సిరిసిల్లా వయా కొమురవెల్లి
- విజయమ్మ దీక్షతో ఉత్కంఠ
- ముందస్తు అరెస్టులు
- అడ్డుకుంటామంటున్న తెలంగాణవాదులు
(టీమీడియా ప్రతినిధి-వరంగల్)విజయమ్మ దీక్ష జిల్లాలో ఉద్రిక్త వాతావరణానికి తెరతీసింది. చేనేత కార్మికుల సమస్యలపై ఒక్కరోజు దీక్ష పేరిట వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లు ప్రత్యేక రాష్ట్రంపై తమ పార్టీ వైఖరి ఏంటో చెప్పందే సిరిసిల్లలో అడుగుపెట్టనివ్వబోమని తెలంగాణవాదు లు హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలోవూపచారానికి వచ్చిన విజయమ్మను అడ్డుకోమని తెలంగాణవాదులు ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆమె తెలంగాణ జిల్లాలో దీక్ష చేసేందుకు నిర్ణయించారని ఈ ప్రాంత వాసులు ఆగ్రహిస్తున్నారు. పార్లమెంట్‌లో సమైఖ్యాంద్ర ప్లకార్డు పట్టుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్, అలాగే హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా కావాలని చెప్పిన వైఎస్ రాజశేఖర్‌డ్డి కుటుంబానికి చెందిన వైఎస్ విజయమ్మ ఏ పాస్‌పోర్ట్ వీసాతో తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్లకు వస్తున్నారని తెంలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని ఏ సీమాంద్ర నాయకుడినైనా అడ్డుకోవడం తమ హక్కు అని, ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. గతంలో చంద్రబాబును కూడా ఇదే తరహాలో అడ్డుకున్నారని, సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని రాయినిగూడెంలో నలుగురు విద్యార్థినులు నీళ్లు మింగించారు. జిల్లాలో రైతుబాట పేరుతో చంద్రదండుతో బయలుదేరిన చం ద్రబాబు ఒకరకంగా తెలంగాణపై దండయాత్ర చేసినట్లుగా ఇక్కడి ప్రజలు భావించారు. ఇదే తరహాలో వైఎస్ విజయమ్మ మొండిగా సిరిసిల్లలో ఒక రోజు దీక్షకు వస్తుందని పులువురు అంటున్నారు. చంద్రబాబు మాదిరిగాతన మంది మార్బలంతో తెలంగాణపై మరో దండయాత్ర చేసేందుకు వస్తున్నట్లుగా తెలంగాణ వాదులు భావిస్తున్నారు. గ తంలో వైఎస్ జగన్‌మోహన్‌డ్డిని మానుకోటలో అడుగుపెట్టకుండా అడ్డుకున్న తెలంగాణ వాదులు ఇ ప్పుడు వైఎస్ విజయమ్మను కూ డా ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్లలో కా లు మోపనివ్వమని హెచ్చరిస్తున్నా రు. ఈ పరిణామాలతో తెలంగాణ జిల్లాలలో అగ్గి రగులుకుంది. దీని కి ఆజ్యం పోసినట్లుగా పోలీసులు అత్యుత్సాహంతో తెలంగాణవాదులను ముందస్తు అరెస్టులు చే స్తుండడంతో ఒక్కసారిగా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
హోరెత్తుతున్న నిరసనలు...
విజయమ్మ రాకను నిరసిస్తూ జిల్లాలలో నిరసనలు హోరెత్తుతున్నాయి. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా విజయమ్మ దిష్టిబొమ్మ దహనాలు, రాస్తారోకోలు వెల్లు ఇప్పటి కే టీఆర్‌ఎస్ విజయమ్మను ఎలాగైనా అడ్డుకుంటామని సవాల్ విసరగా తెలంగాణ ప్రజావూఫంట్ సైతం ఆమె రాకను నిరసిస్తూ అడ్డుకుంటామని ప్రకటించింది. దీనికితోడు అనేక ప్రజాసంఘా లు, విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనను చేశాయి. ఎట్టిపరిస్థితుల్లో సిరిసిల్లలో అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపుతుంది. ఉద్యమాల గడ్డ ఓరుగల్లు జిల్లాలోని కొముర దేవస్థానంలో పూజలు చేసి సిరిసిల్లలో దీక్ష చేయాలని భావించిన విజయమ్మను కొముర అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
ముందస్తు అరెస్టులు...
విజయమ్మ సిరిసిల్లకు వెళ్లకుండా జిల్లాలోనే అడ్డుకునితీరు తామని టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాలు హెచ్చరించిన నేపథ్యం లో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగుతున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో సుమారు 30మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్న విజయమ్మ చేర్యాల మండలంలోని కొముల్లి మల్లన్నను దర్శించుకునే క్రమంలో టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాలు అడ్డుకుంటాయని భావిస్తున్న పోలీసు లు ఆ ప్రాంతంలో బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. కాగా హన్మకొండలోని అదాలత్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థిసంఘాలు విజయమ్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. రఘునాథపల్లి మండలం గోవర్దనగిరిలో విజయమ్మ రాకను ని రసిస్తూ ఆ గ్రామస్తులు హైవేపై రాస్తారోకోను నిర్వహించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే ఆమె తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి విజయమ్మను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనతో పాటు నాయకులు నాగుర్ల వెంక బీర భరత్‌కుమార్‌డ్డి, స మువూదాల మధు, శ్యాంసుందర్‌డ్డి, జితేందర్‌డ్డిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు విద్యా ర్థి నాయకులు వీరేందర్, దుప్పటి కిషన్, గుజ్జుల శ్రీనివాస్‌డ్డి, నల్ల ప్రవీణ్, కొంగర కిషోర్‌ను అరెస్టు చేసి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కేయూ పోలీసులు జాక్ చైర్మన్ సాదు రాజేశ్, జానీ, దేవోజినాయక్, మహేష్, బాలకృష్ణ, మధుకర్, సారయ్య, మంద వీరస్వామిని అరెస్టు చేశారు. మట్టెవాడ పోలీసులు, తోట హరీష్, నీలం రాజ్‌కిషోర్, కొలిపాక శ్రీనివాస్‌లను అరెస్టు చేయగా హన్మకొండ పోలీసులు టీఆర్‌ఎస్‌వీ నా యకుడు కంజర్ల మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు..
తెలంగాణ గడ్డకు అడ్డాగా చెబుతున్న వరంగల్‌లో, మానుకోట, రాయినిగూడెం లాంటి చారివూతక ఘటనలకు నెలవైన ఇదే జిల్లాలో వైఎఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ రాకను ఆ పార్టీ శ్రేణులు స్వాగతిస్తూ చేర్యాలలో చే తులు చాచి సాష్టాంగపడుతోంది. జిల్లాలో అక్కడక్కడా జోహార్ వైఎస్సార్ అంటూ, విజయమ్మను స్వాగతించండీ అంటూ ఆ పార్టీ శ్రేణులు జనానికి పిలుపునిస్తున్నారు. మొత్తంగా సిరిసిల్ల ఉరిసిల్లపై నిలబడి ఉందని ఎంతోమంది సొమ్ముచేసుకున్నట్టే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొమ్ముచేసుకోబోతోందా? అన్నదానిపై భిన్నస్వరాలు వినిపిస్తోన్నాయి. ‘ఎవరైనా రావచ్చు అభ్యంతరం లేదు కాకపోతే తెలంగాణ గడ్డమీద కాలుమోపిన ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ సారథులైనా సరే వారి వైఖరి చెప్పాల్సిందే’ అంటూ తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
Other News