పరకాల ఫలితం పునారావృతమవ్వాలి
- సమైక్యవాదుల మెడలు వంచాలి
- పరకాల ఎమ్మెల్యే భిక్షపతి
కాకతీయఖని, జూన్ 23(టీ మీడియా) : భూ పాలపల్లిలో జరిగే సింగరేణి ఎన్నికల్లో పరకాల ఫలితం పునరావృతమవ్వాలని టీఆర్‌ఎస్ పరకా ల ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గని ఆవరణలో జరిగిన గేట్‌మీటింగ్‌కు బందెల చందర్‌రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన భిక్షపతి మాట్లాడారు. జాతీయ సంఘాల వైఫల్యంతోనే సింగరేణి పూర్తిగా నిర్వీర్య మై కార్మికులకు కష్టాలు పెరిగాయని తెలిపారు. రి టైర్డ్ కార్మికులకు 18 ఏళ్లుగా ఒక్క రూపాయి కూ డా పెంచలేకపోయారని అన్నారు. కనీసం డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం ఇప్పించలేదని ఆ రోపించారు. జాతీయ సంఘాలను నమ్మి మరోసారి కార్మికులు మోసపోవద్దన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నిరంతరం పోరా టం చేస్తున్న టీబీజీకేఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో స భ్యుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడు తూ సింగరేణిని నిర్వీర్యం చేసిన ఏఐటీయూసీ, ఐ ఎన్‌టీయూసీలకు ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హ క్కులేదన్నారు. పైగా టీబీజీకేఎస్‌పై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని తెలిపారు. టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే నిజాయితీ నిబద్ధతతో, చిత్తశుద్ధితో కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యలపై చిత్తశుద్దితో పనిచేస్తుందని సిరికొండ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు అప్పాని శ్రీనివాస్, మండ సంపత్, లక్ష్మణ్, పిల్లి సదానందం, రేణుకుంట్ల మల్లేశ్, తోట సారయ్య, బోయిన వెంకటస్వామి, సంపత్‌రావు, మనోజ్‌కుమార్, నర్సింగరావు, టీఆర్‌ఎస్ నాయకులు మందల రవీందర్‌డ్డి, పైడిపల్లి రమేష్, జోగుల సమ్మయ్య, మేకల సంపత్, తాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Other News