Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  Crime News
బస్సు చక్రాల కిందపడి వృద్ధురాలు మృతి

వికారాబాద్ టౌన్, ఆగష్టు 12 (టీ మీడియా): బస్సు ఎటుపోతుందో తెలుసుకుందామని అడిగేందుకు వెళ్లిన వృద్ధురాలు అదే బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్సై హన్మనాయక్ కథనం ప్రకారం.. పూడూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉత్తరమ్మ (60) వికారాబాద్ బస్టాండ్‌కు వచ్చింది. అమె బంట్వారంలో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లాలనే తోందరలో బస్సు ఎటు పోతుందో తెలియక సదాశివపేట వైపు వెళ్లే ఏపీ 11 జెడ్ 2762 నంబర్‌గల బస్సును బంట్వారం పోతుందా అని అడగాటానికి వెళ్లింది. అంతలోనే డ్రైవర్ చూసుకోలేక బస్సును వెనకకు తరలించాడు. దీంతో వృద్ధురాలు బస్సు ముందు చక్రాలకింద పడిపోయి ఎడమ కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. అక్కడే ఉన్న ఓ మహిళ 108కు సమాచారం అందించింది. చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ప్రభుత్వ అసుపవూతికి తరలించారు. అప్పటికే వృద్ధురాలకు తీవ్ర రక్తం పోయి అపస్మారాక స్థితిలోకి చేరుకుంది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd