Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
జన నివాళి..

తెలంగాణ ఉద్యమ పితామహుడు, టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా వాసులు ఉద్యమ నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణవాదులు, జేఏసీలు, ప్రజలు వాడవాడలా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకూ పోరాడిన యోధుడని, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తని ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కడవరకూ ఉద్యమంలో పోరాడాలని, సీమాంధ్ర సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాష్ట్రాన్ని సాధించి జయశంకర్ సార్‌కు అంకితమివ్వాలని తెలంగాణవాదులు పిలుపునిచ్చారు.


టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతిని గ్రామక్షిగామాన, వాడవాడలో టీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు, తెలంగాణవాదులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.. తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితం అంకితం చేశారని పలువురు వక్తలు, నాయకులు కొనియాడారు.. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.. తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు పరి తపించారన్నారు.. సార్ లేని లోటు పూడ్చలేనిదని పలువురు నాయకులు కంటతడి పెట్టారు.. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అని పేర్కొన్నారు.. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకు అలుపెరగని పోరాటం చేయాలని కోరారు.. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించుకుందామన్నారు.. తాండూరులో జయశంకర్‌పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆస్పవూతులలో రోగులకు పండ్లు పంచారు..

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd