Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
చలివాగులో విద్యార్థి మృతదేహం లభ్యం..

శాయంపేట, ఆగస్టు 12 (టీమీడియా): చలివాగు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంట ర్ విద్యార్థి అల్లె రాజు మృతదేహం ఆదివారం ల భించింది. గంటల పాటు గజ ఈతగాళ్లు శ్రమమించినా ఫలితం లేకపోవడంతో అధికారులు చ లివాగు మత్తడిని తగ్గించారు. దీంతో నీటి ఉధృతి తగ్గి రాజు మృతదేహం తేలడంతో ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. దీంతో రాజు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శాయంపేట మండలం కొప్పుల గ్రామ శివారులో చలివాగు కాజువే వద్ద స్నానానికి వెళ్ళిన రాజు నీటి ఉధృతిలో శనివారం సాయంత్రం కొట్టుకుపోయిన విషయం తెలిసిం దే. రాత్రి మూడు గంటల పాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది.

ఈక్రమంలో ఆదివారం ఉదయమే శాయంపేట సీఐ రవీందర్, ఎస్సై నాగబా బు, ఇన్‌చార్జీ తహసీల్దార్ మహేందర్‌డ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాజువే నుంచి రాజు కొ ట్టుకుపోయిన దిక్కులో ఆరుగురు ఈతగాళ్లను తెప్పలు, పడవల సాయంతో గాలింపునకు పం పించి పరిస్థితిని సమీక్షించారు. అయితే మధ్యా హ్నం వరకు ఈతగాళ్లు వెతికినా రాజు ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు వులు కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ క్రమంలో చలివాగు నీటి ఉధృతిని తగ్గించేందుకు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.

దీంతో షట్టర్లు దించి వరద ప్రవాహం తగ్గించడంతో మరోసారి ఈతగాళ్లు తెప్పల సాయంతో రాజును వెతికారు. ఈ నేపథ్యంలో కాజువేకు 200మీటర్ల దూరంలో చెట్లమధ్య చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తె చ్చారు. పొలం పనికోసం వచ్చి కొట్టుకుపోయిన కుమారుడిని విగతజీవిగా చూడటంతో తల్లిదంవూడులు గుండెలవిసేలా రోదించారు. కొప్పుల గ్రామంలో విషాదం అలముకుంది. తండ్రి సాం బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ఎస్సై నాగబాబు పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd