Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
సుడిదోమతో తగ్గుతున్న పంటల దిగుబడులు

- దోమను సమూలంగా నివారించకుంటే భారీగా నష్టం
- దోమ నివారణకు ఇండోఫిల్ నూతన ఆవిష్కరణ టోకెన్
- ఇండోఫిల్ జనరల్ మేనేజర్ టి.నారాయణరెడ్డి

వరంగల్ అగ్రికల్చర్, ఆగస్టు 19 (టీమీడియా): రైతులు పంటలపై ఆశించే దోమను గుర్తించడం ఆలస్యం చేస్తే పంటకు బాగా నష్టం చేస్తోంది. పచ్చదోమను, తెల్లదోను( సుడిదోమ) సకాలం గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని ఇండోఫిల్ ఏపీ జనరల్ మేనేజర్ టి.నారాయణరెడ్డి సూచించారు. ఇండోఫిల్, జపాన్ మిట్‌సెస్ కంపెనీ సంయుక్త నిర్వహణలో దోమ నివారణకు అత్యంత వేగంగా పనిచేసే టోకెన్ మందును హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ దోమ నివారణకు అనేక రకాల మందులు మార్కెట్‌లోకి వచ్చినప్పటికి అవి ఎక్కువ రోజులు పైరుపై పనిచేయకపోవడం వల్ల రైతులు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందన్నారు.టోకెన్ అనేది ఒకసారి పిచికారి చేసినట్లయితే ఎట్లాంటి పరిస్థితిలోనైనా 20 రోజులపాటు పంటపై పనిచేస్తోందన్నారు. వరంగల్ జిల్లాలో కూడా దీనికి సంబంధించిన క్షేత్ర పరిశోధనలు జరిపినట్లు వెల్లడించారు.

నాలుగు సంవత్సరాల నుంచి 62 దేశాలలో దీనిని పరీక్షంచడం జరిగిందిన్నారు. అన్ని ప్రాంతాలలకు అన్ని రకాల వాతావరణంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తోందన్నారు. రీజినల్ సెల్స్ మేనేజర్ కె.శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇండోఫిల్ కంపెనీను 1962లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 30 రకాల అధునాతనమైన ఉత్పత్తులను రైతుల ముంగిట్లోకి తీసుకరాగలిగామన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలలో టోకెన్ మందును పరీక్షంచడం జరిగిందన్నారు. అసిస్టెంటు రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్‌కె.తిరుమల్‌రావు మాట్లాడుతూ దోమపైన వేగంగా దీర్ఘకాలికంగా పనిచేస్తోందన్నారు. మందు పిచికారి చేసిన ఆరుగంటల నుంచి పనిప్రారంభమవుతుందన్నారు.

పిచికారి చేసిన మూడు గంటల వరకు వర్షం కురువకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందని. టోకెన్‌తో పిల్లదోమలతోపాటు తల్లి దోమలు కూడా పూర్తిగా చనిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా సెల్స్ మేనేజర్ సానికొమ్ము వెంకటేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ సెల్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి డీలర్లు ఈదునూరి అమరేందర్‌రెడ్డి, మాచినేని శ్రీనివాస్‌రావు, ఉడుముల కొండారెడ్డి, అక్కల రవి తదితరులు పాల్గొన్నారు.


Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd