HomeEditpage Articles

పల్లెలే పట్టుకొమ్మలు

Published: Thu,February 16, 2017 03:03 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

దేశాభివృద్ధికి పల్లెలే పునాది. అక్కడి నుం చి పటిష్టత వచ్చినప్పుడే దేశం అభివృద్ధి బాటలో ముందుకుసాగుతుంది. అందు కే సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనే దృఢ సంకల్పంతో పనిచే స్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కుటుంబ స్థితిగతు లను అధ్యయనం చేయాలని అధికారు లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గ్రామా ల్లోని అన్ని కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగు నింపేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ సమా జం గర్విస్తుంది. అపర భగీరథునికి అన్ని వేళలా అండగా నిలబడుతుంది.
- బక్క బాబురావు, సికింద్రాబాద్

చర్యలు తీసుకోవాలి


వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్‌గా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. అట్లాగే అధికారులు కూడా ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకుం డా నిరాకరించాలి. రోజురోజుకు పెరు గుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను మరింత కఠినతరం చేయా లి. ముఖ్యంగా వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్స్‌గా మారిస్తే వ్యవసాయ సాగు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్న ది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయమై దృష్టిసారించి వ్యవసాయ భూముల పరిరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిపై ప్రజల కు అవగాహన కల్పించాలె.
- అయినం రఘునాథరావు, ఖమ్మం

మొక్కల సంరక్షణ


ఎండాకాలం వచ్చేసింది. రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని హరితహా రం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందు లో భాగంగానే ఊరూరా మొక్కలు నాటిం ది. ఎండలు ఎక్కువయ్యే కొద్దీ ఈ మొక్క లు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజ లు తమతమ ఊరిలోని ఉన్న మొక్కలను ఎండిపోనివ్వకుండా నిత్యం నిరందిస్తూనే ఉండాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే మొక్కలను ఎండిపోనివ్వ కుండా చూసు కోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఆ దిశగా అడుగులు వేద్దాం.
- మామిడి మధు, మానకొండూర్, కరీంనగర్

836
Tags
 ,