Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Edit Page >>Articles



పుట్టెడు దుఃఖంలో పుట్టంగండి

పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతులకు నోచుకుందని, అది కూడా తూతూమంవూతంగా చేపట్టారని, సిస్టర్న్‌కు ఏదైనా జరగరానిది జరిగితే కొంపలు మునుగుతాయని గిరిజనులు భయపడుతున్నారని పేపర్లో చదివాను. అసలు ఈ సిస్టర్న్ ఏమిటి? మరమ్మతులేమిటి? వివరంగా చెప్పండి?

-ఎన్. బాబురావు, డోర్నకల్, ఖమ్మం


పుట్టంగండి సిస్టర్న్ అనబడే జలాశయం శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో అంతర్భాగం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సొరం గ మార్గంలో వాలు పద్ధతిన నగావిటీ) నల్లగొండ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు 2,20,000 వేల ఎకరాల సాగునీరు, 212 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మొదట ఎస్‌ఎల్‌బీసీని రూపొందించడం జరిగింది. అయితే ఇందుకు అవసరమయ్యే కేంద్ర అటవీశాఖ అనుమతులు పొందడంలో జాప్యం అయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయంగా సొరంగ పథకంలోని 25వ కిలోమీటర్ల వద్ద ఉమ్మడి బిందువు (కామన్ పాయింట్) నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాలువను ప్రారంభించాలని 1983-84లో పనులు ప్రా రంభించారు. రైతులకు త్వరితగతిన నీటి అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాశయం నుం చి ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను ఎస్‌ఎల్‌బీసీ కాలువలకు అందించాలని 86-87లో 353 కోట్ల రూపాయల అంచనాతో పను లు ప్రారంభించేందుకు కొత్త స్కీంను రూపొందించి మంజూరు చేసింది. 1983-84లో మొదట రూపొందించిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పథకం అంచ నా 480 కోట్లు. ఉద్దేశించిన 2 లక్షల 20 వేల ఎకరాలకు తోడు మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 87 కిలోమీటర్ల దిగువ కాలువను సాగర్ తీర ప్రాంతం నుంచి ప్రారంభించే స్కీంను 211 కోట్ల 54 వేల అంచనాతో సెప్టెంబర్ 1998లో ప్రభుత్వం సాంక్షన్ చేసింది. అంటే సాగర్ తీర ప్రాంతం నుంచి ఎగువ కాలువ 2లక్షల 20 వేల ఎకరాలకు, దిగువ కాలువ 50 వేల ఎకరాలకు నీరందించేందుకు వీలుగా స్కీం రూపొందించబడ్డదన్న మాట. ఈ స్కీం 26.22 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను ఉపయోగించుకుంటుంది.

మనం మాట్లాడబోయే పుట్టంగండి ఎగువ కాలువ స్కీంలోని అంతర్భా గం. గమ్మత్తేమిటంటే నాటి చీఫ్ ఇంజనీర్ ఎన్.ఆర్. రంగనాథన్ గారు సాగ ర్ జలాశయం నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించే స్కీంలో ఈ పుట్టంగండి సిస్టర్న్ లేదు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి మూడు కిలోమీటర్ల అప్రో చ్ కాలువ, అక్కడ ఏర్పాటు చేసే పంపింగ్ స్టేషన్ నుంచి సరాసరి నీటిని ఎత్తి అక్కడ ఉన్న గుట్టపైకి చేరవేసి అక్కడ్నుంచి కాంటూరు కాలువ ద్వారా అక్కంపల్లి జలాశయానికి చేరవేయాలని మొదట రూపొందించిన స్కీంలో భావించారు. అయితే ఆ గుట్ట అటవీ ప్రాంతంలో ఉండటంతో దాన్ని తప్పించేందుకు ప్రత్యామ్నాయంగా మూడు కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తవ్వి అక్కడ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి తరలించిన నీటిని పుట్టంగండి జలాశయంలోకి విడుదల చేసే స్కీం అవతరించింది. ఈ జలాశయం సామర్థ్యం 0.30 టీఎంసీలు దరిమిలా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు అని నామకరణం చేయడం జరిగింది. సాగర్ తీరప్రాంతం నుంచి బయలుదేరి అప్రోచ్ కాలు వ, సర్జ్ ట్యాంకు (పుట్టంగండి జలాశయం) అక్కడ నుంచి అక్కంపల్లి జలాశయానికి నీటిని తీసుకు ఏర్పాటయ్యే లింక్ కాలువలకు గాను 73 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసి జీవో 161 ద్వారా 29-8-97 నాడు పరిపాలన అనుమతిని ఇచ్చింది. ఇందులో టన్నెల్ (సొరంగం), సర్జ్ పూల్, పవర్‌స్టేషన్, పైపులు చేర్చలేదు. దానికి విడిగా జీవో ఇవ్వడం, ఆ పనులను జెన్‌కో చేపట్టడం జరిగింది. అప్రోచ్ కాలువ, సర్జ్ ట్యాంకు, లింక్ ఛానల్ (పదికిలోమీటర్ల పొడవు) పనులను సాగునీటి శాఖ పూర్తి చేసింది. ఈ లింక్ కాలువ సాగర్ నీటిని సర్జ్ ట్యాంకు నుంచి అక్కంపల్లి జలాశయానికి చేరుస్తుంది. అక్కంపల్లి జలాశయం సామర్థ్యం 1.528 టీఎంసీలు.

ప్రభుత్వ జీవోలో పేర్కొన్న సర్జ్‌ట్యాంకునే, సిస్టర్న్ అని జలాశయంగా మనం వ్యవహరిస్తున్నం. ఇది పుట్టంగండి తండా దగ్గర ఉంది కాబట్టి దీన్ని పుట్టంగండి సిస్టర్న్ లేక పుట్టంగండి జలాశయంగా పేర్కొంటున్నాం.ఇక పుట్టంగండి జలాశయం నిర్మాణం విషయానికి వస్తే- మొత్తం పనులను మూడు భాగాలుగా (రీచ్‌లు) విడదీసి ముగ్గురు గుత్తేదార్లకు అప్పజెప్పారు. మొదటి రీచ్ సున్న కిలోమీటర్ నుంచి 0.785 కి.మీ.వరకు, దీన్ని జి.వి. ప్రతాపరెడ్డి కంట్రాక్టర్‌కు,0.785నుంచి 1.675 వరకు రామయ్య అండ్ కంపెనీకి, 1.675 నుంచి 2.290 వరకు పయనీర్ బిల్టర్స్‌కు అప్పగించడం జరిగింది. రెండవ రీచ్‌లోని 0. 785 నుంచి 1.025 భాగంలో ఇన్ స్ట్రక్చర్, నాన్ ఓవర్‌ఫ్లో సెక్షన్ లాంటి ప్రధానమైన ఇంటేక్ మేసనరీ కట్టడం ఉంది. కిలోమీటరు 1.025 నుంచి 1.675 భాగం మట్టికట్ట. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా రామయ్య కంపెనీ తప్పుకోవడం, ఆ పనులను పి. మోహన్‌డ్డి అనే గుత్తేదారుకు అప్పచెప్పడం జరిగింది. మిగిలిన రెండు రీచ్‌ల పనులు మట్టికట్టలే. పనులన్నీ 2001 సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి సంపూర్ణం కావడంతో ఆరోజున జలాశయంలోకి ప్రప్రథమంగా నీటిని వదలడం జరిగింది. జలాశయంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరడంతో అక్కడ గుమికూడిన జనులు ఇంజనీర్ల గుండెలు ఆనందోత్సహాలతో పులకించాయి. అయితే ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు కూడా నిలువలేదు. జలాశయపు (సిస్టర్న్) ఇన్ గోడ వెనుక భాగం నుంచి లీకేజీలు మొదలయినయి. అంటే ప్రజలు ఆందోళనతో అగ్రహంతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. జరిగిన నష్టం సరిపోదన్నట్టు మరుసటి రోజు మట్టికట్టలో కొంతభాగం ఒకటిన్నర కిలో మీటర్ల వరకు కుంచించుకపోయింది. చాలా ప్రాంతాలలో పిట్టగోడ కూడా కుంచించుకపోయింది. మోహన్‌డ్డి కాంట్రాక్టర్ చేపట్టిన భాగంలో నాసిరకం పనులు జరిగాయన్న వాస్తవం బయడపడమేకాక పయనీర్ బిల్డర్స్ చేపట్టిన 1.675 నుంచి 2.290 కి.మీ మట్టికట్టపనులు కూడా లోపభూయిష్టంగా తయారయ్యాయని బయటపడింది. ఈ రీచ్‌లోని 1.735 కి.మీ నుంచి 1.750 (15 మీటర్లు) 1.765 నుంచి కి.మీ 1.750 కి.మీ వరకు (15 మీటర్లు) నుంచి లీకేజీలను గమనించారు.

మట్టికట్టలో హార్డింగ్‌జోన్ డిజైన్ ప్రకారం వాడవలసిన హై క్లే సాయిల్స్ నీటి వూపవాహం నిరోధించే బంకమట్టి)కి బదులుగా సాండీ కే ్లసాయిల్ (ఇసుకమట్టి మిళితమైన బంకమట్టి)ని ఉపయోగించినట్టు తేలింది. అంతేకాక మట్టికట్ట అంచెలంచెలుగా చేపట్టవలసిన కన్‌సాలిడేషన్‌కు అవసరమైన సాంద్రత వచ్చేవరకు రోలర్ తిప్పే పనులను కూడా సక్రమంగా నిర్వహించలేదని తేలింది. ఇంక మోహన్‌డ్డి చేపట్టిన రీచ్‌లో ఇంటేక్ కట్టడంలో పునాదులు మేసనరీ గోడ ఫ్లోర్ పనులన్నీ లోపభూయిష్టంగానే ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలో భాగంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, వారు పనులను పర్యవేక్షించి పరీక్షలు నిర్వహించి, ఇంటేక్ కట్టడంలోని లీకేజీలను అరికట్టడానికి అవసరమైన గ్రౌటింగ్ పనులు, డ్రిల్లింగ్ పనులకు, మట్టికట్టలో గమనించిన లోపాలను సరిదిద్దడానికి అవసరమైన నష్టం నివారణ చర్యలను సూచించడం జరిగింది. ఈ కొత్త మరమ్మతు పనులు చేపట్టడానికి అధికారులు మళ్లీ అంచనాలు తయారు చేయడం, అనుమతులు పొందడం లాంటి చర్యలకు ఉపక్రమించారు. తొలుత ఇంటేక్ స్ట్రక్చర్‌లో డ్రిల్లింగ్, గ్రౌటింగ్ లాంటి పనుల కోసం స్వప్న కన్‌స్ట్రక్షన్స్ అనే కొత్త కాంట్రాక్టరును నియమించి 70 లక్షల రూపాయల వ్యయంతో పనులు అప్పగించా రు. 70 లక్షలతో ప్రారంభమైన పనులు 1 కోటి 70 లక్షల రూపాయల దాక దేనికియినట్టు? అయినా లీకేజీలు ఆగడం కానీ, గ్రౌటింగ్ ప్రెజర్ డెవలప్ కావడం కానీ జరగలేదు. మట్టికట్టల్లో లీకేజీ అలాగే ఉండిపోయింది.

ఇదిలా ఉండగా పయనీర్ బిల్డర్స్ వారు తమ రీచ్‌లో బయటపడ్డ లోపాలను అధికారులు సూచించిన పద్ధతిలో సవరించే పనులు చేపట్టి కొంత మేరకు కృతకృతులయ్యారు. కాని మళ్లీ ఆ రీచ్‌లో లీకేజీ వాటిల్లింది. 1-5-2004 నాడు నిపుణుల కమిటీ పరీక్షించి మరికొన్ని పనులు చేపట్టాల్సిందిగా సిఫారసు చేసినా కాంట్రాక్టర్ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దీంతో కాంట్రాక్టర్ డిపాజిట్లను జప్తు చేయాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఇక మోహన్‌డ్డి కాంట్రాక్టర్ రీచ్‌లోని లోపాలను పాత కాంట్రాక్టర్‌కు బదులుగా స్వప్న కన్‌స్ట్రక్షన్‌తో చేయించడం వల్ల అనవసరంగా ప్రభుత్వంపైన 37 లక్షల 34 వేల అదనపు భారం పడటాన్ని 2003లో కాగ్ తప్పుబట్టి పాత కాంట్రాక్టర్ నుంచి ఆ డబ్బును వసూలు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. ఇంతవరకు కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి రికవరీ జరగలేదు. ఇప్పటి పరిస్థితి పాత కాంట్రాక్టర్లపై పెట్టిన ఖర్చుకు అదనంగా ఒక కోటి 70 లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి యథావిధిగా ఉండి, సిస్టర్న్ ప్రమాదంలో ఊగిసలాడుతున్నది. జరగరాని దేదైనా జరిగితే పంపు స్టేషన్లు మునగడం, తండాలు, గ్రామాలు జలమయమవడం హైదరాబాద్, నల్లగొండ జిల్లా వాసులు, తాగునీళ్లకు కటకటలాడే పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ఇక సాగునీటి సంగతి సరేసరి. నిపుణులు అనేకసార్లు పరిస్థితి సమీక్షించి, సూచనలు చేసినా ఫలితం లేదు. దీంతో పుట్టంగండి పుట్టెడు కష్టాల్లో కూరుకుని ఉన్నది. జీవో 20 తేదీ 7-5-2011 లోపాలను సవరించే పనుల కోసం 4 కోట్ల 28 లక్షల రూపాయలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టింది. ఇంటేక్ గోడ వెనుకాల సిమెంట్ కాంక్రీట్ పనులతో సిస్టర్న్‌ను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతున్నది.

హఠాత్తుగా జూలై 14 నాడు కుడివైపున ఉన్న ట్యాంక్ కనెక్ష న్, కుంగిపోవడం జరిగింది. వెంటనే కొన్ని తాత్కాలిక పనులు చేపట్టి మరమ్మత్తులు చేసి కనీసం రెండు మోటార్లు అయినా నడిపించి హైదరాబాద్‌కు తాగునీటి కటకటలేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలిసిం ది. ఇందుకు గాను జయవూపకాశ్ నారాయణ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినట్టు సమాచారం. ఏదేమైనా సమక్షిగంగా పుట్టంగండి లోపాలను అధ్యయనం చేసి శాస్త్రీయ పద్ధతిలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు అదనపు నిర్మాణాలు చేపడితే తప్ప పుట్టంగండి కష్టాలు తప్పేటట్టు లేవు. పుట్టంగండి పనుల లోపాలకు బాధ్యులైన ఇంజనీర్ల పేర్లను ప్రభుత్వానికి ఇటీవలే పంప టం జరిగింది. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇంజనీర్ల సంగతి సరే. నామినేషన్ పద్ధతిపైన ప్రభుత్వ సలహాదారుడి అండదండలతో రెండవ రీచ్ పనులను రామయ్య కంపెనీ నుంచి మోహన్‌డ్డి కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నట్టు తెలిసింది. ఆ కాంట్రాక్టర్‌పైన కానీ, ఆ సలహాదారుడిపైన కానీ ఎలాంటి చర్య ప్రభుత్వం తీసుకోలేదు. ఇంత అస్తవ్యస్తంగా జరిగిన పనులపై సమక్షిగమైన విచారణ జరిపి బాధ్యుల ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏమాత్రం ఉపేక్షించకుండా పుట్టంగండి పనులను శాశ్వత ప్రాతిపదికన తక్షణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine