తుల ఐక్యతా సూత్రం. భవిష్యత్ నిర్బంధాన్ని తిప్పికొట్టే దారి. వాళ్లిద్దరూ తెలంగాణవాదులు. వారిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదిద్దాం. ప్రజాస్వామ్యంలో మరోదారి లేదు. నూరుపూలు వికసించనీ వేయి సంఘర్షణలు వర్ధిలనీ...

-అల్లం నారాయణ
allamnarayana@yahoo.co.in

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine