HomeEditpage Articles

సృజనాత్మక వక్త

Published: Sat,February 18, 2017 01:37 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప్రసంగంలో కనిపించిన సృజనాత్మక శక్తి. రాజకీయ వారసత్వాలతో అందరూ ఎదిగిరాలేరు. ప్రజాసంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలిగే స్వీయ లక్షణమూ ఉన్నపుడే అది సాధ్యం.

లో క్‌సభలో తెలంగాణ అస్తిత్వపార్టీ తరఫున కవిత ఏకై క మహిళా సభ్యురాలు. ఆమె రాజకీయ అనుభవం దశాబ్ద కాలమే కావచ్చు. కానీ భావ వ్యక్తీకరణలో మాత్రం అంతకుమించిన ఆలోచనాశక్తి ఆమెలో మనకు కనపడుతుంది. సృజనాత్మక ఆలోచనా ధోరణే ఆమెకొక బలం. ప్రేక్షకులను ఆలోచింపజేయడమే ఒక మంచి వక్తకు ఉండాల్సిన లక్షణం. ఈ మధ్య అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆమె చేసిన ప్రసంగాన్నే ఒక ఉదాహరణ. మూడురోజు లు జరిగిన ఆ సదస్సులో వివిధ రంగాలకు చెందిన అనేకమంది మహిళలతో పాటు లోక్‌సభ స్పీకర్ కూడా అందులో ప్రసంగించారు. కానీ ఆ సదస్సును బాగా ఆకర్షించిన ప్రసంగం మాత్రం కవితదేనని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం.

ఆనవాయితీ ప్రకారం ప్రసంగించడం వేరు. సదస్సు ఉద్దేశాన్ని సృజనాత్మకంగా స్పృషించి చెప్పడం వేరు. మహిళా ఎంపీగా తనకున్న అభిప్రాయాలను బలంగా చెప్పగలిగారు. మన దేశ మహిళా సాధికారత గొప్పతనం, అలాగే అది సంపూర్ణ సాఫల్యం పొందకపోవడం గురించి చెప్పిన తీరే ఒక ఆకర్షణ. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ఇప్పటికీ మహిళలు ఓటు వేయడానికి అనుమతి లేని దేశాలున్నాయి. అలాగే సాధికారతవైపు దూసుకెళుతున్న దేశాలూ ఉన్నాయి. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాకు 200 ఏళ్ల లో ఒక్క మహిళ కూడా ఆ దేశానికి అధ్యక్షురాలు కాలేకపోయింది. మనం 60 దశకంలోనే మహిళా ప్రధానిని ఎన్నుకున్నాం. అలాగే, అందుకు పూర్తి భిన్నంగా మూడు దశాబ్దాలు దాటినా పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదించుకోలేకపోయింది కూడా మనమే... అని కవిత చెప్పిన రెండు పార్శాలూ సభికులను బాగా ఆకర్షించాయి.

అంతకన్నా మరింత సృజనాత్మకంగా భారతీయ మహిళ గొప్పతనం గురించి చెప్పి అందరినీ ఆకట్టుకోగలిగిన అంశంపైనే ప్రధానంగా చర్చించుకోవాలి. పెద్ద నోట్లరద్దు జరిగినా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ మాత్రమైనా తట్టుకొని నిలబడగలుగడానికి కారణమేమిటో విడమరిచి చెప్పారామె. రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో సమానంగా ఒక గృహిణి కూడా ఈ దేశంలో బాధ్యతను నిర్వహిస్తున్నదనే ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేశారు. పెద్దనోట్లరద్దు జరిగినపుడు ఒక గృహిణి పొదుపు సొమ్మే పేద, మధ్యతరగతి కుటుంబాలను కొంతమేరకు ఆదుకున్నది. ఈ విషయం కవిత తన ప్రసంగంలో వివరంగా చెప్పడంతో ఒక్కసారిగా సభికుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. దేశంలోని కోట్లాది గృహిణులు భర్తల చాటుకైనా, నేటుకైనా చేసే పొదుపుల గురించి తెలియని వారుండరు. ఒక్కోసారి కుటుంబానికి ఆపద వచ్చినపుడు ఆ గృహిణి పొదుపు సొమ్మే అక్కరకు వస్తుండటం చాలామందికి అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. కొద్దిపాటి ఆదాయంలోనే ఒక కుటుంబాన్ని నడుపగలిగే భారతీయ మహిళ నిజంగా మన రిజర్వుబ్యాంకు గవర్నర్ కన్నా తక్కువేమీ కాదు. నిజంగా కవిత చెప్పిన విషయం విన్న ప్రతి మహిళ తప్పక గర్వపడి ఉంటుంది.
మహిళల పొదుపు సొమ్ముతోనే దాదాపు 35 శాతం దేశ జనాభాను నడిపిస్తున్నదంటే ఆశ్చర్యం కలుగొచ్చు. గృహిణుల పొదుపు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు సమాంతరంగా నడిపిస్తున్నదని గోవిందాచార్య వంటి ఆర్థిక, సామాజిక తత్త్వవేత్త చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద ఆర్థిక మాంద్యం ఏర్పడినా మన దేశం అనేకసార్లు నిలదొక్కుకున్నదంటే అందుకు కారణం పరోక్షంగా మహిళల పొదుపు సామర్థ్యమే. పొదుపు చేసే పేద, మధ్యతరగతి గృహిణియే ఈ దేశానికి ఒక మహాలక్ష్మి. అలాంటి మహాలక్ష్మిని ప్రధా ని మోదీ జన్‌ధన్ ఖాతాల వైపు మళ్లించారు. కానీ మోదీ ప్రభుత్వం పేద మహిళల పొదుపును కూడా అక్రమ సొమ్ముగా అనుమానించకుంటే చాలు.

భూమిపై సగం, ఆకాశం లో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యత ను ఈదేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప్రసంగంలో కనిపించిన సృజనాత్మక శక్తి. రాజకీయ వారసత్వాలతో అందరూ ఎదిగిరాలేరు. ప్రజాసంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలిగే స్వీయ లక్షణమూ ఉన్నపుడే అది సాధ్యం. దానికి సృజనాత్మక ఆలోచనాశక్తి తోడు కావాలె. ఆ లక్షణాలు కవితలో బాగా కనిపిస్తాయి. మిగతా వారి కంటే ప్రజలను కలువడంలో, వారి సమస్యలు వినడంలో కవితకు నూటికి నూరు మార్కులు వేయవచ్చు. అలాగే, ఆమె సోషల్ యాక్టివిటీకి సంబంధించి అందరికీ తెలంగాణ జాగృతి మాత్రమే తెలిసి వుంటుంది. కానీ నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను కూడా ఆమె ఆసక్తితో నిర్వహిస్తుండటం గమనార్హం. రాష్ట్రం నుంచి ఒక మహిళా ఎంపీగా పార్లమెంట్‌లో కవిత స్పృశించిన అంశాలూ అనేకం ఉన్నాయి. రాష్ట్ర పసుపు రైతుల నుంచి మొదలుకొని కశ్మీరీ పండితుల పునరావాసం దాకా ఆమె అనేక అంశాలపై పార్లమెంట్‌లో అనర్గళంగా చేసిన ప్రసంగాలూ ఉన్నాయి. రాష్ర్టానికి చెందిన ఒక మహిళా ఎం పీగా ఆమె సృజనాత్మకు ఆలోచనలు, మెరుగైన ప్రజాసంబంధాలు కలిగి ఉం డటం ప్రశంసనీయం. ఒక నాయకురాలిగా, వక్తగా ఆమె తండ్రికి తగిన తన య అనిపించుకుంటున్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆమె చేసిన సృజనాత్మక ప్రసంగమే ఇందుకు నిదర్శనం.
kallurisreddy@gmail.com
kalluri

828
Tags
 ,