|
|
అనుమానాస్పదస్థితిలో డ్రైవర్ మృతి
చేవెళ్ల, ఆగస్టు 19 (టీ మీడియా): గుండెపోటు గురై ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఆదివారం తెల్లవారుజామున చేవెళ్ల మీదుగా తాండూరుకు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు గుండెలో నొప్పి వచ్చింది. ఆస్పవూతికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామానికి చెందిన సామల రవీందర్(38) నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం నుంచి లారీలో బొగ్గు నింపుకొని తాండూరుకు బయలుదేరాడు. శనివారం అర్ధరాత్రి చేవెళ్లకు చేరుకున్న డ్రైవర్ రవీందర్‌కు గుండె నొప్పి రావడంతో బెంగుళూర్-ముంబయి లింక్ హైవేపై లారీని పక్కకు నిలిపి చేవెళ్లలోని సాయిక్షికిష్ణ ఆస్పత్రి సమీపంలోకి వెళ్లగానే మృతిచెందాడు. లారీ క్లీనర్ వెంకన్న వెంటనే లారీ యజమానికి, రవీందర్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. రవీందర్‌కు గతంలో ఎన్నడూ గుండెనొప్పి రాలేదని భార్య అనిత చెప్పారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని అనిత చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని చేవెళ్ల ఏరియా ఆస్పవూతికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రవీందర్‌కు కూతురు నాగమణి, కుమారుడు సతీష్ ఉన్నారు. Other News
|