HomeEditpage Articles

బంజారాల ఆరాధ్యుడు

Published: Wed,February 15, 2017 01:55 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

దేశంలో ఒకే సంస్కృతి, సంప్రదాయం కలిగిన బంజారాలు సుమారు పది కోట్ల మంది ఉన్నారు. 27 పేర్లతో పిలువబడు తున్న బంజారాలు ఆయా వృత్తులపై ఆధా రపడి జీవిస్తున్నారు. మెజారిటీగా సంచార జీవనం గడుపుతూ జీవిస్తున్న బంజారాలు అతి తక్కువ పండుగలను కలిగి ఉన్నారు. సంత్ సేవాబాయా (సేవాలాల్ మహరాజ్), హతి రామ్ మహరాజ్‌తో పాటు సప్త భవానీలు అయిన తోళ్జ, ద్వాళాం గర్, హింగ్లా, మసూరి (మత్రా), సీతల కంకాళి, దండి మేరామ కుల దేవతలు. బంజారాల ఆచారం ప్రకారం శుభకార్యాలకు ముందు సంఘసంస్కర్త అయిన సేవాబాయా బ్రహ్మచారి, శాకహరి పేరుతో భోగ్ బండారో నిర్వహించి అనం తరం సప్త భవానీలను పూజించి కార్యక్ర మాలు నిర్వహిస్తారు.

అనంతపురం జిల్లాలోని గొల్లల దొడ్డి ప్రాంతంలో బంజారాల కులదైవం సేవాలాల్ మహరాజ్ గడ్ ఉన్న ది. సేవాలాల్ మహరాజ్ 1739 ఫిబ్రవరి 15న జన్మిం చారు. చాంద్రాయని గుట్టపై ఉన్న దేవాలయంలో శివున్ని పూజించేవారు. ఈ గుర్తులన్నీ ప్రస్తుతం భీమానాయక్ (వేది )పై ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్క రించుకొని బంజారాలు వేడుకలు జరుపు కుంటారు. సుమారు 30 ఏండ్ల వయస్సు లో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆదిలా బాద్ పెన్‌గంగా మీదుగా లదిణి ద్వారా మహారాష్ట్రవైపు పయనించి రాయిగఢ్ ప్రాంతంలో సమాధి అయ్యారు.

కాలానుగుణంగా, ఆర్థిక విధానాల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో బంజారాలకు గుర్తింపు లభించలేదు. 17గిరిజన తెగలతో లంబాడీ లు ఎక్కువగా 10 రాష్ర్టాలకు విస్తరించా రు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక త్వంలోని ప్రభుత్వం బడుగు బలహీన వర్గా ల అభివృద్ధికి తీసుకుంటున్న ప్రణాళి కలతో పాటు గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తు న్నారు. గిరిజన దేవతలు, పండుగలు, జాత రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
-ప్రొఫెసర్ సీతారాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ
(నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి)

886
Tags
 ,