పాజిటివ్ ప్రయోగం..!
హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు ఆర్థిక చేయూత
నెలకు రూ.700 ప్రోత్సాహకం ఇచ్చేందుకు సమాయత్తం
కార్యాచరణలో ఐసీడీఎస్
హెచ్‌ఐవీ పాజిటివ్ బాధిత కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు సర్కారు సంకల్పించింది. సమాజ ఛీత్కరింపులతో బేజారెత్తుతున్న కుటంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పర్యవేక్షించబోతున్నది. సమగ్ర శిశు సంరక్షణ పథకం (ఐసీపీఎస్) కింద హెచ్‌ఐవీ బాధిత కుటుంబాల పిల్లలకు పోషకాహారం ఇవ్వడమే కాదు వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా కేంద్ర మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వశాఖ నేత్వంలోని ఫోస్టర్ కేర్ ఫండ్‌ను నెలకొల్పింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆ ఫండ్ ప్రధాన ఉద్దేశం. మొదట్లో రంగారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
ఈ సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఇక్కడా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. నిజానికి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అప్పట్లో జీవోను (జీఎం నెంబర్: 22, ఆగస్టు 31, 2009) జారీ చేసింది. అయితే పథకం విధివిధానాలు, సాధ్యాసాధ్యాలు తదితర మార్గదర్శకాలతోపాటు నిధుల విడుదలపై అప్పట్లో ప్రతిష్టంభన నెలకొన్నది. ఇటీవల ఐసీడీఎస్ అధికారులు ఐసీపీఎస్ పథకం తాలూకూ జిల్లా కోటా కింద విడుదలైన (రూ. 1,25,000) విషయాన్ని కలెక్టర్ రాహుల్‌బొజ్జాతో చర్చించారు. దీంతో కలెక్టర్ ‘ఈ పథకం అమలు చేయాల్సిందే’ అని ఐసీడీఎస్ అధికారులతో స్పష్టం చేశారు. దీంతో ఈ పథకాన్ని జిల్లాల్లో మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతోన్నాయి.
పాజిటీవర్స్...
తల్లిదండ్రుల నుంచి హెచ్‌ఐవీ సోకిన పిల్లల ఆరోగ్య, పోషణ కోసం కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 700 చొప్పున చెల్లించాలనేది సర్కారు ఉద్దేశం. హెచ్‌ఐవీ తీవ్రతతో తల్లిగానీ, తండ్రిగాని, లేదా ఇద్దరూ మరణించిన ఉదంతాల్లో ఇతర బంధుమిత్రుల వద్ద పిల్లల ఆలనకు ఆర్థిక చేయూత ఇచ్చేవీలుంది. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం ఇతరేతర స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉన్నపిల్లలకు ఇది వర్తించకుండా ఉన్నవారినే ఇందులో లబ్దిపొందే అవకాశాలున్నాయి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) విధివిధానాలు రూపొందించాం. అయితే ఎంతమంది పిల్లలున్నారనే విషయాన్ని, ఇందులో ఎవరినీ చేర్చాలనే విషయాన్ని పరిశీలిస్తోన్నాం అని ఐసీడీఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. మేరీ గ్రేస్ కుమారి తెలిపారు.
Other News