Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
జోరుగా బ్లాక్‌లో దందా..!

కురవి : మహికో కంపెనీ బీటీ విత్తనాలు కొరత ఉండటంతో కొంత మంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చి విత్తనాలను ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక ప్యాకెట్ ధర రూ.935 ఉండగా రూ.1,700 నుంచి రూ.2వేల వరకు అమ్మకాలు జరుపుతున్నారు. కురవి మండల కేంద్రంలో ఈ వ్యాపారం మూడు పూవులు.. ఆరు కాయల్లా విరాజిల్లుతోంది. మండల కేంద్రంలోని ఓ షాపు యజమాని కొంత మంది ఏజెంట్ల ద్వారా ఫోన్‌లో రేటు మాట్లాడుతూ డబ్బులు షాపులో తీసుకుని ప్యాకెట్లను మాత్రం రహస్య ప్రదేశాల్లో అందిస్తున్నట్లు సమాచారం. గ్రామాలకు కేటాయించిన పత్తి విత్తన ప్యాకెట్లోనే వీటిని జతచేసి అధికారులకు అనుమానం రాకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో 12 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులకు సుమారు 20 వేలకు పైగా ప్యాకెట్లు అవసరముంది. కానీ మార్కెట్‌లో కొరతగా ఉన్న మహికో కంపెనీకి చెందిన డాక్టర్ బ్రెంట్, నీరజ, కనక్ విత్తన ప్యాకెట్లు కేవలం 2,300 ప్యాకెట్లు మాత్రమే కేటాయించారు. రైతుల అవసరాన్ని అసరాగా చేసుకున్న వ్యాపారులు అక్రమ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.

కొనుగోలు చేసిన వారు సైతం ఎక్కడ కొన్నారని ఎవరైనా అడిగితే లాటరీలో వెళ్లిన ప్యాకెట్ మాత్రమేనని చెప్పాలని ఆయా వ్యాపారులు సూచించడం గమనార్హం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd