సమస్యలపై ఎమ్మెల్యే నజర్
అపరిశుభ్రతపై అధికారులను మందలింపు
అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశం
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక
గాంధీ పార్క్‌లో షెడ్‌ల నిర్మాణానికి ఆలోచన
తొర్రూర్‌లో ఎర్రబెల్లి పర్యటన
మస్యలపై కదలిక తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనం
తొర్రూరు, జూలై 17, టీమీడియా : పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలపై మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టి సారించారు. ‘అభివృద్ధికి ఆమడదూరంలో తొర్రూరు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనంలో పేర్కొన్న సమస్యల్లో ప్రధాన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. మండల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పలు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బీరప్పనగర్, తొర్రూరు పెద్ద చెరువు, యాదగిరిడ్డి ఆసుపత్రి ఏరియా, చాకలి వాడ, గొళ్లవాడ, కూరగాయల మార్కెట్, గాంధీపార్క్, బాలికల ప్రాథమిక పాఠశాల ప్రాంతాలను ఆయన సందర్శించారు. అనేక చోట్ల చెత్తాచెదారం పేరుకు పోయి ఉండడం, అంతర్గత రహదారులు బురదమయంగా మారి నీటి నిల్వలు ఉండడం, ఏయిర్‌వాల్స్ వద్ద మంచినీరు కలుషితమయ్యే పరిస్థితులు ఉండడం, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను గమనించిన ఆయన వారం రోజుల్లో వీధులన్నీ శుభ్రపర్చి పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రతీ మంగళవారం రెండు వార్డుల చొప్పున పర్యటించి ప్రజాసమస్యలను, పంచాయతీ చేపడుతున్న కార్యక్షికమాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, నీటి నిల్వలు ఉంటే వెంటనే సంబంధిత స్థల యజమానికి నోటీసులు జారీ చేసి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. బీరప్పనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆక్రమిత స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేయాలి
తొర్రూరులో బాలికల ప్రాథమిక పాఠశాల ముందు ఇటీవల అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టిసారించారు. పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలు చేపట్టారని ఆయన దృష్టికి రాగా రెండు రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్షికమంలో పాల్గొన్న పంచాయతీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక సీఐ బాలస్వామికి సూచించారు.
గాంధీపార్క్ ఆవరణలో షెడ్‌ల నిర్మాణానికి ప్రణాళిక..
హరిపిరాల రహదారిలో గాంధీ పార్క్ ఆవరణలో, ప్ర స్తుతం కూరగాయల వ్యాపారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న విక్రయ కేంద్రాలను తొలగించి గ్రామ పంచాయతీ నిధులతో ఆ ప్రాంతంలో కాంప్లెక్స్‌ను నిర్మించాలని, దీనికి సంబంధిత ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం కూరగాయలు అమ్ముకుంటున్న వర్తకులకే ఈ కాంప్లెక్స్‌లోని గదులను కేటాయించడం జరుగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. గాంధీపార్క్ ఆవరణలో ఇటీవల నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ వెనుక భాగంలో రేకుల షెడ్‌లతో కూడిన మరో కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి..
తొర్రూరులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్నందున పరిష్కారం కోసం వెంటనే పనులు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రెండు 15హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను కొనుగోలు చేసి చెరువులో తవ్విన బావి ద్వారా నీటిని అందించాల్సిందిగా సూచించారు. తొర్రూరు పెద్ద చెరువులోకి మురుగు నీరు వదిలేలా నిర్మించిన కాల్వను మరొక ప్రాంతానికి మార్పు చేసి పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లగా చెరువులోని తాగునీటి బావిని, డ్రైనేజీ కాల్వను పరిశీలించారు. కార్యక్షికమంలో తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంపీడీఓ కె.రామ్మోహన్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మల్లేశ్, ఏఈ వెంక పంచాయతీ కార్యదర్శి వెంక జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, వీఆర్‌ఓ రాంచంవూదయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోతు నెహ్రు, ఇమ్మడి లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్. వెంకటనారాయణగౌడ్, ఎ.నరేందర్‌డ్డి, కిషన్‌యాదవ్, ఎం.రాంచందర్, ఇ.శ్రీనివాసరావు, బిపహ్లాదరావు, బి.శ్రీనివాస్, టీసి. అంజయ్య, బి.అమరేందర్ పాల్గొన్నారు.
Other News