అప్రకటిత కోతలు వద్దు
కందుకూరు, ఆగస్టు 19 ( టీ మీడియా ): నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ మండల పరిధిలోని పలు ్ర గామాలకు చెందిన ప్రజలు ముచ్చర్ల విద్యుత్‌సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామాల్లో తాము విద్యుత్ సమస్యలతో సతమతమవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం ముచ్చర్ల, ఊట్లపల్లి, సాయిడ్డిగూడ గ్రామాలకు చెందిన ప్రజలు ముచ్చర్ల 33/11 కెవీ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నారని దీంతో అనేక అవస్థలు పడుతున్నామని ప్రజలు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన తరువాత సాయంత్రం ఇంటి పనులు చేసుకుందామంటే కరెంట్ లేక తిప్పలు తప్పడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉదయం వేళలో విద్యుత్ లేకపోడంతో తమ పిల్లలు చదువుకోలేక పోతున్నారని చెప్పారు.
ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు, సిబ్బందికి విన్నవించుకున్నా పెడచెవిన పెడుతున్నారని వారు పేర్కొన్నారు. గ్రామాలకు సమీపంలో సబ్‌స్టేషన్ ఉన్న ప్రయోజనం మాత్రం శూన్యమని, త్రీ ఫేస్ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదన్నారు. విద్యుత్ అధికారులకు ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయి ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఏఈ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టడంతో, సిబ్బంది ఏఈ గోపికి సమాచారం అందించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌లో రెండు బ్రేకర్లు ఉన్నాయని, ప్రస్తుతం ఒకటి మాత్రమే పని చేస్తుందని తెలిపారు. ఈ బ్రేకర్ మీద ఉన్న ముచ్చర్ల, సాయిడ్డిగూడ, దాసర్లపల్లి సర్క్యూట్లకు ఒకేసారి విద్యుత్ సరఫరా చేయడంతో సమస్య తెలెత్తుతుందని తెలిపారు.
అంతే కాకుండా ఈ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరాలో కూడా సమస్య తలెత్తుతుందని తెలిపారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించడానకి కృషిచేస్తానని ఏఈ హమీ ఇచ్చారు. హామీ నెరవేర్చకపోతే, మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌తో, పాటు ప్రజాదర్బారును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్షికమంలో తేరేటి రవిముదిరాజ్, కే మల్లేశ్, చెన్నయ్య, రాజు, నర్సింహ, చంద్రమోహన్‌డ్డి, మహేందర్, రవీందర్‌డ్డి, శ్రీశైలం, సుధాకర్, చెన్నయ్య, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Other News