HomeEditpage Articles

తెలంగాణ గాంధీ

Published: Fri,February 17, 2017 01:55 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

తెలంగాణ సాధించిన నాయకుడే కేసీఆర్!
ప్రగతికొరకు తపించిన పాలకుడే కేసీఆర్!!

ఆంధ్ర నాయకుల దోపిడీ అంతట గమనించిండు
అసమానతలనణచుటకై అడుగు ముందుకేసిండు
ఉద్యమ రథసారథియై ఉత్సవంగ మార్చిండు
తెలంగాణ గావాలని తెగించి కొట్లాడిండు ॥తె॥

సాగునీటి తాగునీటి సమస్యలను చూసిండు
శాశ్వతమగు పరిష్కారమార్గం కనిపెట్టిండు
అరువయేళ్ళ మోసాలను అంతం గావించిండు
తెలంగాణతల్లి ప్రేమ దీవెనలను పొందిండు ॥తె॥

అడ్డంకుల నధిగమించి ఆగకుండ సాగిండు
అనుకున్నది నెరవేర్చి ఆనందం పంచిండు
ప్రజల చేత ఎన్నుకొని ప్రఖ్యాతి చెందిండు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యిండు ॥తె॥

పేదోళ్ళను పెనవేసిన కష్టాలను గాంచిండు
అభివృద్ధికి ఆదర్శ పథకాలను తెచ్చిండు
చైతన్య పాలనతో చరిత్ర సృష్టించిండు
తెలంగాణ ముద్దుబిడ్డ తెగువ చూపించిండు ॥తె॥

అసత్యాలు అవహేళన అవమానం భరించిండు
వెనుకడుగు వేయకుండ వీరత్వం చూపిండు
నలుదిశలా కీర్తిపొంది అజేయుడై నిలిచిండు
తెలంగాణ గాంధీయని జేజేలను అందుకుండు. ॥తె॥

-వడిచర్ల సత్యం
9441350137

1004
Tags
 ,