పార్టీల అంతర్మథనం...!
హన్మకొండటౌన్, జూన్13, టీమీడియా : పరకాల ఉప ఎన్నికలో పోలింగ్ ముగిశాక పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. గెలుపుపై మౌనం పాటిస్తూ గ్రామాల వారీగా అభ్యర్థులకు పడిన పోలింగ్ సరళి, ఓట్లను అంచనా వేయడంలో నాయకులు నిమగ్నమయ్యారు. శుక్రవారం పరకాల ఎన్నిక ఓట్లు లెక్కింపు జరుగనుంది. పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు మధ్యలో గడువు దొరకడంతో అన్ని పార్టీలు లెక్కలు వేయడంలో బిజీ అయ్యా యి. గతనెల 1నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకాకముందు నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు పరకాల గ్రా మాల్లో ప్రచారానికి దిగారు. అభ్యర్థులను ఎంపిక చేయకు న్నా ఒక దఫా మొదలే పూర్తి చేశారు. నాడు నామినేషన్ల త రువాత కూడా నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను పోటీకి దింపింది. జాతీయ, రాష్ట్ర నాయకులను కూడా ప్రచారానికి రప్పించారు. నువ్వానేనా అనే రీతిలో ప్రచారం చేశారు. పార్టీల అధ్యక్షులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందించుకున్నారు.
ధీటుగా బహిరంగ సభలు నిర్వహిస్తూ బలవూపదర్శనలకు దిగారు. గెలుపుమాదే అని ఓటింగ్ ముందు అందరూ అధ్యక్షులు ధీమాను వ్య క్తం చేశారు. అయితే ఓటింగ్ సరళిలో ఎన్ని పార్టీల మధ్య పోటీ కొనసాగిందని ఎగ్జిట్‌పోల్స్‌పై నాయకులు చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల వారీగా పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందో లెక్కలు వేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ భయం..ఐదు ప్రధాన పార్టీలకు క్రాస్‌ఓటింగ్ భయం పట్టుకుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మధ్య పోటీ నెలకొందని తేలడంతో మిగతా పార్టీలు ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నాయి. పోలింగ్ ఎక్కువ శాతం నమోదు కావడం కూడా వీరి అనుమానాలకు బలం చేకూరుతోంది. శత్రువు..శత్రువు..మిత్రుడు అనే విధంగా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ పంతం నెగ్గించుకునేందుకు క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇక గెలువ లేము అనుకున్న పార్టీల నాయకులు కూడా క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఇపుడు క్రాస్ ఓటింగ్ హాట్‌టాపికే. క్రాస్ ఓటింగ్ వల్ల ఏ పార్టీకి మేలు జరుగుతుందో, ఏ పార్టీని నష్టం జరుగనుందోనని ఆయా పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ తమకే లాభం చేస్తాయని కొన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. శత్రువును ఓడించడానికి ఓట్లు మరో అభ్యర్థికి వేయడమే శరణ్యమనుకున్న విధంగా మూడు పార్టీలు వ్యవహరించడంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలా గ్రామాల్లో కార్యకర్తలే నేరుగా ఫలానా గుర్తుకు ఓటేయండని వాహనాల్లో తరలించిన సంఘటనలు చూపరులను విస్మయానికి గురచేశాయి. ఉదయం జరిగిన పోలింగ్ సరళిని చూసిన ఆయా పార్టీల నాయకులు మధ్యాహ్నం 12తరువాత అన్ని మండలాలకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే బాహాటంగానే చెప్పి క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. ఈ క్రాస్ ఓటింగ్ బయట పడతాయని అభ్యర్థులు అంచనాకు వస్తున్నారు.
మౌన ముద్రలో నాయకులు ఎన్నికలు ముగియగానే నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సాధారణం. కానీ పరకాల ఉప ఎన్నిక పోలింగ్ తరువాత నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పరకాలలో తామే గెలుస్తామని ధీమాతో ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. క్రాస్ ఓటింగ్ పడడం వల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దీంతో గతంలో విలేకరుల సమావేశాలు పెట్టే నాయకులు ఇప్పుడు అంత సాహసం చేయలేకపోతున్నారు. గెలుపు కొద్ది తేడాతో ఉండొచ్చని నాయకులు అంటున్నారు. మొదలే ప్రకటిస్తే, ఫలితాలు వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారు. అయిదు పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల ముఖ్య నాయకులు కూడా మాట్లాడడం లేదు. శుక్రవారం వరకు వేచి ఉండడమే మంచిదన్న భావనతో నాయకులు ఉన్నారు. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినా కూడా పార్టీలు వాటితో కొంత గంభీరత్వం ఉన్నా లోలోపల గుబులుగా ఉన్నారు. అయితే ఎగ్జిట్‌పోల్స్‌లో పెద్దగా ఓట్లు రావని తేల్చిన పార్టీలు కూడా తమకే సైలెంట్ ఓటింగ్ కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సైలెంట్ ఓట్లతో గెలువలేమా అని అంటున్నారు. నాలుగు మండలాలలోని గ్రామాల నుంచి నాయకలు లెక్కలు తెప్పించుకుంటున్నారు. ఎక్కువ ఓట్లు పోల్‌కావడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందని చర్చింకుంటున్నారుయగామాల వారీగా ఓట్ల బలాబలాలను వేసి పార్టీలు ఒక అంచనాకు వస్తున్నాయి.
Other News