జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పొన్నాల
కరీంనగర్, ఆగస్టు 6 (టీమీడియా): జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఐటీ మంత్రి పొన్నాల లక్ష్యయ్యను నియమితులయ్యారు. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా బాధ్యతలు చేపట్టాక 2010 డిసెంబర్‌లో ఇన్‌చార్జి మంత్రులను నియమించారు. పలువురి పనితీరుపై విమర్శలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటివరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ముఖేష్‌గౌడ్‌కు నిజామాబాద్, జిల్లా మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబుకు రెండోసారి రంగాడ్డి జిల్లా బాధ్యతలను కట్టబెట్టారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చాక నలుగురు ఇన్‌చార్జి మంత్రులు మారారు.
ఈ క్రమంలో పొన్నాల లక్ష్మయ్య ఐదో ఇన్‌చార్జి మంత్రి కావడం విశేషం. 2004లో మైనార్టీ సం క్షేమశాఖ మంత్రి ఫరీదొద్దీన్‌ను ఇన్‌చార్జిగా నియమించగా, మూడేళ్లపాటు (2007వరకు) కొనసాగారు. ఆ తర్వాత 2007 నుంచి 2009 వరకు హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి మంత్రికి జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. రెండోసారి రాజశేఖర్‌డ్డి అధికారంలోకి వచ్చా క అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇన్‌చార్జిగా నియమించారు. రోశయ్య హ యాంలోనూ జూపల్లే కొనసాగారు. కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ముఖేష్ గౌడ్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఈయన గారు ఇన్‌చార్జి మంత్రి హోదాలో జిల్లాకు ఒక్కసారి కూడా రాకుండా అపఖ్యాతి మూటకట్టుకున్నారు.
‘పొన్నాల’ మన జిల్లా బిడ్డడే..
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య ఎల్కతుర్తి మండలం దండెపల్లిలో జన్మించారు. అదే మండలం కేశవపూర్, కమాలాపూర్ మం డలం అంబాలలో పెరిగారు. వరంగల్‌లో స్థిరపడ్డా ఆ యనకు జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు జిల్లాను సందర్శించారు. శ్రీపాద ప్రాజెక్టు పనుల వేగవంతానికి విశేష కృషి చేశారు. దండెపల్లిలో తండ్రి రామకృష్ణయ్య పేరు మీద వాటర్ ఫ్లాంట్ నిర్మించారు. ఈ క్రమంలో ఆయన ఇన్‌చార్జి మంత్రిగా రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘భారీ’ మంత్రి కోసం చూస్తే ఐటీ మంత్రి..
జిల్లాలో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్‌కు చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌డ్డిని ఇన్‌చార్జి మంత్రిగా నియమించాలని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నే తలు ముఖ్యమంవూతిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తీరా పొన్నాలను నియమించడంతో పలువురు పెదవి విరుస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్‌వర్గాల్లో చర్చ సాగుతోంది.
Other News