Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
మంత్రి తమ్ముడి ‘భూ’మాయ..!?

సుబేదారి, జూలై17 (టీమీడియా) : మంత్రి సారయ్య తమ్ముడిని భూకబ్జా ఆరోపణలు చుట్టు ముట్టాయి. తన ప్లాటును ఉన్నతాధికారి అయిన ఆయన కబ్జా చేశారంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. నగరంలోని కీర్తినగర్‌కు చెందిన బాధితుడు మంగళవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి తమ్ముడిపై భూకబ్జా ఆరోపణలు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం....
నగరంలోని కీర్తినగర్‌కు చెందిన వెలగందుల సుధాకర్ వ్యవసాయశాఖలో జిల్లా సహాయ సంచాలకుడిగా పనిచేసి పదవీవిరమణ పొందాడు. దేశాయిపేట మర్రి వెంకటయ్య కాలనీలోని వెంక ఇండస్ట్రీయల్ వర్కర్స్ కో ఆప్ హౌసింగ్ సొసైటీకి చెందిన రెండు ప్లాట్లను ఆయన తండ్రి రాములు తనతో పాటు చెల్లెల్లికి 333 గజాల చొప్పున కొనుగోలు చేసి ఇచ్చాడు. చెల్లెలు ప్లాటు అమ్ముకోగా తన ప్లాటును 197లో నోటరీ చేసుకొని 200లో వరంగల్ ఆర్డీఓతో ఇన్‌పౌండింగ్ పొంది 2010లో భార్య విమల పేరిట రిజిస్ట్రేషన్ చేశా డు. ఈ క్రమంలో ఆ ప్లాటును మంత్రి బస్వరాజు సారయ్య తమ్ముడు కుమారస్వామి (ఎస్సార్‌ఎస్పీలో ఈఈ) తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశా డు. ప్లాటుకు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా రౌడీలతో చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆయన వల్ల కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్లు బాధితుడు విలేకరులతో మొరపెట్టుకున్నాడు.

మంత్రికి చెప్పినా పట్టించుకోలేదు..
కబ్జా విషయమై మంత్రి బస్వరాజు సారయ్యను హైదరాబాద్, వరంగల్‌లో పలుమార్లు కలిసి విన్నవించినా పట్టించుకోలేదని బాధితుడు తెలిపారు. తన ప్లాటు తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, వరంగల్ డీఎస్పీతో సహా గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వాపోయాడు. ఇప్పటికైనా తమపై దయ ఉంచి ప్లాటును ఇప్పించాలని సుధాకర్ దంపతులు మీడియా ద్వారా జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd