Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
రమణీయంగా గోవృషభ కల్యాణం

- హాజరైన ఎమ్మెల్యే వినయభాస్కర్ దంపతులు
న్యూశాయంపేట, ఆగస్టు 6 (టీమీడియా): నగరంలోని హంటర్‌రోడ్ ప్రకృతి చికిత్సాలయం సమీపంలో జరిగిన గోవృషభ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లోక కల్యాణం కోసం చేరగుల్ల సంపత్‌రెడ్డి, రజిత దంపతుల ఆధ్వర్యంఓల చేసిన ఆవుకోడె (గోవృషభ కల్యాణం) పెళ్లికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ దంపతులు హాజరయ్యారు. ఉదయం 7-30గంటలకు హోమంతో ప్రారంభమైన ఆవు, కోడె వివాహమహోత్సవం సాయంత్రం 3గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలనీ వాసులు సుమారు 200మంది హాజరయ్యారు.

నిజంగా ఇంట్లో వివాహం జరుగుతుందా అనే పరిస్థితి ఏర్పడింది. ఐదుగురు వేద పండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రోచ్చరణ చేసి పెళ్ళి తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయభాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విన్నానే తప్పా ఎక్కడ చూడలేదని, ఇప్పుడు ప్రత్యక్షంగా దంపతులం పాల్గొనడం సంతోషాన్నిస్తుందన్నారు. ఇలా జరగడం జిల్లాలో ఇదే మొదటి సారి. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి లోకకల్యాణ కార్యక్రమాలు చేపడుతున్న సంపత్‌రెడ్డి దంపతులను అభినందించారు. భద్రాచలంలో జరిగిన కార్యక్రమాని కన్నా ఇది ఎంతో పెద్దది అన్నారు. అనంతరం నిర్వాహకుడు సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ నా వద్ద సుమారు 10వరకు ఆవులున్నాయని, ప్రజలకు అవసరమయ్యే ఆవు పంచకం, పేడ, పాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కాశీకి వెళ్ళినప్పుడు ఘాట్స్ వద్ద పెద్దలు ఆవుకు కోడెకు (గోవృషభ కల్యాణం) వివాహం జరిపిస్తే దేశ ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో, సకల సంపదలను కలిగి ఉంటారని, అలాగే వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండుతాయని చెప్పారన్నారు.

అందుకోసమే ఈ లోక కల్యాణం లాంటి కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంపత్‌రెడ్డి చత్తీస్‌గఢ్ మిత్రులు రాహుల్ భట్, భసంత్‌శర్మ, అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చూడలేదన్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మా మిత్రుడు తెలియజేయడంతో ఎలాగైనా చూడానలి చత్తీస్‌గఢ్ నుంచి వచ్చామన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. గుడిమల్ల విజయకుమార్, గంగాధరపట్ల ఫణిశర్మ, పరాంకుశం శ్రీమన్నారాయణాచార్యులు, రఘునాథాచార్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd