|
|
హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
షాబాద్, ఆగస్టు 12(టీ మీడియా): షాబాద్‌లో కొనసాగు తున్న ఆత్మహత్యల పరంపర పోలీసు కుటుంబాలకు సైతం సోకింది. ఈ క్రమంలోనే చేవెళ్ల డీఎస్పీ పరిధిలోని దోమ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాల్‌రాజ్(48) షాబాద్‌లోని తన నివాసంలో శనివారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సురేందర్‌డ్డి తెలిపిన వివరాల ప్రకారం... బాల్‌రాజ్‌కు కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి విధులను పూర్తి చేసుకుని ఇంటికిరాగా కడుపునొప్పి మరింత తీవ్రమైంది. కడుపునొప్పి భరించలేక ఇంట్లోని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన భార్య, కుటుంబీకులు 108 సహయంతో షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పవూతికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పవూతికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజా మున బాల్‌రాజ్ మృతి చెందాడు. దీంతో భార్య అనుసూయ, కొడుకు అరుణ్‌కుమార్, కూతురు, కుటుంబీకులు కన్నీరు మున్నీరైయ్యారు. కొడుకు అరుణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. Other News
|