దూరం
హన్మకొండ టౌన్,(టీమీడియా):మంత్రులు, చీఫ్‌విప్‌ల మ ధ్య దూరం పెరుగుతోంది..? అని అడిగితే ఎవ్వరైనా నిజమేనని చెబుతారు. కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్‌లో మూడు ము క్కలాట కొనసాగుతోంది. పార్టీలో నాయకులు కూడా మూడు వర్గాలుగా పనిచేస్తున్నారు. నాయకులు వారి, వారి అనుచరులకు పనులు కావాల్సినప్పుడు అనుకూలమైన వారి దగ్గరికి వెళ్తున్నారు. పరకాల ఎన్నికల్లో ఒక్కటైన మంత్రులు తర్వాత ఎవ్వరి దారి వారే చూసుకున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యతారాగాన్ని పెంచలేదని చెప్పవచ్చు. అధిష్ఠానం సూచనలను కూడా పెడచెవిన పెట్టారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక లో తమదే సాగాలని ముగ్గురు పట్టుబట్టి కూర్చున్నారు. చివర కు పంతం నెగ్గించుకున్న వారి నెత్తిన బాధ్యతలు పెట్టి కినుక వ హించిన నేతలు కూడా ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎ న్నికల్లో అదే జరిగింది. ఇప్పటికీ నామినే పోస్టుల విషయం లో కూడా ముగ్గురు పోటీపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎం పిక కూడా ఇంకా పెండింగ్‌లోనే పడింది. ముగ్గురిని ఒప్పించ డం తలకు మించిన భారం అని భావించిన అధిష్ఠానం కూడా కిమ్మనకుండా ఉన్నట్లు సమాచారం.
పొటాపొటీగా సమీక్షలు
అయితే జిల్లాలో తామేం తక్కువ కాదంటూ ముగ్గురు నేత లు పొటాపోటీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో అధికారులు చేపడుతున్న పనులు, ప్రభుత్వం అమలు చే సే పథకాలను గురించి ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి ఇటీవలే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మరుసటి రోజే జిల్లాకు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య వెంటనే ఆయన ఇంట్లో వ్యవసాయధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంతో పాటు, నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్షికమాల్లో నూ వేర్వేరుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డికి పదవి రాకముందుకు ఇద్దరు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఉన్నారు. అప్పుడు జిల్లాలో రెండు గ్రూపులు ఉన్నాయి. గండ్రకు పదవి రావడంతో మూడు వర్గాలుగా చీలిపోయారు.
వీలు దొరికితే జిల్లాకు..
మంత్రులు, చీఫ్‌విప్ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండేవా రు. ఇప్పుడు ఊ అంటే వరంగల్‌కు వస్తున్నారు. పట్టణాల్లో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో లేకుంటే తమ ఉనికికే ముప్పు వస్తుందని ఆ నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో బుధవారం రాత్రి పొన్నాల లక్ష్మ య్య హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయన పోయిన తర్వాత తెల్లారే సరికే గండ్ర వెంకటరమణాడ్డి, మంత్రి సారయ్య వచ్చారు. వీ రిద్దరు కలిసి రాలేదు. గంట వ్యవధిలోనే నగరానికి వచ్చి వేర్వే రు కార్యక్షికమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు (నాలుగు రోజుల పాటు) మంత్రి లక్ష్మయ్య వివిధ కార్యక్షికమాల్లో బిజీగా పాల్గొన్నారు. ఇలా పొటాపోటిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధిష్ఠానం కలిసి పోవాలని చెప్పినప్పటికీ అది పైపైనే కొనసాగిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు.
Other News