HomeEditpage Articles

ఒత్తిడిని జయించాలి

Published: Sun,March 19, 2017 01:56 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పోలీసులు ముందుగా మనుషులు, ఆ తర్వాతే ఉద్యోగులు. హుందాతనం నిండిన జీవితం వారికీ అవసరం. పోలీసు వ్యవస్థ మన భద్రత కోసం ఏర్పాటైంది. దాని గౌరవాన్ని కాపాడటం కేవలం శాఖ ఉద్యోగులదే కాదు, ప్రభుత్వాలు, ప్రజలది కూడా.

సమాజంలో శాంతిభద్రత ల పటిష్టతకు తూట్లుపొ డిచే అసాంఘికశక్తుల నుంచి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పిం చే నాయకత్వ బాధ్యత పోలీసు శాఖది. పోలీసు వృత్తిలో ప్రవేశించినవారు సమాజ రక్షకులై వారి శాఖకు కీర్తితేవాలి.
రెండున్నరేండ్ల కిందట జీవం పోసుకున్న తెలంగాణలో ఇటీవలి కాలంలో పోలీసులు, ముఖ్యంగా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు పోలీసు శాఖ దృఢత పట్ల ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ పరిణామం క్షేమకరం కాదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో యాలాల, పెద్దపల్లి, పెంచికలపేట, కుకునూరుపల్లి, దుబ్బాక సబ్ ఇన్‌స్పెక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆందోళనకరమై న ఈ పరిణామాలకు కలతచెందిన ఉన్నతాధికారు లు పోలీసు శాఖలో ఆత్మైస్థెర్యం దెబ్బతినడానికి గల కారణాలను అధ్యయనం చేయాలని బెంగళూరుకు చెందిన ఓ సంస్థను ఆశ్రయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

సామాజిక భద్రత విషయంలో ప్రత్యక్షంగా, ప్రగతిసాధనలో పరోక్షంగా దోహదపడాల్సిన పోలీ సు శాఖ ప్రజల హృదయాల్లో నిఖార్సయిన ముద్ర వేయడంలో విఫలమైంది. పర్యవసానంగా పోలీసు శాఖ పట్ల సమాజంలో ప్రతికూల వైఖరి, చిన్నచూ పు వేళ్లూనుకున్నాయి. దీనికితోడు మంచివాళ్లు, చెడ్డవాళ్లనే తేడా లేకుండా పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరితో నిర్లక్ష్యంగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించడం, స్త్రీలపట్ల అవమానకరంగా వ్యవహరించడం వంటి ధోరణులు పౌరుల్లో పోలీసుశాఖ పట్ల విముఖతను కలుగజేశాయి. లాకప్‌డెత్‌లు, నిందితులను విచక్షణారహితంగా కొట్టడం, బలవంతంగా నేరం చేసినట్టు ఒప్పించడం, స్త్రీలు, మహిళా హోంగార్డులపై లైంగికదాడి ఘటనలు పోలీసు శాఖ కు మరింత చెడ్డపేరు తెచ్చాయి. ఫలితంగా పోలీసులంటే ప్రజలలో రక్షణ కల్పించే ఉద్యోగులని కాక అమానుషంగా ప్రవర్తించే నిర్దయులనే అభిప్రా యం ఏర్పడింది. సమాజంలో పోలీసుశాఖ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రతికూల వైఖరిని గుర్తించి నా అటు సంబంధిత అధికారులు గానీ, గత ప్రభుత్వాలుగానీ పరిస్థితిని చక్కదిద్దడం కోసం కనీస చర్యలు తీసుకోలేదు. ఫలితంగా శాంతిభద్రతల పరిరక్షణ పటుత్వాన్ని కోల్పోయింది. పోలీసుశాఖ బయటేకాదు, లోపల కూడా బీటలువారి పరిస్థితే నెలకొంది. మరోవైపు పలుకుబడిగల రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పైస్థాయి అధికారులు, వారి ఒత్తిళ్లతో కిందిస్థాయి అధికారులు నిరంతర మానసిక సంఘర్షణతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎస్ సర్ అనడం తప్ప ఏమీ మాట్లాడని నియమ నిబంధనల నడుమ ఉద్యోగం చేస్తున్న పోలీసులలో అత్యధికులు దీర్ఘకాలంగా అదిమిపట్టిన ఒత్తిడితో చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, యాంగ్జయిటీ, అబ్సెషన్స్ వంటి అనారోగ్యాల బారి న పడుతున్నారు. డబుల్ డ్యూటీలు, సెలవు లభించకపోవడం, కుటుంబ సమస్యల వంటి అంశాలు వారి ఉద్యోగ జీవితాన్ని మరింత జటిలం చేస్తున్నా యి. ఉద్యోగస్థాయిలలో అంతరాలున్నా ప్రతి ఉద్యోగికీ వ్యక్తిగత ప్రతిష్ఠ, గౌరవం ఉంటాయి, ఉం డాలి. కానీ పోలీసు శాఖ పరిస్థితి ఇందుకు భిన్నం! కిందిస్థాయి ఉద్యోగులతో మాట్లాడేప్పుడు వారిని కనీసం కూర్చొమ్మని చెప్పకుండా ఎంతసేపైనా సరే, నిలబెట్టే మాట్లాడుతూ దర్పం, అహంభావం ప్రదర్శించే అధికారులు పోలీసుశాఖలో ఉన్నారు. ఇక కొంతమంది అధికారులు ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీసులను కూడా అరే, ఒరే అని పిలువడమూ జరుగుతున్నది. అలాంటి సంబోధనలతో కిందిస్థాయి పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతింటున్నా, వారు శాఖాపరమైన విధేయత మాటున బాధ, అవమానాలను మౌనంగా భరిస్తున్నారే తప్ప నోరు విప్పే పరిస్థితులు లేవు. కిందిస్థాయి ఉద్యోగులు ఏదో అడుగుతున్నారని కాకుండా మానవీయ మర్యాద ను ప్రదర్శించడాన్ని కనీస బాధ్యతగా గుర్తించి అధికారులు ప్రతి పోలీసును గౌరవించడం అవసరం. అవసరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత గౌరవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమున్నది. ఇవి చాలవన్నట్టు వృత్తిపరమైన కార్యచరణను గాలికొదిలి, కొందరు కక్కు ర్తి ఖాకీలు కాసుల కోసం వృత్తి ద్రోహానికి తెగించి శాఖపరువును మంటగలుపుతున్నారు. మామూ ళ్లు వసూలు చేయడం, వ్యక్తిగత, శాఖకు చెందిన వాహనాలలో ఉచితంగా ఇంధనం నింపమనడం, సొంత పనులకు రవాణా వసతి ఏర్పాటు చేయమ ని ప్రైవేటు వ్యక్తులను ఒత్తిడి చేయడం వంటి ఖాకీల చేష్టలు ప్రజలకు మింగుడుపడని అంశాలయ్యా యి. అవినీతి దురాగాతలకు అలవాటుపడ్డ పోలీసుల చర్యల్ని గర్హిస్తూనే వారు వృత్తిపట్ల పెంపొందించుకున్న వైఖరిని కూడా విశ్లేషించవలసిన అవసరం ఉన్నది.
srinivasa-cary
సామరస్యంతో మెలగాల్సిన పౌరులు ఘర్షణ లు, నేరాలకు పాల్పడకపోతే పోలీసుల అవసరమే ఉండదు. వ్యక్తులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యాన్ని ఒంటపట్టించుకోకుండా ముందుగానే తల్లిదండ్రులు, విద్యాలయాలు, పెద్ద లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొంతమం ది అవినీతిపరులు ఉన్నంతమాత్రాన వృత్తినే ప్రాణంగా భావించే కానిస్టేబుళ్లు మొదలుకొని ఉన్న తస్థాయి అధికారుల వరకు సేవాతత్పరతతో పనిచేస్తున్న పోలీసులను గుర్తించకుండాఅందరినీ ఒకేగాటిన కట్టి విమర్శించడం తగదనీ పోలీసుల అభిప్రాయం.

సెలవంటూ లేకుండా నిరంతరం ఒత్తిడిని తట్టుకుంటూ పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలని పోలీసులు కోరుతున్నారు. 1979 లో ఏర్పాటైన నేషనల్ పోలీస్ కమిషన్ శాఖాపరమైన సంస్కరణల కోసం సూచనలు చేసినా అవి వాస్తవరూపం దాల్చలేదు. అనంతరం 1996లో ప్రకాశ్‌సింగ్ అనే విశ్రాంత డీజీపీ సంస్కరణల అవసరంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2006లో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుశాఖలో ఏడు సంస్కరణలు అమలుచేయాలని తీర్పునిచ్చింది. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తి ళ్లు లేకుండా స్టే సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు, ప్రతిభ ఆధారిత డీజీపీ ఎంపిక, కనీసం రెండేళ్ల పదవీకాలం, జిల్లాస్థాయి అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల కననీసం రెండేళ్ల కొనసాగింపు, శాంతి భద్రతలు, దర్యాప్తు బాధ్యతల విభజన, నియామకాలు, బదిలీల వంటి ఉద్యోగ సంబంధ నిర్ణయాలు చేయడానికి పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ఏర్పాటు, పోలీసులకు సంబంధించి ప్రజల ఫిర్యాదులపై విచారణ జరుపడానికి పోలీస్ కంప్లెంట్ అథారిటీ ఏర్పాటు, కేంద్రస్థాయి పోలీసు వ్యవస్థలో ఎంపిక, నియామకాలకు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుచేయాలనే సుప్రీంకోర్టు తీర్పు ను అమలు చేయడంలో ఒక్కోరాష్ట్రం ఒక్కోలా స్పందించింది. అంతేకానీ సూచించిన సంస్కరణ లు పూర్థిస్థాయిలో అమలుకాలేదు. ఫలితంగా పోలీ సు శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.

గతంతో పోలిస్తే పోలీసు వ్యవస్థలో కొన్ని అనుసరణీయ మార్పులు చేటుచేసుకుంటున్నాయి. ఐతే అవి సంతృప్తికరమైన స్థాయిలో లేవన్నది అక్షరస త్యం. శాఖాపరంగా తీవ్రవాద దాడుల బాధితుల పరిహారం పెంపు, బీమా పింఛన్ యోజన వంటి పథకాలు పోలీసుల శ్రమకు గుర్తింపు సూచికలు. పోలీసుల వేతనం, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, వారి కుటుంబాలు, పిల్లల వైద్యం, విద్యకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలి. ప్రజా సంబంధా ల మెరుగు, శాఖపట్ల ప్రజల్లో సానుకూల వైఖరి పెం పొందించటం కోసం అధికారులు తరచుగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం అవసరం. ఒత్తిడిని అధిగమించడం, ఆరోగ్య పరిరక్షణ,
పోలీసు శాఖపట్ల ప్రజల దృక్పథంలోనూ మార్పులు రావాలి. పోలీసులు ముందుగా మనుషులు, ఆ తర్వాతే ఉద్యోగులు. హుందాతనం నిం డిన జీవితం వారికీ అవసరం. పోలీసు వ్యవస్థ మన భద్రత కోసం ఏర్పాటైంది. దాని గౌరవాన్ని కాపాడటం కేవలం శాఖ ఉద్యోగులదే కాదు, ప్రభుత్వాలు, ప్రజలది కూడా. బంగారు తెలంగాణ నిర్మాణంలో నిబద్ధత, ఆత్మగౌరవం గల పోలీసు శాఖ కూడా ముఖ్యమైన అంతర్భాగం.
(వ్యాసకర్త: స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, పూణెలో మాస్టర్స్ ప్రోగ్రాం ఇన్ గవర్నమెంట్ అకడమిక్ స్కాలర్)

562
Tags
 ,