HomeEditpage Articles

మంచి నిర్ణయం

Published: Tue,February 14, 2017 01:21 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల లకు ఒంటిపూట బడులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ఒంటిపూట బడి తో లాభాలకంటే కష్టాలే ఎక్కువ ఉంటా యి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొరుగూళ్ల నుంచి వచ్చే విద్యార్థులు ఉద యం ఎనిమిది గంటలకే పాఠశాలల్లో ఉండాలి. దీనివల్ల పొద్దున అల్పాహారం తినకముందే పరుగులు పెట్టాల్సి వస్తుం ది. అలాగే ఎండల్లో విద్యార్థులు అనేక అవస్థలు పడాల్సి వస్తున్నది. కాబట్టి ఒంటిపూట బడులు లేకపోవట మే మేలు.
- జి.అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా

గ్రంథాలయాలను విస్తిరించాలె


స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలయో ద్యమం కూడా ప్రముఖ పాత్ర నిర్వహిం చింది. నాడు ఎందరో కవులు, కళాకారు లు, ఉద్యమస్ఫూర్తితో పోరాటం కొనసా గించారు. రాష్ట్ర ఆవిర్భావనంతరం మరు గున పడిన మన సంస్కృతి, మన చరిత్ర మన ఆచార వ్యవహారాల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే గ్రంథాలయోద్యమం ప్రతీ ఊరూరా జరుగాలే. నేటి తరానికి మన విశిష్ఠతలు, మన త్యాగాలు, మన పోరాటాలు తెలియవలసి ఉన్నది. దేశంలోనే ఒక ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలె.
- బక్క బాబురావు, హైదరాబాద్

చెత్తకుండీల్లోనే వేయాలి


చెత్త రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంతోమంది రాజకీయ నాయ కులు, సెలబ్రిటీలతో చీపురు పట్టి చెత్తను ఊడ్చి విపరీత ప్రచారం చేశారు. అయినా ఆశించిన ప్రభావం కనబడటం లేదు. ప్రభుత్వం ఎక్కడికక్కడ చెత్తకుండీలను ఏర్పాటుచేసినా ప్రజలు వాటిని ఉపయో గించుకోవటం లేదు. రోడ్లపైనే చెత్తను పడ వేస్తూ రహదారులను చెత్తమయం చేస్తు న్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా ప్రజలు చెత్తకుండీల్లోనే చెత్త వేయాలి.
- జి.రాకెట్‌బాబు,

1212
Tags
 ,