HomeEditpage Articles

పాలమూరు - వలస కోణం

Published: Sun,March 19, 2017 01:57 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఎత్తిపోతల పథకాలు వలస బతుకుల్లో సరికొత్త ఆశల్ని చిరురింపజేసిన మాట వాస్తవం. అయితే, పాలమూరు లేబరు గుంపు మేస్త్రీల చక్రబంధంలో ఇరుక్కుని ఉన్నందున తన బతుకు తాను బతుకడానికి ఇంకా టైం పడుతుంది.
వలసకు కూడా చాలా ముఖాలున్న యి. అవును. అవిభక్త పాలమూ రు జిల్లాలోని ప్రజానీకం నలభై రెండు లక్షలైతే అందులో పధ్నాలు గు లక్షల దాకా వలస పక్షులుగా జీవితం సాగించే దుస్థితి ఉన్నది. ఇందులో ఒక భాగం- ఎప్పుడంటే అప్పుడు, నీళ్లొచ్చాయి కదా అని తమ గ్రామాల్లోకి రాలేరంటే నమ్ముతారా?

అదే కదా బాధ! మామూలుగా వలస వెళ్లిన వాళ్ల పరిస్థితి వేరు. పుట్టినూర్లో వృద్ధులను, పసిపిల్లలను విడిచి వారంతా హైదరాబాద్, ముంబై, షోలాపూర్, కర్ణాటక, గోవా.. ఇలా ఇంకా అనేక ప్రాంతాలకు పొట్ట చేతబట్టుకుని వలస పోతుంటారు. ఇదంతా తప్పనిసరిగా ఎవరంతట వారు ఎంచుకున్న బతుకుదెరువు అనుకోవాలి. ఇచ్ఛానుసారం అనాలి. అయితే, దీనికి భిన్నంగా ఇంకో రీతిలో కూడా వలస ఈ జిల్లాను పట్టి పీడించడం విషాదం. అదేమిటంటే, గుంపు మేస్త్రీల ఆధ్వర్యం లో వలస పోవడం!
నిజానికి అది పేరుకు వలస గానీ, కట్టుబానిసలుగా ఆయా మనుషులు తరలింపునకు గురవడమే అనాలి. ఆ వివరాల్లోకి వెళితే గుంపు మేస్త్రీల వ్యవస్థ గురించి, దాని నీడన కట్టు బానిసలుగా బతుకుతున్న లక్షలాది వలసకూలీల గురించి లోతుగా తెలుసుకోవాలి. సంక్షిప్తంగా చెప్పుకుంటే అదొక వ్యవస్థ. దాన్నుంచి పాలమూరు వలస కూలీ ఇప్పుడిప్పుడే బయట పడటం అంత సులభం కాదు. ప్రస్తుతం పాలమూరులో నీళ్లు రాగానే వలస జీవులు అధికంగా వెనక్కి రాలేదం టే కారణం వాళ్లు ఇప్పటికే ఈ వ్యవస్థలో బందీ అయి ఉండ టం కూడా ఒక కారణం అనుకోవచ్చు.

ఈ గుంపు మేస్త్రీలు కూడా ఇక్కడివాళ్లే. వీళ్లు కాంట్రాక్టర్లకు తాబేదార్లుగా, ఏజెంట్లుగా ఉంటూ తమ కింద నేరుగా పంపు పెద్దను నియమించుకుని వలస కూలీలను రిక్రూట్ చేసుకుం టూ ఉంటారు. తమ కమీషన్ తాము జేబులో వేసుకుని మిగ తా కొంత మొత్తాన్ని కూలీలకు ఇస్తూ ఈ వ్యవస్థను రెండు తరాలుగా పోషిస్తున్నారు. వీళ్లు పాలమూరులో చాలా చోట్ల.. ముఖ్యంగా కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని మం డలాల్లో అలాగే నారాయణపేట్ పరిసరాల్లోని దళితులు, చెం చులు, మిగతా వెనుకబడిన కులాలకు చెందిన కూలీనాలీని తమ చక్రబంధంలో ఉంచుకుంటూ వస్తున్నారు. దశాబ్దాలుగా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నరు. నిజానికి మేమే గనుక లేకపోతే అసలే పనిలేకుండా పోయి ఆకలిచావులు, ఆత్మహత్యలు పెరిగేవి కావా? అని కూడా వాళ్లు వాదిస్తారు. అందులోనూ కాస్త నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, పునర్నిర్మాణ దశ లో ఉన్న తెలంగాణకు ఈ విషయాలు అర్థం చేసుకుంటేగానీ పాలమూరు వలస కూలీలు విముక్తం కాలేరు.
అవును మరి. దశాబ్దాలుగా కరువూ కాటకాలు, అలాగే-కరెంటు సమస్య, సాగునీటికే కాదు, తాగునీటికీ కటకట.. ఒకవేళ కాస్త కాలం బాగున్నా కూడా సొంతంగా సాగు చేసుకొనేందుకు భూమి లేని నిరుపేదలు.. మొత్తంగా పాలమూరు లేబరు గుంపు మేస్త్రీల చక్రబంధంలో ఇరుక్కున్నాడు. ముందే చెప్పినట్టు అసలే పనిలేని స్థితి. దాంతో తమకు పని చూపిస్తామని చెప్పి ఇతర రాష్ర్టాలకు తరలించే ఈ ముఠా నాయకుడే గుంపు మేస్త్రీ. ఇతడు వలస కూలీలను గుంపులుగా, పెళ్లయిన లెంకలను (జంటలను) జోడీగా, భార్యాభర్తలకు కలిపి యాభై వేలు ముందే ఇచ్చి తీసుకువెళతాడు. వాళ్లు తప్పనిసరిగా పది నెలలు పనిచేయవలసి ఉంటుంది. ఒకవేళ పది నెలలు నిండకుండానే అనారోగ్యంతోనో ఇతర కారణాలతోనే వాపసు రావలసివస్తే, అంటే-ఆరో నెలలోనే వస్తే, మిగతా నాలుగు నెలలకు ఇంట్రెస్ట్ కట్టవలసి ఉంటుంది. ఈ కండిషన్ మీద వాళ్లను తీసుకెళ్లి పదకొండో మాసంలో మళ్లీ స్వగ్రామాల్లో వది లి పెడుతుంటారు. ఇట్లా పాలమూరులో కొన్ని వందల గుం పు మేస్త్రీలు రాజకీయ నాయకుల కనుసన్నల్లో యథేచ్ఛగా పని చేసుకుంటూ ఉండటం ఒక వాస్తవం.
ramesh-babu
వెళ్లేచోటు ఎక్కడ? అక్కడ రోజుకు ఎన్ని గంటల పని ఉం టుంది? ఎలాంటి పని ఉంటుంది? అని కూడా అడుగడానికి లేదు. తాము వెళుతున్న తోవ కూడా వారికి తెలియకుండా గుంపు మేస్త్రీలు జాగ్రత్త పడతూ ఉంటారు. ఇట్లా -ఒక రకం గా కట్టుబానిసలుగా వలస వెళ్లడం అన్నది పాలమూరులో దశాబ్దాలుగా ఆచరణలో ఉన్నది. దురదృష్టకరమైంది ఏమిటంటే, ఆరు నెలలు పనిచేసి వాపసు వచ్చిన కూలీలు వడ్డీ చెల్లించలేక వచ్చే ఏడు మళ్లీ ఈ చక్రబంధంలో చేరిపోవలసి వస్తుంది. ఇట్లా రెండు తరాలుగా ఈ వలస నడుస్తూనే ఉన్న ది. ఈ గుంపు మేస్త్రీల శ్రమదోపిడీకి తోడు స్త్రీలు లైంగిక దోపిడీకి గురికావడం అన్నది ఉన్నదే. ఇక అక్కడ కష్టమైనా, నష్టమైనా ఉండాల్సిందే. దీంతో వలస కూలీలు ఒకరకంగా వెట్టిచాకిరీ చేస్తూ గుంపుమేస్త్రీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడు తూ పొట్ట పోసుకుంటున్న దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా క కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా నాలుగు ఎత్తిపోతల పథకాలు పాలమూరులో పూర్తవడంతో మొన్నటి వానాకాలం, ఇప్పటి యాసంగి పంటలు వేసే నాటికి వారంతా తిరిగి రావ డం గురించి మనందరం ఆలోచిస్తున్నాం. కానీ, అది వెంటనే అయ్యే పనికాదు. వారంతా ఇప్పుడిప్పుడే తమ బతుకులు మారే పరిస్థితి వచ్చిందని గమనిస్తున్నారు. ఇదొక గొప్ప ఆశ. అయితే, నీళ్లొచ్చిన వెంటనే పండుగ కాదని వాళ్లకు బాగా తెలుసు.

చివరగా ఒక మాట. నీటి వనరుల కారణంగా వలస బతుకుల్లో మార్పు మొదలైంది. అది వేగవంతం అవుతుంది కూడా. అయితే, ఇప్పటిదాకా వలస కూలీలపై ఆధారపడ్డ గుంపు మేస్త్రీలు గత కొన్నేళ్లుగా వస్తున్న మార్పులను ముందే గమనించి రాజకీయ అనుచరులుగా మారుతున్నరు. కాంట్రాక్టులు దక్కించుకునే స్థాయికి వస్తున్నరు. ప్రభుత్వం ఈ సం గతి గమనించి వాళ్లను తగినవిధంగా అరికట్టాలి. అప్పుడే పాలమూరు వలసకు విముక్తి. దోపిడీదారుల నుంచి ప్రజలకు రక్షణ కూడా.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)

741
Tags
 ,