HomeEditpage Articles

హర్షణీయం

Published: Sat,February 18, 2017 01:33 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యా యం చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్ర ఆడపిల్ల చదువుకోవడానికి మహాసంకల్పంతో రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయడం హర్షణీయం. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలందరూ చదువుకునే ఆస్కారం ఉన్నది. ఆడపిల్ల అంటనే గుండెల మీద కుంపటి అనే భావన ఉన్న సమాజంలో ఆడపిల్లలకు ప్రాధాన్యమిచ్చి సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం హర్షణీయం.
- బి.బాబురావు, కోహీరు దక్కన్, సంగారెడ్డి

స్వయం సమృద్ధి


అమెరికా అవలంబిస్తున్న విధానాలు ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నాయి. ఇతర దేశాలకు అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలు, ఉద్యోగాల వల్ల అమెరికా నిర్ణయాలు ఆయా దేశాలను ప్రభావితం చేయడంలో వింతేమీలేదు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక నిపుణులుగా అక్కడ సేవలందిస్తున్న వారిని దేశం విడిచి వెల్లాలనడం ఉద్యోగస్తులకే కాదు, ఆ దేశానికి కూడా నష్టమే.
- రాజు వన్నెల, కోరుట్ల జగిత్యాల జిల్లా

బస్సు సౌకర్యం కల్పించాలె


జిల్లాల విభజనతో పాటు కొన్ని మండలాలు కూడా ఆవిష్కృతం అయ్యాయి. ఆ కొత్త మండలాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని కొత్తగా ఏర్పాటైన మండలాలకు బస్సు సౌకర్యం కల్పించాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్, హైదరాబాద్

1089
Tags
 ,