|
|
చెక్‌డ్యాంలో పడి వృద్ధుడు మృతి
శంకర్‌పల్లి, ఆగస్టు 19 (టీ మీడియా): స్నానానికి వెళ్లి చెక్‌డ్యాంలో పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మండలం బుల్కాపురం గ్రామానికి చెందిన వారణాసి వెంకటయ్య(65) బంధువు మూడు రోజుల క్రితం మృతిచెందాడు. కాగా ఆ రోజు శవయావూతలో పాల్గొని స్నానానికని వెళ్లి చెక్‌డ్యాంలో పడి మృతిచెందాడు. కాగా ఆదివారం పశువుల కాపరులు అటు వైపు వెళ్లగా నీటిలో ఉన్న శవాన్ని చూసి గ్రామస్తులకు తెలిపారు. వెంకటయ్య గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తుండేవాడని చెప్పారు. తాగిన మైకంలో చెక్‌డ్యాంలో పడి మృతిచెంది ఉంటాడని తెలిపారు. వెంకటయ్యకు ఈత రాదని తెలిపారు. సంఘటన స్థలాన్ని స్థానిక శంకర్‌పల్లి కానిస్టేబుళ్లు మోహన్, ధర్మాడ్డి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. Other News
|