తెలంగాణ వాదులకు ఏం జరిగినా పాలకులదే బాధ్యత
టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి
హన్మకొండ టౌన్, జూన్ 22 (టీ మీడియా) : వైఎస్సార్‌సీపై గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వస్తున్న సందర్భంగా నిరసన తె లుపుతున్న తెలంగాణ వాదులకు ఏం జరిగినా ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ నాయకులే బాధ్యత వహించాలని టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరడ్డి సీఎంగా ఉన్న కాలంలో 215 మంది చేనేత కార్మికులు ఆ త్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ ప్రత్యేక కమిషన్ వేస్తామని, రూ.100 కో ట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు. ఐదు వేల కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చార ని స్పష్టం చేశారు. 2009 ఎన్నికలకు ముందు ఇచ్చిన హా మీలే ఇంతవరకూ అమలు కాలేదన్నారు. తెలంగాణ రా ష్ట్రంలోనే చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతాయని తె లిపారు. ఉద్యమాన్ని అణచివేయడానికి సీమాంవూధులు కు ట్ర పన్నుతున్నారని వివరించారు. ఆనాడు జగన్ మహబూబాబాద్‌కు ఓదార్పు యాత్ర పేరుతో, విజయమ్మ సిరిసిల్ల లో చేనేత కార్మికుల కోసం దీక్ష ముసుగులో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడని విజయమ్మ సిరిసిల్లకు రావడం ఏమిటని ఆయన ప్ర శ్నించారు. వైఎస్‌ఆర్ విధానాల వల్లే నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విజయమ్మ సిరిసిల్లకు రావద్దం టూ ఆ కుటుంబాల మహిళలు, భర్తలను కోల్పోయిన మ హిళలు శనివారం జరిగిన ధర్నాలో పాల్గొన్నారన్నారు. విజయమ్మ రావద్దని జేఏసీ చెప్పి నిరసన తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. విజయమ్మను అడ్డుకోవడానికి జిల్లా నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలి తెలిపారు. వేలాది మంది పోలీసులతో కిర ణ్ ప్రభుత్వం బందోబస్తు పెట్టి విజయమ్మను తీసుకవస్తున్నారని అన్నారు.
సీమాంవూధుల కుట్రలో భాగమే...
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య
సీమాంవూధుల కుట్రలో భాగమే వైఎస్ విజయమ్మ సిరిసి ల్ల పర్యటన అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే విజయమ్మ దీక్షకు కిరణ్ ప్రభు త్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆనాడు పాలకుర్తికి చంద్రబాబు నాయుడు దండయాత్ర చేశారని, ఇప్పుడు వైఎస్‌ఆ ర్ సేన వస్తున్నారని తెలిపారు. తెలంగాణకు రావాలంటే వీ సా పట్టుకుని రావాలని వైఎస్ రాజశేఖరడ్డి అన్నారని, జగన్ పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నారని, అన్నారు. దీనిని బట్టి వైఎస్‌ఆర్ సీపీ కరడుగట్టిన సమైక్యాం ధ్ర పార్టీ అని తేలిందన్నారు.
ఏనాడైనా తెలంగాణ అన్యాయంపై మాట్లాడావా..?
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏనాడైనా తె లంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారా అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నా రు. వైఎస్‌ఆర్ పాలనలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారిని ఎందుకు పరామర్శించలేదన్నారు. జైలులో ఉన్న జగన్ జైతెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతానికి తామే స్వాగతం పలుకుతామన్నారు. తెలంగాణపై స్ప ష్టమైనవైఖరి తెలుపకుండా వస్తే ఊరుకునేది లేదన్నారు. స మైఖ్యవాద పార్టీలకు స్థానం లేదని పరకాల ఎన్నికలే రుజు వు చేశాయన్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మళ్లీ చెదరగొ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనికి ఏం జరిగినా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే బాధ్యత వహించాలన్నారు.
సమైక్యాంధ్ర పార్టీలకు స్థానం లేదు
- పరకాల ఎమ్మెల్యే మొగులూరి భిక్షపతి
తెలంగాణ ప్రాంతంలో సమైక్యాంధ్ర పార్టీలకు స్థానం లేదని పరకాల ఎమ్మెల్యే మొగులూరి భిక్షపతి అన్నారు. పరకాలలో వైఎస్‌ఆర్‌సీపీ గెలవడానికి కోట్ల రూపాయలు ఖ ర్చు చేసిందన్నారు. అయినా ప్రజలు తెలంగాణ వైపే ఉన్నారని తేలిందన్నారు. తెలంగాణలో బలోపేతం కావడానికే సమైక్యాంధ్ర పార్టీలు కుట్రపన్నుతున్నాయని అన్నారు. దీని లో భాగంగానే వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు సిరిసిల్ల పర్యటనకు వస్తున్నారని తెలిపారు. పరకాల ఎన్నిక ప్రచారానికి వచ్చిన సందర్భంలో విజయమ్మ పోలవరం కట్టించి తీరుతామని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏమైనా ఇబ్బందులు ఏ ర్పడితే దీనికి ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులదే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా విజయమ్మ తన పర్యటనను రద్దు చేసుకోవాలని ఆయన కోరారు
Other News