ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్..
వరంగల్‌స్పోర్ట్స్, జూన్23(టీ మీడియా): జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా జరిగింది. ఉద యం 10గంటలకు హన్మకొండ సుబేదారిలోని అమరవీరుల జంక్షన్‌లో అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కన్నా వెంకటనారాయణ ఒలంపిక్ జ్యోతిని వెలిగించి రన్‌ను ప్రారంభించారు. సుబేదారి నుంచి పబ్లిక్‌గ్డాన్ మీదుగా జేఎన్‌ఎస్ క్రీడా ప్రాంగణం వరకు ఈ రన్ సాగింది. జేఎన్‌ఎస్ ప్రాంగణం వద్ద ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి జ్యోతిని అందుకుని సభావేదిక వరకు సాగారు.
క్రీడాభివృద్ధే లక్ష్యం: గండ్ర వెంకటరమణాడ్డి
జేఎన్‌ఎస్ క్రీడావూపాంగణంలోని హ్యాండ్‌బాల్ కోర్టులో జరిగిన ముగింపు కార్యక్షికమంలో ముఖ్య అతిథి చీఫ్‌విప్ వెంకటరమణాడ్డి మాట్లాడారు. క్రీడల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని ఆయన ప్రకటించారు. క్రీడాభివృద్ధి కోసం జిల్లాలో మినీ స్టేడియాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని అన్నారు.
జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి స్వామిచరణ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాల తీరు క్రీడాభివృద్ధికి వ్యతిరేకంగా ఉందన్నారు. రన్‌లో దాదా పు 200మంది చిన్నారులు, యువకులు, క్రీడాసంఘాల సభ్యులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్షికమంలో జె.సారయ్య, సాఫ్ట్‌టెన్నిస్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌డ్డి, రాష్ట్ర జూడో సంఘం అ ధ్యక్షుడు బండా ప్రకాష్, బలరాండ్డి, వెంకవూటాంనర్సయ్య, సారంగపాణి, ధనలక్ష్మి, ప్రవీణ్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
Other News