|
|
రెండు స్కూల్ బస్సులు ఢీ
కీసర, జూన్ 23 (టీ మీడియా): బ్రిలియంట్, సెయింట్ బేథాని స్కూల్ బస్సులు ఎదుదురుగా ఢీకొన్న సంఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని ఈసీఐఎల్‌కు చెందిన బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బస్సు శనివారం ఉదయం విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లడానికి కీసరకు వచ్చింది. ఆ బస్సు కీసర, చీర్యాల్, యాద్గార్‌పల్లి, అహ్మద్‌గూడ, గోధుమకుంట తదితర గ్రామాల నుంచి విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని పాఠశాలకు బయలుదేరింది. గోధుమకుంట రెవెన్యూ పరిధిలోని ప్రజయ్‌సాయి గార్డెన్ గేటు వద్ద అహ్మద్‌గూడ గ్రామం నుంచి నాగారంలోని సెయింట్ బేథాని స్కూల్ బస్సు ఎదురుగా రావడంతో ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. బ్రిలియంట్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ముందుకు పడిపోగా స్వల్పగాయాలయ్యాయి. బస్సు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదంవూడులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కీసర ఎస్సైలు వెంక ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన విషయాలను తెలుసుకున్నారు. పోలీసులు బ్రిలియంట్, సెయింట్ బేథాని పాఠశాలలకు చెందిన బస్సులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. Other News
|