రాములోరి భూమికి రక్షణేది
పాలకుర్తి టౌన్, జూలై 22, (టీ మీడియా) :తెలంగాణకే తలమాణికమైన వల్మిడి సీతారామచంవూదస్వామి దేవాలయ భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కి రియల్ ఎస్టేట్‌గా మారుతున్నాయి. పాలకులు, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో విలువైన భూములు అన్యా క్రాంతమవుతున్నాయి. దూప దీప నైవేద్యాల పేరు తో వచ్చిన భూమిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, రైతులు భుజించేందుకు ప్రయత్నిస్తున్న ఉదంతం పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం...
పాలకుర్తి మండలంలో వల్మిడి గ్రామం ఉంది. అదే వాల్మికి పుట్టిన గడ్డ. ఇక్కడే ఆయన రామాయణాన్ని రచించాడని చరిత్ర చెబుతోంది. అలాంటి వల్మిడి గుట్టపై సీతారామచంవూదస్వామి దేవస్థానం ఏర్పడింది. అయితే ఇక్కడ పూజల కో సం నల్గొండ జిల్లా చౌళ్లరామారం గ్రామానికి చెం దిన స్థానాచార్యులు పూజారిగా ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దేశ్‌ముఖ్ (దొరల) వద్ద రా ముడి పూజల కోసం కొంత భూమిని సేకరించా రు.
ఈ భూములను దున్నుతూ వచ్చిన ఆదాయాన్ని రాములవారి పూజలకు, ఇతర ఖర్చులకు వినియోగించేవారని గ్రామస్తులు తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ లెక్కల ప్రకారం శ్రీ సీ తారామచంవూదస్వామి దేవస్థానం భూములు నా లుగు (పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి) మండలాల్లో సుమారు 58 ఎకరాల 29 గుంటల దేవుడి భూమి ఉండగా... 1953-54 పహాణీలో ధర్మపురం వెంకటాచారి పేరుమీద రిజిష్ట్రర్ అయి ఉంది. కాగా, తొర్రూరు గ్రామంలో సర్వే నెంబర్ 222లో ఒక ఎకరం 33 గుంటలు, 223లో రెండు ఎకరాల 9 గుంట లు, ఈర గ్రామంలో సర్వే నెంబర్ 91లో ఒక ఎకరం 38గుంటలు, గూడూరులో 630 సర్వేలో ఒక ఎకరం 34 గుంటలు, వల్మిడిలో 499 సర్వే నెంబర్‌లో రెండు ఎకరాల 13 గుంటలు, దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామంలో సర్వే నెంబర్ 395లో రెండు ఎకరాల 17గుంటలు, 396లో ఒకర ఎకరం 36 గుంటలు, 397 లో 7ఎకరాల 32 గుంటలు, 398లో 7 ఎకరాల 26 గుంటలు, 446/ఎలో ఐదు ఎకరాలు, 447/బిలో ఒక ఎకరం 5గుంటలు, 448లో ఆరుగుంటలు, 449లో 8ఎకరాల 32గుంటలు, రాయపర్తి మండలం కేశవపురం గ్రామంలోని 150 సర్వే నెంబర్‌లో 19గుంటలు, 158లో ఒక ఎకరం 13 గుంటలు, 159లో రెండు ఎకరాల 19 గుంటలన్నాయి. అలాగే కొడకండ్ల మండలం పోచంపల్లి గ్రామంలో 131 సర్వే నెంబర్‌లో 3 ఎకరాల 21గుంటల, 132/ఏలో ఒక ఎకరం 10 గుంటలు, 132/బి లో ఒక ఎకరం 10గుంటలు, 132/సిలో ఒక ఎకరం 11గుంటలు, లక్ష్మక్కపల్లి గ్రామంలో 159 సర్వే నెంబర్‌లో రెండు ఎకరాల 18గుంటలు, 180/సిలో 14గుంటలు, 380/ఎలో ఒక ఎకరం 3గుంటలు, 380/బిలో ఒక ఎకరం 3గుంటలు, 58 ఎకరాల 29గుంటల భూమిలో అధికంగా దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామంలో 34 ఎకరాల 39గుంటల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. కొడకండ్ల మం డలం పోచంపల్లిలో 7ఎకరాల 12గుంటల భూ మిని రైతులు కబ్జా చేశారని, వీటి విలువ సుమారు రూ.కోటికి పైగానే ఉంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి నాలుగు మండలాల్లోని వివిధ గ్రామాల్లో కబ్జాకు గురైన దేవుడి భూములను స్వాధీనం చేసుకొని దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని దేవాలయ పాలకమండలి కోరుతున్నారు.
Other News