కార్యదర్శుల సమస్యలను
సీఎం దృష్టికి తీసుకపోతా
- వర్థన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
జిల్లాపరిషత్(వరంగల్), ఆగస్టు 19 (టీమీడియా): గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు సమ్మె చేయడంతో గ్రామ పాలన కుంటుపడింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకపోయేది కార్యదర్శులే. మిమ్ములను రెగ్యూలర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని వర్థన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నాల్గోరోజున కొనసాగిస్తున్న కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శు నిరవధిక సమ్మెకు శ్రీధర్ సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న కార్యదర్శులను వెంటనే రెగ్యూలర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో ఏపార్టీ ఉన్నా గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసేది కార్యదర్శులేనన్నారు.
కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేసింది టీడీపీయేనన్నారు. కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యూలర్ చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం అమానుషమైన చర్య అన్నారు. కార్యదర్శుల సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకపోయి త్వరలో జరుగునున్న పార్టీ ఎల్పీ సమావేశంలో చర్చించి అసెంబ్లీలో లేవనెత్తుతానని ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయి కార్యదర్శుల సమస్య సత్వరమే పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. కాంట్రాక్టు కార్యదర్శుల ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఈ ధర్నాలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిరంగి మహేందర్, అవుదాపురం రామారావు, గైరవాధ్యక్షుడు పల్లెర్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Other News