Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Warangal>>>General News
పోటెత్తిన పరకాల

- గులాబీమయమైన పోరుగడ్డ
- చిరుజల్లులు పడుతున్నా సడలని సభ
- ప్రశ్నలు సంధిస్తూ.. నిప్పులు కురిపిస్తూ..
- ఉద్యమసారథి కేసీఆర్‌ప్రసంగం
- కామారెడ్డిపల్లి నుంచి హరీశ్‌రావు.. రాజిపేట నుంచి రాజేందర్
- పాదయాత్రతో సభాస్థలికి..
- టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

పరకాల/ జిల్లాపరిషత్, జూన్9, టీన్యూస్ : ‘సీమాంధ్రతొత్తులైన కొండా దంపతుల్లారా మీ గూండారాజ్యం ఇక సాగదు..పరకాల ప్రజలు మీ గూండారా జ్యా న్ని పాతరేస్తరు..టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖతమయ్యాయి.. ఆంధ్రబాబుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం’ అని టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. శనివారం పరకాలలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సురేఖ పరకాలలో నీ సభ కంటే ఎవరూ ఎక్కువగా నిర్వహించలేరని సవాల్ విసిరావు, దేశ చరివూతలోనే ఎవరూ నిర్వహించని రీతిలో సభను నిర్వహించిన ఘనత ఓరుగల్లుకు దక్కిన విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నావా? అని కొండా సురేఖపై ధ్వజమెత్తారు. నీ సభకు వచ్చింది తొలుకొచ్చిన జనం, మా సభకు స్వచ్ఛందంగా వచ్చిన జనమన్నారు. పల్లెలకు పల్లెలే కదిలివచ్చాయన్నారు.

ప్రతీ పల్లె తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని, ప్రతి ఒక్కరి గుండెల్లో తెలంగాణ ఆకాంక్ష ఉందన్నారు. ఇప్పటికే కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మాడ్డికి కోటి ఆశలున్నాయన్నారు. కొండా దంపతుల్లారా ఖబడ్దార్ సామాన్యుల సాహసం ఏంటో మానుకోటలో రుచిచూపించింది మరిచిపోయారన్నారు. మానుకోటలో తెలంగాణ బిడ్డలు మీకు ప్రాణ భిక్ష పెట్టారని, అది మరచి మీరు అవాకులు..చెవాకులు పెలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, నిధులు దోచుకున్న వైఎస్ రాజశేఖర్‌డ్డి తన కొడుకుకు లక్షల కోట్లు దోచిపెట్టాడని, వాటితోనే తెలంగాణను రాకుండా అడ్డుకున్న తెలంగాణ ద్రోహి రాజశేఖర్‌డ్డి అని మండిపడ్డారు. వచ్చిన తెలంగాణను వద్దని ఆ రోజు పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్ల్లకార్డు పట్టుకొని జగన్ అడ్డుకున్నాడని ఈటెల ధ్వజమెత్తారు.

సీఎం కిరణ్‌కుమార్‌డ్డి తొమ్మిది జిల్లాలు తిరిగి వరంగల్ జిల్లా రాయినిగూడెం వస్తే అక్కడ మహిళలు చెప్పులు విసిరి ఓరుగల్లు పౌరుషాన్ని చాటారన్నారు. 2006 ఉప ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌డ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌ను ఓడించేందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రెండు లక్షలకు పైగా మెజారిటితో గెలిచారని రాజేందర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఊరూవాడా ఒక్కటై ఉద్యమం చేస్తుంటే అప్పటి సీఎం రోశయ్య విద్యార్థులను ఉస్మానియా నుంచి ఖాళీ చేయించేందుకు కుట్ర చేశాడని, ఈ క్రమంలోనే విద్యార్థులకు నీళ్లు, తిండి పెట్టకుండా చేస్తే ప్రొఫెసర్ల భార్యలు ముందుకొచ్చి విద్యార్థులకు మేము అన్నం పెడుతామని చెప్పి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. పరకాల బిడ్డలు ఉద్యమ బిడ్డలు..ఇక్కడ కొండాగుండా రాజ్యాన్ని అంతం చేసేందుకు జూన్ 12న టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి తమ తెలంగాణ ఆకాంక్షను స్పష్టం చేస్తారని రాజేందర్ అన్నారు.

ఈ సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌డ్డి, కొప్పుల హరీశ్వర్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, ఏనుగు రవీందర్‌డ్డి, కె.విద్యాసాగర్‌రావు, నల్లాల ఓదేలు, దాస్యం వినయ్‌భాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, పొలిట్‌బ్యూరో సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్, అజ్మీరా చందూలాల్, కన్నెబోయిన రాజయ్య యాదవ్, కర్నె ప్రభాకర్, సిరికొండ మదుసూధనాచారి, డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, తక్కలపల్లి రవీందర్‌రావు, ముత్తిడ్డి యాదగిరిడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గొంగిడి సునితా మహేందర్‌డ్డి, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, టిఆర్‌ఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర నాయకులు గుడిమల్ల రవికుమార్, దొమ్మాటి సాంబయ్య, మంద ఐలయ్య, నాగుర్ల వెంక మర్రి యాదవడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఆటాపాట
పరకాలలో శనివారం జరిగిన ఎన్నికల సభలో రసమయి బాలకిషన్, గిద్దె రామనర్సయ్య, దార దేవేందర్, సాయికుమార్ బృందం నిర్వహించి ఆటాపాటా అందరిని అలరించాయి. రసమయి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీ పార్టీలు తెలంగాణకు చేసిన మోసాన్ని తన పాటతో, మాటలతో వివరించారు. ఆధ్యాంతం కళాకారుల పాటలు ధూంధాం కార్యక్షికమం సభికులను కదలకుండా ఆకట్టుకున్నాయి. సభలో జూనియర్ కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఒక్క ఓటు రెండు లక్ష్యాలు
టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి

పరకాల ప్రజలు తమ ఉద్యమ ఆకాంక్షను ఉప ఎన్నికల్లో ప్రతిబింబింప చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి పిలుపు నిచ్చారు. ఒక్క ఓటుతో రెండు లక్ష్యాలు నెరవేరాలన్నారు. ఒకటి పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని తెలంగాణ కోసం గెలిపించుకోవాలని, రెండవది కొండా దంపతుల గూండా రాజ్యానికి చరమగీతం పాడనున్నారన్నారు. ఇందుకు మానుకోట స్ఫూర్తే నిలు నిదర్శనమన్నారు. పరకాలలో టీఆర్‌ఎస్‌ను గెలిపించడంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని సుదర్శన్‌డ్డి అన్నారు.

సమైక్యవాదులకు బుద్ధి చెప్పాలి
డాక్టర్ గుండె విజయరామారావు, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి

పరకాల ఉప ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలకు బుద్ధి చెప్పాలని టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ గుండె విజయరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ పార్టీలను బొందపెట్టాలన్నారు. తెలంగాణ ఇస్తమని మోసం చేసిన బీజేపీ అడ్రసు గల్లంతు చేయాలన్నారు. పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతి గెలుపు తెలంగాణకు మలుపు కాబోతోందని, ప్రజలు భారీ మెజారిటితో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గూండారాజ్యం పోయి గులాబీ రాజ్యం వస్తది
టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు

‘పరకాల ఉప ఎన్నికతో కొండా దంపతుల గూండా రాజ్యం కూలుతుంది. లక్షల కోట్లు దిగమింగిన వైఎస్ జగన్‌కు కొండా దంపతులు సద్ది మోస్తున్నారు’ అని కొండా దంపతులపై టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. 13 సంవత్సరాలలో పరకాల ప్రాంతాన్ని కొండా దంపతులు అభివృద్ధి చేయలేదు సరికదా ఎందరో గూండాలు, రౌడీలను అభివృద్ధి చేశారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పరకాలలో కొండా గూండారాజ్యం పోయి గులాబీ రాజ్యం వస్తదన్నారు. మన లక్ష్యం సమైక్యవాద పార్టీల డిపాజిట్ గల్లంతు చేయడమేనన్నారు. టీడీపీ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నదని, కాంగ్రెస్ ఇచ్చేది మేమేనంటూ మోసం చేసిందని, బీజేపీ తెలంగాణ తమతోనే వస్తదని తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

డూప్ల్లికేట్ తెలంగాణ వాదులకు గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణ విషయంలో తన స్టాండ్ చెప్పకపోవడంతో దయాకర్‌రావు స్టాండ్ వేసిన సైకిల్‌నే తొక్కుతున్నారని ధ్వజమెత్తారు.

ఏ ఊరికెళ్లినా ప్రజలు ఇందిరమ్మ బిల్లులు రావాలంటే కమీషన్‌లు ఇవ్వాలంటా, డబ్బులు ఇస్తేనే ఇళ్లమంజూరు చేస్తారని చెబుతున్నారని, బుచ్చన్న గెలుపుతో మన లక్ష్యం నెరవేరుతుంది..ఇందిరమ్మ బిల్లు తిన్నవారిని కటకటాలకు పంపించి తిన్నడబ్బులను కక్కిస్తామని హరీశ్‌రావు అన్నారు.

ఈ ఎన్నికలు తెలంగాణవాదులకు,
ద్రోహులకు మధ్య యుద్ధం
టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి

పరకాలలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ వాదులకు, తెలంగాణ ద్రోహులకు నడుమ జరుగుతున్న యుద్ధమని టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి అన్నారు. గత 56 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్నామని, కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సమైక్యవాద పార్టీలు అడ్డుకున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో వాటి డిపాజిట్ గల్లంతు చేసి బుద్ధి చెప్పాలని పరకాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొండాదంపతులు అభివృద్ధి చేయకపోగా పరకాల తాగునీటికోసం చెక్ డామ్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయితే పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్‌ను బెదిరించి యాబైలక్షలరూపాయలు తీసుకున్నారని ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. భిక్షపతి మీలాగా గూండాయిజం చేయలేదని, నీతి నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించానని గుర్తుచేశారు. తనను అఖండ మెజారిటితో గెలిపించాలని పరకాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పరకాల..పోరాటాల పురిటిగడ్డ
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి

పరకాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది..నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తెలంగాణ పోరాటం చేశారని, దేశ ప్రజలందరు పరకాలవైపే చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి అన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు సీపీఐ అభ్యర్థిని పోటీ పెట్టకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిందన్నారు. పరకాల ప్రజలు భిక్షపతి భారీ మెజారిటితో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భిక్షపతి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని వెంకవూటాములు అన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd